Editorials

సామజిక-కళా సేవలో అగ్రస్థానంలో ఉన్న రామినేని ఫౌండేషన్-TNI ప్రత్యేకం

A Service To Telugus & Its Pride - Ramineni Foundation USA - TNILIVE Special

స్వ‌ర్గీయ డాక్ట‌ర్ రామినేని అయ్య‌న్న చౌద‌రి 1995లో అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో సిన్సినాటిలో డాక్ట‌ర్ రామినేని ఫౌండేష‌న్‌ను స్థాపించారు. భార‌తీయ సంస్క్ర‌తి, సంప్ర‌దాయాల‌ను, హిందూ ధ‌ర్మాన్ని విశ్వ‌వ్యాపితం చేయ‌డం కోసం ఫౌండేష‌న్ ప‌నిచేస్తోంది అని ఫౌండేషన్ ఛైర్మన్ రామినేని ధర్మప్రచారఖ్ పేర్కొన్నారు. గత 20సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా తెలుగు ప్రముఖులకు అవార్డులను ఇస్తూ వారి ప్రతిభను ప్రపంచానికి చాటిచెపుతోంది. దీనిలో భాగంగా 20వ అవార్డుల ప్రదానోత్సవాన్ని శనివారం నాడు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో నిర్వహించనున్నారు. కళలు, విద్యా, క్రీడా, సాంకేతిక తదితర రంగాల్లోని ప్రతిభావంతులకు ఈ పురస్కారాలను ప్రతి ఏటా అందజేస్తున్నామని ధర్మప్రచారక్ వివరించారు. ఈ ఏడాది హైదరాబాద్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు హాజరుకానున్నారని ఫౌండేషన్ భారత కన్వీనర్ పాతూరి నాగభూషణం పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ఈ ఏడాది విశిష్ట పురస్కారం అందజేయనున్నారు. ఇప్పటి వరకు రామినేని పురస్కారాలు అందుకున్న ప్రముఖుల్లో DRDO ఛైర్మన్ డా.జీ.సతీష్‌రెడ్డి, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, నటుడు కైకాల సత్యనారాయణ, నటి శారద, గాయకుడు గద్దర్, కోచ్ పుల్లెల గోపీచంద్, మహా సహస్రావధాని డా.గరికపాటి నరసింహారావు, సినీ దర్శకుడు నాగ్అశ్విన్‌రెడ్డి, బాలసాహిత్య వికాసానికి కృషి చేసిన చొక్కపు వెంకటరమణ, వేలమంది విద్యార్థులు, గురువులు ఉన్నారు.

Image may contain: 7 people

Image may contain: 8 people

స్థాపించిన నాటి నుండి డా.రామినేని ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి పురస్కారాల గురించి ఈ దిగువ బ్రోచరులో వివరాలు చూడవచ్చు….

More Links

https://archives.tnilive.com/?p=40511

https://archives.tnilive.com/?p=59445

https://archives.tnilive.com/?p=24153

https://archives.tnilive.com/?p=76361

https://archives.tnilive.com/?p=76416

https://archives.tnilive.com/?p=76987

https://archives.tnilive.com/?p=76392