ఐటీ సర్వ్ సహకారంతో చికాగోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 250 చేనేత ఆసు యంత్రాలకు నిధుల సేకరణ చేపట్టినట్లు అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తెలిపారు. తెలంగాణా ప్రభుత్వంతో చేనేత కార్మికులను ఆదుకునే లక్ష్యంతో తానా,తానా ఫౌండేషన్‌లు ఒప్పందం చేసుకుని సబ్సిడీకి ఆసు యంత్రాలను వారికి అందించే ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సేకరణ కార్యక్రమాన్ని చికాగోలో నిర్వహించారు. ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరించిన కానూరు హేమా, కృష్ణమోహన్, భావనా, బయ్యన బాబురావు తదితరులకు జయశేఖర్ ధన్యవాదాలు తెలిపారు.
250 ఆసు యంత్రాలకు తానా నిధుల సేకరణ
Related tags :