Health

ఆఫీసులో ఓ కునుకు వేయండి

Power Naps At Work Are Really Good For Health And Productivity

ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే… పురుషులతో పోలిస్తే… స్త్రీలకు అందే పదోన్నతులు కొంత తక్కువే. తమ కెరీర్‌కి అవరోధం ఏర్పడటానికి కారణం తాము ఆడవాళ్లం కావడమేనని దాదాపు 29 శాతం మంది మహిళలు భావిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడిని అధిగమిస్తూ… తమని తాము మెరుగుపరుచుకోవడానికి ఈ సూత్రాలూ పాటిస్తే ఫలితం ఉంటుంది. సాధారణంగా ఉద్యోగినులకు పొద్దుటిపూట ఓ పదినిమిషాలు కూర్చుని టిఫిను తినే సమయం ఉండదు. అలాంటివారు ఓ పని చేయొచ్చు. మీ వెంట ఓ శాండ్‌విచ్‌ లేదా రెండు పండ్లు తీసుకెళ్లండి. ఆఫీసుకు వెళ్తూ తినొచ్చు. కుదిరితే గ్లాసు పాలు తాగినా చాలు. శరీరానికి కొంత శక్తి అందుతుంది. ఉద్యోగినులకు ఎదురయ్యే మరో సమస్య నిద్రలేమి. ఒక్కోసారి కనీసం ఐదారుగంటలైనా నిద్రపోరు. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే ఆ ప్రభావం తరువాతి రోజుపై పడుతుంది. క్రమంగా అనారోగ్యాలు చుట్టుముడతాయి. అందుకే ఓ పని చేయండి. అవకాశం ఉన్నప్పుడల్లా పది నుంచి పదిహేను నిమిషాలు కునుకు తీసేందుకు ప్రయత్నించండి. దీన్ని పవర్‌న్యాప్‌ అంటారు. అలాచేస్తే రోజంతా చురుగ్గా ఉండొచ్చని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు తొంభైశాతం మంది ఉద్యోగినులు ఎదుర్కొనే సమస్య ఒత్తిడి. దానికి మొదటి కారణం సరైన ప్రణాళిక లేకపోవడం అయితే… రెండోది సాంకేతిక పరిజ్ఞానం అంటారు నిపుణులు. ఏం చేస్తారంటే…వారంలో ఓ రోజు నో టెక్నాలజీ డే పెట్టుకోండి. ఆ రోజంతా ఫోన్లు, కంప్యూటరు, ల్యాప్‌టాప్‌ జోలికి వెళ్లకండి. లేదా రోజులో వీలైనన్ని గంటలు ఈ సూత్రాన్ని పాటించేందుకు ప్రయత్నించండి. చాలామంది ఉద్యోగినులు తమకు సంబంధించిన విషయాలు సహోద్యోగులతో పంచుకుంటారు. అందులో వ్యక్తిగతమూ ఉంటుంది. అదే గాసిప్‌లకు దారితీస్తుంది. అలాంటి సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే..సహోద్యోగులతో ఎంత సన్నిహితంగా ఉంటున్నా సరే… వ్యక్తిగత విషయాలను పంచుకునే ప్రయత్నం వద్దు. ఆ సరిహద్దు మీకు మీరే గీసుకోండి.