Editorials

యానాంను ఏపీలో కలిపేస్తారా?

Will Yanam Be Merged In Andhra? TNILIVE Specials

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చీరిలో భాగమైన యానాం జిల్లా ఏపీలో విలీనం కాబోతుండా ? రాజధాని పుదుచ్చేరి నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లు పైగా దూరంలో ఉన్నా యానాం పై భౌగోళికంగా పాలానాపరంగా పట్టు సాధించలేమనే అంచనాకు కేంద్రం వచ్చేసిందా? లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఎంట్రీ తరువాత యానాంలో వరుసగా చోటు చేసుకుంటున్నా పరిణామాలే దీనికి నిదర్శనమా? తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో దీనిపై సర్వత్రా చర్చ మొదలైంది. 2024 నాటికి దేశవ్యాప్తంగా మరింత బలపడాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఇందుకోసం భారీ వ్యూహాలు సిడం చేసుకుంటోంది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నుంన ప్రచారం నేపద్యంలో మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం సిదమవుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు వాసనలు ఎక్కువగా కనిపించే పుదుచ్చేరిలో పాగా వేసేందుకు రెండేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న భాజపా మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని లెఫ్టినెంట్ గవర్నర్ గా పంపింది. అక్కడితో ఆగకుండా నిత్యం అక్కడ అధికారంలో ఉన్న నారాయణస్వామి నేతృత్వంలో ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె నిర్ణయాలు అతిగా జోక్యం చేసుకున్తున్నరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా వీటిని లెక్క చేయకుండా కేంద్రం ఆదేశాలతో కిరణ్ బేడీ ముందుకు వెళుతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ యానాంను పుదుచ్చేరి నుంచి వేరు చేసి ఏపీలో కలిపేందుకు కేంద్రం ఆదేశాలతో పని చేస్తున్నారు, కేంద్రంలోని భాజపా ఆదేశాలను అమలు చేసేందుకు కిరణ్ బేడీ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి నారాయణస్వామి పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించేందుకు ప్రయత్నిసన్న తరుణంలో కిరణ్ బేడీ ఈ ప్రయత్నాలను విరమించుకుంటే మంచిది ఇది యానాంతో పాటు పుదుచ్చేరి ప్రజలను వంచించడమే.