Business

భారత సంతతి వ్యక్తికి ఆర్థిక శాస్త్ర నోబెల్

Abhijeet Banerjee Wins 2019 Economics Nobel Prize

ఆర్థిక‌శాస్త్రంలో నోబెల్ గెలిచిన రెండ‌వ భార‌తీయ సంత‌తి వ్య‌క్తిగా అభిజిత్ బెన‌ర్జీ నిలిచారు.

గ‌తంలో అమ‌ర్త్యాసేన్ ఎక‌నామిక్స్‌లో నోబెల్ గెలిచారు. ఈ ఏడాది ప్ర‌క‌టించిన నోబెల్ అవార్డుల్లో అభిజిత్‌కు ఆర్థిక‌శాస్త్రంలో అవార్డు ద‌క్కింది.

పేదరిక నిర్మూల‌న కోసం అభిజిత్ ప్ర‌తిపాదించిన ప‌రిశోధ‌నా న‌మూనాలు ఎంతో ఉప‌యుక్తంగా ఉన్నాయ‌ని నోబెల్ క‌మిటీ చెప్పింది.

ఫిబ్ర‌వ‌రి 21, 1961లో అభిజిత్ ముంబైలో జ‌న్మించారు. కోల్‌క‌త్తా వ‌ర్సిటీలో గ్రాడ్యుయేష‌న్ చేశారు. జ‌వ‌హ‌ర్‌లాస్ వ‌ర్సిటీ నుంచి పీజీ చేశారు. 1988లో అమెరికాలోని హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు.

క్యాంబ్రిడ్జ్ లోని మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ఫోర్డ్ ఫౌండేష‌న్‌లో ఆర్థిక‌శాస్త్ర ప్రొఫెస‌ర్‌గా చేస్తున్నారు.

2003లో అబ్దుల్ ల‌తీఫ్ జ‌మీల్ పావ‌ర్టీ యాక్ష‌న్ ల్యాబ్‌ను అభిజిత్ ప్రారంభించారు. దాంట్లో డుఫ్లో, సెంథిల్ ములైనాథ‌న్‌లు కూడా ఉన్నారు.

ఆ ప‌రిశోధ‌న‌శాల‌కు అభిజిత్ డైర‌క్ట‌ర్‌గా ఉన్నారు.

యూఎన్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌లోని డెవ‌ల‌ప్‌మెంట్ ఎజెండాలోనూ అభిజిత్ స‌భ్యుడిగా ఉన్నారు.