NRI-NRT

స్టాన్‌ఫోర్డ్‌లో ప్రారంభమైన గాంధీ-కింగ్ సదస్సు

3Day Gandhi-King Conference Starts In Stanford-Mandali Buddhaprasad

అణు యుద్ధం అంచున ఉన్న ప్రపంచానికి గాంధేయ మార్గమే శరణ్యమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో కింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో గాంధీ 150వ జయంత్యుత్యవాలను పురస్కరించుకుని మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. గాంధీజీ సిద్ధాంతాలను బలమైన అస్త్రాలుగా నిర్వచించి, అహింసా శక్తిని ప్రపంచానికి మార్టిన్‌ లూదర్‌కింగ్‌ చాటి చెప్పారని వక్తలు తెలిపారు. ఈ సదస్సులో మహాత్మాగాంధీ మనవరాలు ఇలా గాంధీ, మనవడు రాజమోహన్‌గాంధీ, మార్టిన్‌ లూదర్‌ కింగ్‌-3, ఆంథోనీ చావేజ్‌, జోనాథన్‌ గ్రనెఫ్‌, భారత కాన్స్‌లేట్‌ జనరల్‌ సంజయ్‌ పాండే, ఏపీ మాజీ సభాపతి మండలి బుద్ధప్రసాద్ తదితరలు ఈ సందర్భంగా ప్రసంగించారు. కింగ్‌ ఇనిస్టిట్యూట్‌ డైరక్టర్‌ బార్న్‌కార్టన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.