DailyDose

నర్సంపేటలో మరో ఆర్టీసీ కార్మికుడి బలిదాన ప్రయత్నం-నేరవార్తలు-10/13

Telugu Latest Crime News Today-Khammam RTC Employee Srinivasa Reddy Dies-10/13

* వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నర్సంపేట బస్టాండ్ లో ఆర్టీసీ కార్మికుడు టీఎంయూ సెక్రటరీ బత్తిని రవి ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం…

* తూ.గో : సామర్లకోట రైల్వే గేట్ సమీపంలో అగ్నికి ఆహుతైన భారీ ట్రైలర్..షార్ట్ సర్క్యూట్ తో చలరేగిన మంటలకు దగ్ధమైన క్యాబిన్.. సురక్షితంగా ప్రమాదం నుంచి బయట పడిన డ్రైవర్ క్లీనర్..కరీంనగర్ నుంచి కాకినాడ గ్రానైట్ లోడుతో వచ్చి తిరిగి వెళ్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం, సుమారు రూ. 25 లక్షలు నష్టం.

* దేవాలయాలు టార్గెట్ చేసుకొని ఒకే కుటుంబానికి చెందిన మామ , అల్లుడు ఇద్దరు కలసి పలు దేవాలయాల్లో చోరీలు చేయడంతో విషయం తెలుసుకున్న పోలీసులు నిఘా పెట్టగా పఠాన్ చెరు పరిధిలో పట్టుకొని అరెస్ట్ చేసి కటకటాల్లోకి తరలించారు.సంగారెడ్డి జిల్లా..పఠాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రారం లోని ఎల్లమ్మ దేవాలయంలో , చందనగర్ పోలీస్ స్టేషన్, కూకట్ పల్లి పరిధిలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శివాలయంలో హుండీ లు పగలగొట్టి దొంగతనాలు చేసిన రుద్రారం గ్రామం వాసులైన ఒకే కుటుంబానికి చెందిన పెద్దింటి ఆంజనేయులు, గంగారాం సంజీవులు అనే ఇద్దరు కలిసి ఆటో కిరాయికి తీసుకొని దొంగతనాలు చేస్తున్నరు . ఆ వ్యక్తులను అరెస్ట్ చేసి, వారివద్ద నుండి ఎనిమిది వేల నగదు తో పాటు ఒక ఆటో స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినామాన్ని డ్శ్ఫ్ రాజేశ్వర్ రావు మీడియా సమావేశంలో తెలిపారు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేడు 9వ రోజుకు చేరుకున్న సమ్మెలో భాగంగా కార్మికులు నాయకులంతా బస్టాండ్ ఆవరణలో బయట గేట్ల ముందు నినాదాలు చేస్తుండగా పోలీసులకు మద్య చిన్న తోపులాట జరిగింది. ఈ క్రమంలో నూర్ జాన్ బి అనే లేడీ కండక్టర్ కింద పడడంతో వెంటనే సింగరేణి హాస్పిటల్ కి తరలించారు

* హైదరాబాద్:- కాంచన్ బాగ్ డృడో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని భారీ బందోబస్తు నడుమ తన సొంత ఊరు ఖమ్మం కు తరలించిన పోలీసులు.

* మహానగరం ముంబైలోని చరనీ రోడ్డు వద్దనున్న డ్రీమ్‌ల్యాండ్ సినిమా థియేటర్ సమీపంలోని ఒక బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. ఇప్పటి వరకూ ఆ భవనంలో చిక్కుకున్న ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదం నేపధ్యంలో ఆ ప్రాంతమంతా నల్లటి పొగతో నిండిపోయింది. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

* మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వస్తున్న వదంతులను నమ్మొద్దు….ఎవరైనా అలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తే వారి పై కఠిన చర్యలు తప్పవు…వివేకా హత్య కేసులో సునీల్ గ్యాంగ్ ప్రమేయం అని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం…అవాస్తవలను ప్రచురించిన వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు..

* రాజధాని క్విటోలో గత 11 రోజులుగా నడుస్తోన్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. పోలీసులు, నిరసనకారులకు మధ్య శనివారం జరిగిన ఘర్షణలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.ఈక్వెడార్​ ప్రభుత్వం ఇంధన ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 11 రోజుల నుంచి నిరసనలు చేస్తున్నారు ఈక్వెడార్​ వాసులు.

* హగీబిస్’​తుపాను​ ధాటికి జపాన్​ విలవిలలాడుతోంది. వరదల కారణంగా 11 మంది మరణించగా.. 10 మందికి పైగా గల్లంతయ్యారు. మరో 100 మంది గాయపడ్డారు.

* బికనీర్‌లో ఈ ఉదయం 10.36 గంటలకు భూకంపం సంభవించింది. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని వాతావరణశాఖ విభాగం తెలిపింది. గడిచిన సోమవారం భూటాన్‌లో సంభవించిన భూకంపానికి అసోం ప్రభావితమైన విషయం తెలిసిందే.

* లలితా జ్యువెలరీ కేసు.. తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన ముద్దాయి మురుగన్‌ బెంగళూరు కోర్టులో లొంగిపోయాడు. మురుగన్‌ నుంచి 10 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే.. బంగారం తమదేనని కర్ణాటక, తమిళనాడు పోలీసులు వాదిస్తున్నారు. బెంగళూరులో చోరీ చేసిన బంగారమేనని కర్ణాటక పోలీసులు చెబుతున్నారు. మరోవైపు.. లలిత జ్యువెలరీ మార్క్‌ ఉన్న బంగారం తమదేనని తమిళ పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. మురుగన్‌ కస్టడీపైనా కర్ణాటక, తమిళనాడు పోలీసులు వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా.. ఈనెల 2న తమిళనాడులోని తిరుచ్చి బస్టాండ్ సమీపంలోని లలితా జ్యువెల్లరీలో భారీ చోరీ జరిగిన విషయం విదితమే.