Health

కంటి సమస్యలపై WHO ఆందోళన

World Health Organization Expresses Concern Over Raising Eye Health Issues

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం! కానీ మనం మాత్రం కళ్ల ఆరోగ్యం గురించి ఎంత మాత్రం పట్టించుకోం.

మారుతున్న జీవనశైలి కారణంగా దృష్టిలోపాలతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

220 కోట్ల మంది దృష్టిలోపాలు లేదా అంధత్వంతో బాధపడుతున్నారు.

ప్రపంచ జనాభాలో ఇది 29 శాతం. 220 కోట్లలో వంద కోట్లకు పైగా కేసులు నివారించదగ్గవేనని దృష్టిలోపాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) విడుదల చేసిన తొలి నివేదిక వెల్లడించింది.

చిన్నపిల్లల్లో హ్రస్వదృష్టి పెరుగుతోంది

దీనికి కారణం వారు తగినంత సమయం ఇంటి వెలుపల గడపకపోవడమే!

 టాబ్లెట్లు, కంప్యూటర్లు, మొబైల్‌ఫోన్లకు అతుక్కుపోయి ఇళ్లల్లోనే గడపడం వల్ల కంటిలోని కటకం సంకోచ, వ్యాకోచ గుణాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.