Politics

సిద్ధాంతరహిత నాయకుడు చంద్రబాబు ఒక్కడే

Chandrababu Is The Only Politician Without A Policy - Vijayasai Reddy

యూ ట‌ర్న్ అనే ప‌దం ఇప్పుడు రాజ‌కీయాల్లో ఎక్కువ‌గా వినిపిస్తోంది.

తాజాగా ఇదే పదంపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేశారు.

‘యూ-టర్న్ అనే పదం 1930 ప్రాంతంలో వాడుకలోకి వచ్చిందని ప్రఖ్యాత మెరియం వెబ్‌స్టర్ ఇంగ్లిష్ డిక్షనరీ చెబుతోంది.

ఇప్పటి దాకా లెక్కలేనన్ని సార్లు దాన్ని ఆచరణలో పెట్టిన రికార్డు చంద్రబాబుదే.

అవకాశవాదం, కాళ్లు పట్టుకోవడం తప్ప ఒక సిద్ధాంతం అంటూ లేని నాయకుడు ఇతనొక్కడే.

వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.5,510 కోట్లు విడుదల చేశారు.

50 లక్షల రైతు కుటుంబాలకు, కౌలు రైతులకు రూ.12,500 చొప్పున సాయం అందుతుంది. నోరు పెగలడం లేదు కదా చంద్రబాబు.

మీరు కలలో కూడా ఊహించి ఉండరు రైతులను ఈ విధంగా ఆదుకోవచ్చని.

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో భారీ అవకతవకలు జరిగాయని..

ఎక్కువ ధరకు కరెంట్ ను కొనుగోలు చేయడంతో రాష్ట్ర ఇంధన రంగంపై అధిక భారం పడిందని’ విజయ సాయిరెడ్డి ఆరోపించారు.