DailyDose

ఆంధ్రాబ్యాంకులో ₹3.47కోట్ల చోరీ-నేరవార్తలు-10/14

Telugu Latest Crime News|3.47Crores Theft In Andhra Bank

* యాదమరి మండలం అమర్ రాజా ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న ఆంధ్ర బ్యాంకు లో భారీ దోపిడీ రూ.3.47 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ. సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు పోలీసులు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు. వివరాలు తెలియాల్సి ఉన్నది.

* రాష్ట్ర లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డికి రెండురోజుల అనిశా కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మధుసూదన్‌రెడ్డి రిమాండ్‌లో ఉన్నారు. చంచల్​గూడ జైలు నుంచి నాంపల్లిలోని అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి అతన్ని తరలించారు.

* వామపక్ష విద్యార్థి సంఘాల విద్యార్థులను బస్ భవన్ వద్ద అరెస్టు చేసిన పోలీసులు

* గన్నవరం గాంధీ బోమ్మ సెంటర్‌లో ఇద్దరి పండ్ల వ్యాపారస్తుల మధ్య వివాదం తలెత్తింది. అరటి పండ్ల కత్తితో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకరికి గాయాలు అయ్యాయి. గాయాలతో గన్నవరం పోలీసులను పండ్ల వ్యాపారి ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* ఉత్తరప్రదేశ్‌లోని మవు జిల్లా మొహమ్మదాబాద్‌లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. 15 మంది గాయపడ్డారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

* తప్పిన పెను ప్రమాదం. దూసుకుపోయిన Xఊవ్500 వెకిల్. సీతారాంపురం లాల్ బహుదూర్ శాస్త్రి వీధిలో సంఘటన. అతివేగంగా వచ్చి షాపులోకి వెళ్లిన కారు. ధ్వంసమైన గూడ్స్ ఆటోలు బైకులు. ఉదయం కావడంతో జనం లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నట్లు అనుమానం. అతివేగమే ప్రమాదానికి కారణం అంటున్న స్థానికుల

* విద్యుత్ వైర్లు తెగి పడటంతో వాటిని తగిలి ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఈ విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సూరివాసవీధిలో విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. అవి తగిలి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను సోమేష్‌, లోకేష్‌గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

* మహారాష్ట్రలోని మెగ్వాడి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ష మొలలకు చికిత్స చేస్తానని చెప్పి మహిళపై అత్యాచారం  చేసిన వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వన్షరాజ్ ద్వివేదీ (57) అనే వైద్యుడు జోగేశ్వరీలో నివసించేవాడు. . 2015లో 27 ఏళ్ల మహిళ పైల్స్ వ్యాధితో బాధపడుతూ ద్వివేదీ వద్దకు వెళ్లింది. డాక్టరు ఆమెకు ఇంజెక్షన్ ఇవ్వగానే నిద్రలోకి జారుకుంది. స్పృహలేని ఆమెపై డాక్టర్ అత్యాచారం చేశాడు.

* హైదరాబాద్ కూకట్‌పల్లిలోని వై జంక్షన్ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ముందు వెళుతున్న బస్సును వెనక నుంచి వచ్చిన మరో బస్సు ఢీకొంది. అయితే ఢీకొన్న బస్సు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. బస్సులు ఢీకొనగానే భయంతో వాహనదారులు పరుగులు తీశారు. డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు వాహనదారులు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదం సోమవారం చోటుచేసుకుంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా కొన్ని బస్సులను అద్దెకు తీసుకుని నడుపుతోంది. ఈ బస్సులను నడుపుతున్నది తాత్కాలిక డ్రైవర్లు కావడం విశేషం. ఇక ఈ బస్సుల్లో ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడైతే ఆర్టీసీ బస్సులను తాత్కాలిక డ్రైవర్లు నడపడం ప్రారంభించారో పలు చోట్ల ప్రమాదానికి గురైన సంఘటనలు వెలుగు చూశాయి.

* నాలుగు రోజుల పాటు జ్వరంతో బాధపడిన సిమాాంచల్ మల్లిక్ (52) అనే వ్యక్తి చనిపోయాడని భావించిన ఆయన కుటుంబ సభ్యలు అంతిమ సంస్కారంలో భాగంగా చితికి నిప్పుపెడుతుండగాా లేచి కూర్చున్నాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గంజాం జిల్లా లావుఖాలో జరిగంది. లావుఖాకు చెందిన సిమాంచల్ మల్లిక్ శనివారం మేకలు మేపేందుకు అడవికి వెళ్లాడు. అయితే మేకలు సాయంత్రం ఇంటికి వచ్చాయి. సిమాంచల్ మాత్రం ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆయన కోసం వెతికారు. అడవిలో మల్లిక్ సిమాంచల్ ను గుర్తించిన ఆయన కుటుంబ సభ్యులు లేపేందుకు ప్రయత్నించారు. అయితే సిమాంచల్ మల్లిక్ లో చలనం లేకపోవడంతో చనిపోయాడని భావించారు.