Movies

Judgement? Department? Ruler?

NBK 105 Title Choices. Please vote.

నందమూరి బాలకృష్ణ – కె.ఎస్‌.రవికుమార్‌ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సి.కల్యాణ్‌ నిర్మాత. ఇటీవల ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. అయితే సినిమా పేరేంటో ఇప్పటి వరకూ చెప్పలేదు. ‘రూలర్‌’ అనే పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు ‘జడ్జిమెంట్‌’, ‘డిపార్ట్‌మెంట్‌’ లాంటి పేర్లు కూడా బయటకు వచ్చాయి. వీటిలో ఒకదాన్ని త్వరలోనే ఖరారు చేసే అవకాశాలున్నాయి. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. ఈనెల 18 నుంచి రామోజీ ఫిలింసిటీలో కొత్త షెడ్యూల్‌ మొదలుకానుంది. సంగీతం: చిరంతన్‌ భట్‌.