NRI-NRT

సౌదీలో బందరు వ్యక్తి మృతి

TNILIVE Saudi Arabia Telugu News | Guy From Machilipatnam Dies In Saudi Arabia

కృష్ణాజిల్లాలోని మచిలీపట్నానికి చెందిన అబ్దుల్ అయాజ్(59) అనే వ్యక్తి సౌదీలో హత్యకు గురయ్యాడు. నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తి అబ్దుల్‌ను హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరిగి మూడు రోజులు దాటినప్పటికీ.. అబ్దుల్ కూతురు శుక్రవారం సోషల్ మీడియాలో విదేశాంగశాఖకు ఈ వివరాలను తెలియజేసిన తరువాతే వెలుగులోకి వచ్చింది. అధికారుల కథనం ప్రకారం.. అబ్దుల్ అయాజ్ సౌదీలోని ఓ పాల కంపెనీలో సేల్స్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ వచ్చాడు. అదే కంపెనీలో పనిచేస్తోన్న నేపాల్‌కు చెందిన వ్యక్తికి, అబ్దుల్‌కు పని విషయంలో ఏదో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో నేపాల్ వ్యక్తి అబ్దుల్ మెడ మీద బలంగా గాయం చేసినట్టు తెలుస్తోంది. అబ్దుల్ తీవ్ర గాయాలతో పనిచేసే చోటే మృతిచెందినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సౌదీ అధికారులతో చర్చించాలని ఇండియన్ కాన్సులేట్‌కు భారత విదేశాంగశాఖ సూచించింది