Food

యాలకులతో శృంగార సామర్థ్యం మెరుగు

Elaichi Helps Fight Impotency And Improve Sexual Ability

యాలకులు… వీటిని మనం ఎక్కువగా వంటల్లో వేస్తాం. తీపి వంటకాల్లో యాలకులను వేయడం వల్ల వాటికి చక్కని రుచి, వాసన వస్తాయి. దీంతో ఆయా వంటకాలు రుచికరంగా ఉంటాయి. అయితే యాలకులు కేవలం వంటలకే కాదు, వీటి వల్ల మనకు ఆరోగ్యపరంగా కూడా అనేక లాభాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ యాలకులను తినాలి. ఇవి పురుషులకు ఉండే శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయి. శృంగారంలో యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. సంతాన సాఫల్యత అవకాశాలను పెంచుతాయి.

2. భోజనం చేసిన వెంటనే ఒకటి రెండు యాలకులను నములుతూ ఉంటే నోటి దుర్వాసన పోతుంది. జీర్ణ సమస్యలు ఉండవు.

3. ఆస్తమా, దగ్గు, జలుబును తగ్గించడంలో యాలకులు మెరుగ్గా పనిచేస్తాయి. రోజుకు మూడు, నాలుగు సార్లు కొన్ని యాలకులను తీసుకుని బాగా నమిలి చప్పరిస్తే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

4. యాలకులను రోజూ తింటుంటే గుండె సమస్యలు పోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది.

5. రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ యాలకులను తినాలి. దీంతో రక్తం పెరుగుతుంది.

6. శరీరంలో ఉన్న విష, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది.

7. రెండు, మూడు యాలకులు, లవంగాలు, చిన్న అల్లం ముక్క, ధనియాలను తీసుకుని పొడి చేయాలి. దీన్ని ఒక గ్లాస్ వేడి నీటిలో కలుపుకుని తాగితే అజీర్ణ సమస్య పోతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి.