Politics

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు

Indian Central Cabinet Takes Key Policy Decisions

కేంద్ర కేబినేట్ బుధవారం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. దేశ రాజధాని డిల్లీలో అక్రమ కాలనీలను రెగ్యులర్ చేస్తూ కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది, ఈ నిర్ణయంతో దిల్లిలో నివసిస్తున్న 40 లక్షల మందికి నేరుగా ప్రయోజనం చేకూరనుంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిల్లి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపద్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రధానమంత్రి నరేంద్రమోడి నేతృత్వంలో కేంద్ర కేబినేట్ బుధవారం సమావేశమైంది. ఇక నష్టాల్లో బీఎస్ఎన్ ఎల్, ఏంటీ ఎన్ ఎల్ లను గట్టెక్కించాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈరెండు సంశాలను విలీనం చేసి పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించింది. బీఎస్ఎన్ఎల్ ఎంటీఎంఎల్లను మూసివేయబోమని కేంద్ర మంత్రి రవిశంకర్ తెలిపారు. ఆ సంస్థలలో పెట్టుబడులు ఉపసంహరణ ఉండబోదని ఆయన చెప్పారు. ఈ సంస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు 4జీ స్పెక్ట్రం సంస్థల నిర్వహణ బద్యతనాలు ప్రేవేటుకు అప్పగించే ప్రసక్తే లేదని చెప్పారు.