Food

పాలు అరటిపండులతో బరువు పెరగరు

Telugu Food Recipes For Workout | Banana And Milk Will Not Bring Weight

సన్నబడాలనుకునే క్రమంలో కొన్ని పదార్థాలు పోషకాలు అందించేవైనా మానేస్తాం. అదే పొరపాటు అంటారు నిపుణులు. అసలు ఏ పదార్థాలు ఎందుకు, ఎప్పుడు తీసుకోవాలో చూద్దాం.

అరటిపండు తినకూడదు… ఈ పండులో ఉండే సహజ చక్కెర, నీటి శాతం బరువును పెంచేస్తాయనుకుంటాం కానీ అది అపోహే. నిజానికి ఈ పండులోని పోషకాలతో తక్షణ శక్తి లభిస్తుంది. అందుకే వ్యాయామానికి ముందు ఒకటి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. మధ్యస్థంగా ఉండే అరటిపండును తీసుకుంటే 105 కెలొరీలు, అర గ్రాము కొవ్వు, 27 గ్రా. పిండిపదార్థాలు, మూడు గ్రాముల పీచు, 14.5 గ్రా. చక్కెర, గ్రాము మాంసకృత్తులు అందుతాయి.

పాలు తాగకూడదు… వీటిని తాగడం వల్ల బరువు పెరగరు సరికదా నియంత్రణలో ఉంటారు. రాత్రిపూట నిద్రపోయే ముందు పాలు తాగాలి. వెన్నలేని పాలను ఎంచుకుంటే మరీ మంచిది. ప్రతిరోజూ గ్లాసు పాలు తాగడం వల్ల బరువేమీ పెరుగరు. కావాలనుకుంటే ఆ మోతాదు తగ్గించి, పెరుగూ తీసుకోవచ్చు.

అన్నం మానేయాలి… దీన్ని నిర్ణీత మొత్తంలో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. లేదంటే దంపుడు బియ్యం తీసుకోవచ్చు. త్వరగా ఆకలి వేయదు. పోషకాలూ అందుతాయి.

బంగాళాదుంపలు… వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనేది పూర్తిగా అవాస్తవం. పిండిపదార్థాలు మెండుగా ఉండే ఏ పదార్థమైనా పెరిగిపోరు. మీ బరువును దృష్టిలో పెట్టుకుని తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. అదే సమయంలో వాటిని ఏ విధంగా తీసుకుంటున్నారనేదీ గమనించుకోవాలి. వేయించి కాకుండా… ఉడికించి తింటే మంచిది. అదీ వారంలో రెండుసార్లు మాత్రమే తీసుకుంటే చాలు.