DailyDose

తూగో పడవ ప్రమాదస్థలి వద్ద తలలేని మృతదేహం దొరికింది-నేరవార్తలు-10/20

New deadbody without head found in papikondalu boat accident-telugu crime news today

* తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో మరో మృతదేహం లభ్యమైంది. తలలేని మృతదేహం కొట్టుకురావడాన్ని స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న అధికారులు మృతదేహాన్ని పరిశీలించి ఆస్పత్రికి తరలించారు. కాగా, గత నెలలో కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన బోటును వెలికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బోటుకు లంగరు వేసేందుకు గజ ఈతగాళ్లు ఆక్సీజన్ మాస్క్‌లతో నదిలోపలికి వెళ్లారు. బోటు వెలికితీత కోసం కాకినాడకు చెందిన సత్యం బృందం గత కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. తూర్పుగోదారి జిల్లా కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటు వ్యవహారంలో బాలాజీ మైరన్ ధర్మాడి సత్యం కాస్త పురోగతి సాధించిన విషయం తెలిసిందే. శనివారం నాడు గాలింపు చర్యల్లో భాగంగా ఓ లైఫ్‌బాయ్‌ దొరికింది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ… ఎంత ఖర్చయినా సరే బోటు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. అయితే.. పడవ ప్రమాదం జరిగిన చోట సుడిగుండాలు నీటి ప్రవాహం వేగం ఎక్కువగా ఉండటం వల్ల బోటు వెలికి తీయడం కాస్త కష్టమవుతోందన్నారు. ఇప్పటికే బోటుకి సంబంధించిన ఆనవాళ్ళు కొన్ని బయటికొచ్చాయన్నారు. 50 అడుగుల లోతుల్లో ఉన్న బోటుకు లంగరు వేయడానికి వైజాగ్‌కు చెందిన గజ ఈతగాళ్ళను తీసుకొచ్చారని మంత్రి చెప్పుకొచ్చారు. ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించి పరిస్థితిని సీఎం జగన్‌కు తెలుపుతున్నారని మంత్రి తెలిపారు. బోటు ప్రమాదంలో గాయపడిన వారికి, ప్రమాదం నుంచి బయటపడిన వారికి, చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరుపున నష్టపరిహారం అందించామని మంత్రి కన్నబాబు మీడియాకు వెల్లడించారు.

* దాచేపల్లి మండలం పెదగ్గార్లపాడు లో ఆరేళ్ల మైనర్ బాలికపై నరేంద్ర రెడ్డి (18) అత్యాచారం యత్నం దాచేపల్లి మండలం , పెదగార్లపాడు లో ఆరేళ్ళ మైనర్ బాలికపై మైనర్ బాలుడు నరేంద్ర రెడ్డి అత్యాచార యత్నం బాలికను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచంగా మెరుగైన వైధ్యం కోసం నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. న్యాయం చేయకుండా కేసును నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో మైనర్ బాలిక బందువుల ఆందోళన బాలుడు పై కేసు నమోదు

* శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుకున్న డీఆర్ఐ అధికారులు. బంగారాన్ని పేస్ట్ రూపంలో చేసి వాటికి నలుపు రంగు కోటింగ్ వేసి తరలిస్తున్న ముఠా సభ్యులు. 724 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసిన డీఆర్ఐ అధికారులు. వీటి విలువ సుమారు 28 లక్షలు ఉంటుందన్న అధికారులు. ముంబై నుండి హైదరాబాద్ అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు. 1962 కస్టమ్స్ యాక్ట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు.

* ఖమ్మం నగరంలో తరుచూ దొంగతనాలకు పాల్పడుతు తప్పించుకుతిరుగుతున్న ఓ పాత నెరస్తుడిని ఖమ్మం సైబర్ క్రైం,నగర పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో అదుపులో తీసుకున్నారు. మీడియా సమావేశంలో ఖమ్మం టౌన్ ఏసీపీ గంట వెంకట్రావు మాట్లాడుతూ
ఖమ్మం జిల్లా రూరల్ మండలం ముత్తుగూడెం గ్రామానికి చెందిన పాత నెరస్తుడు నాగేల్లి వర కుమార్ అనే వ్యక్తి నగరంలోని బుర్హాన్ పురం,విజయనగర్ కాలనీ,సాగర్ కాల్వ ప్రాంతంలో ని ఇళ్లల్లో సెల్ ఫోన్లు,లాప్ టాప్ లు దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించమన్నారు. అతని వద్ద నుంచి మూడు లక్షల విలువ చేసే బంగారు పుస్తెల తాడు,రెండు లాప్ టాప్ లు,ముప్పే ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులో తీసుకొని సొత్తు స్వాధీనం చేసుకున్న ఖమ్మం సైబర్ క్రైమ్,సీసీఎస్,టూ టౌన్ సిఐలను, సిబ్బందిని ఏసీపీ గంటా వెంకట్రావు అభినందించారు.

* వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణం లోని వల్లబ్ నగర్ లో అర్ధరాత్రి ఆర్మీ జవాన్ పై గుర్తు తెలియని దుండగులు కత్తి మరియు స్కృ డ్రైవర్లతో హత్యకు పాల్పడ్డారు.వివరాల్లోకి వెళితే రాత్రి … హనుమకొండ ప్రేమ్ కుమార్ సి ని మా చూస్తున్న క్రమంలో వారి ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇ రోజు బర్త్డే పార్టీ ఉందని వలబ్ల్ నగర్ రోడ్డు కు రమ్మని చెప్పడంతో సినిమా థియేటర్ నుంచి ప్రేమ్ కుమార్ బయలుదేరడు. అప్పటికె వారు మద్యం సేవించి ఉండగా ప్రేమ్ కుమార్ అక్కడికి చేరుకొని వారితో కలసి ప్రేమ్ కుమార్ కూడా మద్యం సేవించాడు . మద్యం సేవించిన తర్వాత బర్త్డే కేక్ కట్ చేసుకుని కేక్ కట్ చేసిన అనంతరం మిత్రుల మధ్య గొడవ మొదలవడంతో కొంతమంది ప్రేమ్ కుమార్ ను స్కూల్ డ్రైవర్ కత్తితో పొడిచి అక్కడి నుండి వారు పారిపోయారు. స్పృహ కోల్పోయి ఉన్న ప్రేమ్ కుమార్ ను స్థానికులు గమనించి ఏరియా ఆసుపత్రికి తరలించారు . అప్పటికే ప్రేమ్ కుమార్ చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.

* కొత్తకోట మండలం పాలెం గ్రామం జాతీయ రహదారి 44 పై, తెల్లవారుజామున 4 గంటల సమయంలో, డీసీఎం వాహనాన్ని ఢీ కొట్టిన, ఉర్కకోండ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు. డ్రైవర్ కు స్వల్ప గాయాలు. ప్రయాణికులు సురక్షితం. తప్పిన పెను ప్రమాదం. డ్రైవర్ నిద్దురలోకి జారుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రయాణికులు తెలిపారు.

* ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో లెబనాన్​లో నిరసనకారులు కదం తొక్కారు. తీవ్ర ఆర్థికసంక్షోభం నుంచి బయటపడేందుకు కొత్త పన్నులు విధించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. రాజధాని బీరుట్ సహా పలు నగరాల్లో నినాదాలతో ప్రదర్శనలు నిర్వహించారు. నగరమంతా ఆందోళనలతో ఉద్రిక్తంగా మారింది. ఆర్థిక వ్యవస్థ పతనానికి….నేతల అవినీతే కారణమని ఆరోపించారు. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చటం వల్ల ప్రభుత్వం దిద్దుబాటుచర్యలు చేపట్టింది

* బార్సిలోనాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు పోలీసులతో సహా 400 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 128 మందిని అరెస్టు చేశారు అధికారులు.

* జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాలు ఆదివారంనాడు మరోసారి తెగబడ్డాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కుప్వారా జిల్లాలోని తాంఘర్ సెక్టార్‌లో పాక్ బలగాలు కాల్పులు జరపడంతో ఇద్దరు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు

* తాడేపల్లి టౌన్ ప్రకాష్ నగర్ లోని ఒక నివాసంలో పేలుళ్ళు కలకలం తెల్లవారు జామున 4 గంటలకు పేలుడు పైడమ్మ అనే మహిళకు దేహానికి మంటలు అంటుకుని తీవ్ర గాయాలు పేలుడు ధాటికి విరిగిన ఐరన్ గేట్స్, తలుపులు పేలుళ్లకు గల కారణాలు తెలియాల్సి ఉంది గాయపడ్డ మహిళను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించిన స్థానికులు ఫ్రిజ్ నుంచి వెలువడిన గ్యాస్ కారణంగానే ప్రమాదం జరిగిందని తెలిపిన పోలీసులు

* తాడిపత్రిలోని కడప రోడ్ నందు స్టీల్ ప్లాంట్ వద్ద లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు,ఆసుపత్రికి తరలింపు.

* బెలుగుప్పలో బోర్డు తిప్పేసిన మహాలక్ష్మి వేర్ హౌస్, రైతుల పేరుతో బ్యాంకుల్లో 8 కోట్లు రుణాలు తీసుకున్న గౌడన్ నిర్వహకులు హరికృష్ణ ,నిల్వ ఉంచిన పప్పుశనగను తరలించడానికి ప్రయత్నించిన బ్యాంకర్లు, రైతులు ఆందోళన.

* నెల్లూరు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో కామిరెడ్డి పురుగులమందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసాడు. గమనించిన పోలీసులు హుటాహుటిన ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో ఆత్మకూరు లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్న పోలీసులు.