Sports

సానియా కసరత్తులు

Sania Mirza Sweating Heavily In Gym-Video

ప్రముఖ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తిరిగి కోర్టులో అడుగు పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తల్లి కావడంతో కొన్నాళ్లుగా ఆమె ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గర్భిణిగా ఉన్న సమయంలో సానియా బరువు పెరిగింది. ఇప్పుడు మళ్లీ ఆట మొదలు పెట్టబోతుండటంతో బరువు తగ్గించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తూ చెమటోడ్చుతోంది. ఈ నేపథ్యంలో ఆమె నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గింది. దేశానికి ఆటడమే తన ధ్యేయమని, కచ్చితంగా పూర్వ రూపు తెచ్చుకుంటానంటూ ఆత్మ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె జిమ్‌లో కష్టపడుతున్న వీడియోలను షేర్‌ చేసింది. టెన్నిస్‌ ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని పేర్కొంది. మరోవైపు సానియా నిబద్ధతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.