Fashion

మెడనలుపు పోయే చిట్కా

Telugu Fashion Tips & Tricks | How to clean your neck to avoid blackness

మెడ, వీపు… నల్లగా కనిపిస్తుంటాయి కొందరికి. ఇలాంటివారు ఏవేవో చికిత్సలు చేసుకోవడం కన్నా ఈ పూతలు ప్రయత్నించి చూడండి.
* యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ చర్మంలోని పీహెచ్‌ శాతాన్ని సమతూకంలో ఉంచుతుంది. మృతకణాలనూ తొలగిస్తుంది. దాంతో చర్మం తాజాగా మారుతుంది. రెండు పెద్ద చెంచాల యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌లో నాలుగు చెంచాల నీళ్లు కలపాలి. ఇందులో దూది ఉండను ముంచి… మెడ, వీపు భాగానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేస్తే చాలు. రోజు మార్చి రోజు చేస్తుంటే ఫలితం కనిపిస్తుంది.
* చర్మంపై పేరుకొన్న మురికితోపాటు మృతకణాలు తొలగించడంలో వంటసోడా కీలకంగా పనిచేస్తుంది. రెండు మూడు చెంచాల వంటసోడాలో నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. దీన్ని మెడ, వీపు భాగానికి పూతలా వేసి, ఆరాక కడిగేసి వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.
* రెండు పెద్ద చెంచాల సెనగపిండిలో కొద్దిగా పసుపు, సగం నిమ్మకాయ రసం వేసుకుని గులాబీనీటితో ముద్దలా చేసుకోవాలి. దీన్ని పూతలా వేసుకుని, పావు గంటయ్యాక గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ పూతను వారంలో రెండుసార్లు వేసుకోవచ్చు. చర్మం మెరుస్తుంది.
* కొందరికి వీపు భాగంపై మురికి పేరుకుపోతుంది. ఇలాంటివారు పెరుగులో కొద్దిగా నిమ్మరసం వేసుకుని వీపు భాగానికి రాయాలి. ఆరుతున్నప్పుడు మర్దన చేస్తూ కడిగేయాలి. ఈ పూత వల్ల మురికి పోవడమే కాదు, చర్మం మృదువుగానూ మారుతుంది.