DailyDose

బందరులో మైనర్ బాలికపై అత్యాచారం-నేరవార్తలు-10/12

Minor Girl Raped In Machilipatnam - Telugu Latest Crime News-10/12

* పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్ నగర్ లో దారుణ సంఘటన చోటు చేసుకొంది. భార్య కోహెడ భాగ్యమ్మ తన భర్త అయిన కోహెడ చంద్రయ్య ను అతి కిరాతకంగా నరికి చంపింది. మృతుడు సింగరేణి ఉద్యోగస్తుడు. మృతునికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. భర్త రోజు తాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నాడని, పలు రకాలుగా వేధిస్తూ హింసిస్తున్నాడనే నెపంతోనే ఈ ఘటన కు పాల్పడిందని సమాచారం. భార్య, కుమారుడుని గోదావరిఖని 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

* విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ సంగంవలస గ్రామం వద్ద ఖైనీ, గుట్కాలును ఎస్ ఐ వీరబాబు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ ఒరిస్సా నుండి అలమండ మీదగా ఖైనీ గుట్కా లు రవాణా చేస్తుండగా సంగంవలస వద్ద సిబ్బందితో పట్టుకోవడం జరిగిందని ఆయన అన్నారు. సుమారు దీని విలువ 25 వేల రూపాయలు ఉంటుందని అన్నారు. సరుకు తోపాటు వ్యాపారి ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.

* తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో శనివారం బీజేపీ బస్‌ భవన్‌ ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు బస్‌ భవన్‌ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ని, ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డిని అరెస్ట్‌ చేశారు. దాంతో ఓ ఆర్టీసీ కార్మికుడు చెట్టు ఎక్కి నిరసన తెలిపాడు. ధర్నా నేపథ్యంలో బస్‌ భవన్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ స్థంభించడంతో జనాలు ఇబ్బంది పడ్డారు.

* వికారాబాద్ పట్టణంలో గంగారం కాలనీ కి చెందిన మహేష్ అనే బాలుడు (15) ఈ రోజు ఉదయం పాము కాటుతో చనిపోవడం జరిగింది,డాక్టర్స్ నిర్లక్ష్యం తో చనిపోవడం జరిగిందని కుటుంభ సభ్యుల ఆందోళన , ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే డా.ఆనందకుమార్.

* నిల్వ ఉంచిన మద్యాన్ని శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. ఏలూరు లోని స్థానిక బైపాస్ రోడ్డు నందుగల, సత్రంపాడు ప్రాంతంలోని అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి సమీపంలో ఉన్న సాంబశివ బ్రాందీ షాప్ వెనుకవైపున అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 3 లక్షల వరకు అక్రమ మద్యం నిల్వ ఉండవచ్చని అంచనా.

* ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నం తో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు, కార్మిక సంఘాల నేతలు శ్రీనివాస్ రెడ్డి చికిత్సపొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

* మెగాస్టార్‌ చిరంజీవిగారిపై నా అభిమాన సంఘం పేరిట సోషల్‌మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వార్తల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ పోస్టింగులకూ నాకూ ఎటువంటి సంబంధం లేదు. నాకు ట్విట్టర్‌ అక్కౌంట్లు కాని, ఫేస్‌బుక్‌ అక్కౌంట్లుగాని లేవు. నేను తిరుపతి అర్బన్‌∙డెవలప్‌మెంట్‌ అథారిటీ (తుడా) ఛైర్మన్‌గా ఉన్నరోజుల్లో చిరంజీవిగారు ఎమ్మెల్యేగా ఉండేవారు. అప్పటినుంచి ఆయనతో నాకు సత్సంబంధాలే ఉన్నాయి. శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డిగారికీ, శ్రీ చిరంజీవిగారికీ మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశంపార్టీయే ఈ దుష్ప్రచారానికి పూనుకుంది. నాకు అభిమాన సంఘాలు అంటూ లేవు. అభిమాన సంఘాలు అంటూ ఉంటే.. శ్రీ జగన్‌గారికి మాత్రమే ఉంటాయి. నేనూ జగనన్న అభిమానినే. నా అభిమాన సంఘం పేరుమీద చలామణి అవుతున్న పోస్టింగుల్ని తక్షణం తొలగించాల్సిందిగా విజ్ఞప్తిచేస్తున్నాను.

* అదో కొత్త దొంగల ముఠా.. దాని నేరశైలి పూర్తి భిన్నం.. ముఠా సభ్యులంతా ఏడాదిలో ఒకసారి యూపీ నుంచి కారులో జాలీగా బయలుదేరుతారు.. నేరుగా తిరుమల చేరుకుంటారు.. వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని, తమ పనిలో విఘ్నాలు లేకుండా చూడాలని మొక్కుకుంటారు.. వెంటనే స్టార్‌ హోటళ్లలో బస చేస్తారు.. గూగుల్‌మ్యా్‌ప్సలో ఖరీదైన కాలనీలను గుర్తిస్తారు.. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో టార్గెట్‌ను వెతుకుతారు.. ఎంచుకున్న ఇంటిని 15-20 నిమిషాల్లో గుల్ల చేస్తారు.. బంగారం, వెండి, నగదును సర్దుకుని ఉడాయిస్తారు.. తిరిగి తిరుమలకు చేరి, ఏడుకొండలవాడికి మొక్కు చెల్లించుకుని, యూపీకి వెళ్లిపోతారు.నాలుగేళ్లుగా ఇలా చోరీలకు పాల్పడుతున్న ఘరానా ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను యూపీకి చెందిన ఆదిత్యకుమార్‌, మునిరాజ్‌ రాజౌరా, సురేంద్రకుమార్‌ శర్మ, పంకజ్‌ చౌదరిగా గుర్తించారు.

* నెల్లూరు జిల్లా కొండాపురం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మీసేవ మరియు ఆధార్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. కొండాపురం మండలం భీమవరప్పాడు గ్రామానికి గ్రామానికి చెందిన విడవలపాటి మాల్యాద్రి అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా గ్రామంలో ని దాదాపు 10 మంది ఆధార్ కార్డుల నందు వయసు మార్చమని ప్రతి రోజు ఆధార్ కేంద్రానికి వస్తున్నాడు.అలా చేయటం వీలుపడదని సదరు మీసేవ నిర్వాహకుడు చెప్పినట్లు సమాచారం.ఆగ్రహించిన మాల్యాద్రి అనే వై.సి.పి. కి చెందిన వ్యక్తి శుక్రవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో 20 మంది తన అనుచరులను తీసుకొచ్చి మీసేవ నిర్వాకుడిని బయటకి లాగి అతని మీద దాడి చేసి గాయపరిచారు.

* గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామం లో అర్ధరాత్రి హత్య. గ్రామంలో లో మిరప నారు పెంచే కొమ్మినేని కొమ్మినేని రత్తయ్య చంపిన దుండగులు. అర్ధరాత్రి సంఘటన జరిగినట్లు పోలీసుల అనుమానం మృతదేహాన్ని పరిశీలించిన వినుకొండ రూరల్ సీఐ సుబ్బారావు.

* పల్నాడులో శాంతి భద్రతలు అదుపులో లేవని మాకు కొందరు ఫిర్యాదు చేశారు.డిజిపి గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు దానిపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేశాం.పల్నాడులో ఎక్కడ పొలిటికల్ హత్యలు జరుగలేదు.జరిగిన హత్యలు అన్నీ కూడా ఎలక్షన్ కు ముందు జరిగాయి.మంగళగిరిలో టిడిపి నేత హత్య పొలిటికల్ హత్యగా ఫిర్యాదు చేశారు.మంగళగిరి హత్యలో పొలిటికల్ ఇన్వాల్మెంట్ లేదు.వ్యక్తి గత కక్ష్యలే హత్యకు కారణం. కొంత మంది కావాలనే చలో ఆత్మకూరు అనే పుస్తకం పేరుతో తప్పుడు ప్రచారాలు చేశారు. 38 కేసులలో 4 కేసులు మాత్రమే వాస్తవం.

* మచిలీపట్నంలో ఇరువురు మైనర్ బాలికలపై అత్యాచారం. అత్యాచారానికి పాల్పడింది కూడా మైనర్ బాలుడే. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిథిలో ఘటన.