Food

డీటాక్స్ డైట్ అంటే…?

Telugu Food News - What is detox diet?

ఉరుకుల పరుగుల ఈ యాంత్రిక జీవితంలో వారంలో ఒక్క రోజైన విశ్రాంతి దొరికితే బాగుండని అనుకోవడం సహజం. శరీరం నూతనోత్తేజం పొంది మళ్లీ దైనందిన జీవితంలోకి రావడానికి ఈ ఒక్కరోజు ఉపయోగపడుతుంది. సరిగ్గా మన ఆహారం విషయం కూడా ఇలానే ఉంటుంది. వారం అంతా ఏం తింటున్నామో.. ఎప్పుడు తింటున్నామో తెలియని పరిస్థితి. వారం మొత్తం తిన్న ఆహారం వల్ల పేరుకుపోయిన మలినాలను ఒక రోజు వాటిని తొలగించే విధంగా ప్రయత్నం చేయడం కూడా అంతే ముఖ్యం. అది కూడా మందులు, ఆకు పసరులతో మాత్రం కాదు. ఆహారంతో ఏర్పడిన మలినాలను, ఆహారంతోనే తొలగించవచ్చు… దీనినే డిటాక్స్‌ డైట్‌ అంటారు.

గాలి, నీరు, ఆహారం.. అన్నీ కలుషితం అవడంతో శరీరం మొత్తం మలినాలతో నిండిపోయి ఉంటుంది. దీంతో శరీరంలో అ వయవాల పనితీరు కూడా పూర్తిగా మారిపోతుంది. ఈ మలినాలను తొలగించే పద్ధతిని డిటాక్సిఫికేషన్‌ అంటారు. ఆహారం ద్వారా మలినాలను తొలగించడాన్ని డిటాక్స్‌ డైట్‌ అంటారు.

వారంలో ఆరురోజులు పాటు తీసుకునే ఆహారానికి ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. అంటే 24 గంటలపాటు డైట్‌ ను పూర్తిగా పాటించాలి. ఆ రోజు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్ధాలు ఉండటమే ఈ డైట్‌ ప్ర ధానాంశం. బార్లీ, సబ్జా నీళ్లు, నిమ్మరసం, 8 నుంచి 10 గ్లాసుల నీరు ఈ డైట్‌లో ప్రధాన ఆహార పదార్ధాలు. వీటితోపాటు పండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు కూడా తీసుకోవచ్చు. అంతేకాక ఉప్పుని తిననివారు ఆ ఒక్క రోజు ఆహారంలో ఉప్పు ఉండేలా చూసుకోవాలని కూడా ఈ డైట్‌ చెబుతుంది. ఉప్పు తగినంత తీసుకోకపోవడం వల్ల శరీరంలో సోడియం తగ్గి మలనాలు చేరతాయని డైటీషియన్లు చెబుతున్నారు. శరీరంలో మలినాలు మూ త్రం ద్వారా బయటకు పంపడానికి ఎక్కువుగా ద్రవ పదార్ధాలు ఉపయోగపడతాయి. ఈ డైట్‌ పాటించే రోజు తీపి పదార్ధాలు, బేకరి ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

ఈ డైట్‌ను పాటించడానికి వయసుతో సంబంధం లేదని వైద్యులు తెలుపుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌లో రుచి కోసం అజిన్‌మెటో అనే పదార్ధం కలుపుతారు. దీని వలన శ రీరంకు కావల్సిన ముఖ్యమైన ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌-సి, బి-12 వంటివి పూర్తిగా మాయమై కేన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరి స్తున్నారు. అంతేగాక మలినాలను ఎప్పటికప్పుడు తొలగించకపోతే అవి ప్రమాదకర స్థాయికి చేరతా యంటున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ఫాస్ట్‌ఫుడ్‌ తినడం మానని వారు కనీసం వారంలో ఒక రోజైన డిటాక్స్‌ని పాటించడం మంచిదని స్పష్టం చేస్తున్నారు. మీ పనులను చేసుకుంటూ ఈ డైట్‌ను కొనసాగిచవచ్చని కూడా తెలుపున్నారు. కొంతమంది కీటో, వీగన్‌, పేగన్‌, రా లాంటి డైట్‌లు పాటిస్తుంటారు. వారు కూడా వారంలో ఒకరోజు డిటాక్స్‌ డైట్‌ను పాటించవచ్చు అని వైద్యులు తెలుపుతున్నారు. కానీ వీరు మాత్రం అప్పుటివరకు ఆహార నియమాలను పాటించాలి.