Videos

ప్రేమనగర్ “నేను పుట్టాను” పాటకు పేరడీ

Parody Song For Nenu Puttaanu From Premnagar

ప్రేమనగర్ సినిమా పాటని ఎవరు పేరడీగా రాసారో గాని భలే రాశారు ..

నేను పుట్టాను,
లేండ్ లైన్ వచ్చిందీ …
నేను ఏడ్చాను,
సెల్ పోన్ వచ్చిందీ …
నేను నవ్వాను,
స్మార్ట్ ఫోన్ వచ్చింది.
నాకింకా లోకంతో పని ఏముంది.
డోన్ట్ టాక్. ॥నేను పుట్టాను … ॥

1వ. చరణం:
మనిషిని మనిషిని కలిపేటందుకు
లేండ్ లైన్ వచ్చిందీ …
ఎవరికి దొరకక తిరిగేటందుకె
సెల్ ఫోన్ వచ్చిందీ …
ఒంటరి తుంటరి బ్రతుకు కోసమై
స్మార్ట్ ఫోన్ పుట్టిందీ …
అందరి బుర్రలు నమలడానికే
వాట్సాప్ వెలిసింది.
డోన్ట్ టాక్. ॥నేను పుట్టాను … ॥

2వ చరణం:
లేండ్ లైన్ మ్రోగితే,
అందరి గుండెలు ఆనందించాయీ …
సెల్ ఫోన్ మ్రోగితే,
అందరి మనసులు చిరాకు పడ్డాయీ …
స్మార్ట్ ఫోన్ తో,
అందరి బ్రతుకులు చతికిల బడ్డాయీ …
తెల్లవారినా అవి,
కొంచెం కూడా బాగవ కున్నాయి.
డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను …॥

3వ చరణం:
వాట్సాపులో వసతులతోటీ,
షరతులు వున్నాయీ …
హద్దు మీరితే అంతు తెలియనీ,
శిక్షలు పడతాయీ …
స్మార్ట్ ఫోనులో భాషల కుండే,
సొగసులు తగ్గాయీ …
ఎమోజీ(emoji) లతో,
ఎవరికి తెలియని భాషలు పుట్టాయి.
డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను … ॥

4వ చరణం:
మనుషుల మనసులు,
కలిపేటందుకె ఫోనులు వున్నాయీ …
ఏ ఫోనైనా,
మంచిగ వాడే మార్గాలున్నాయీ …
మంచిగ వాడని,
ఫోనుల కెపుడూ వైరస్ లొస్తాయీ …
వాట్సాపులో,
పెట్టేటందుకె నీతులు వున్నాయి.
డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను … ॥

5వ చరణం (ఆఖరి చరణం):
గంటలు రోజులు స్మార్ట్ ఫోనులో,
వాగుతు గడిపేసెయ్ …
ఫోన్లో వున్న బేటరి తీసి,
బయటకు పారేసెయ్ …
వైఫై సిగ్నల్ ఆపేసెయ్ …
సిమ్ము కార్డును విసిరేసెయ్ …
డ్రైవ్ ద డేటాకార్డ్ ఔట్ …
హహ్హహ్హహ్హహ్హ !!!

॥నేను పుట్టాను …॥???
https://www.youtube.com/watch?v=AFqre4L64HE