DailyDose

ఇక మిగిలేది జియో, ఎయిర్టెలేనా?-వాణిజ్యం-10/26

Airtel and Jio are the only ones left-Telugu Business News Today-10/26

* సుప్రీం కోర్టు తాజా తీర్పుతో టెలికం రంగంలో రెండే ప్రైవేటు కంపెనీలు మిగులుతాయని అంచనా వేస్తున్నారు. టెలికం రంగంలో ఇప్పటికే చాలా కాలంగా కొనసాగుతున్న కన్సాలిడేషన్‌‌ మరింత వేగమవుతుందని భావిస్తున్నారు. వొడాఫోన్‌‌ ఐడియా మనుగడ ఇప్పుడు ప్రశ్నార్ధకం కావడంతో, భవిష్యత్‌‌లో జియో, ఎయిర్‌‌టెల్‌‌లు మాత్రమే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
* స్టేట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్‌‌‌‌లో అద్భుత ప్రగతి సాధించింది. స్టాండ్‌‌‌‌ ఎలోన్‌‌‌‌ ప్రాతిపదికన లాభం మూడింతలు పెరిగింది.
* రిలయన్స్‌ జియో తన జియోఫోన్‌ కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్లను శుక్రవారం విడుదల చేసింది. ఆల్‌ ఇన్‌ వన్‌పేరుతో ఈ ప్లాన్లను తెచ్చింది.
* ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులు ధనత్రయోదశి (ధన్‌తేర్‌స)ని దెబ్బకొట్టాయి. దీపావళికి ముందు ధన్‌తేర్‌స నాడు బంగారం కొనుగోలు చేస్తే కలిసివస్తుందన్న సెంటిమెంట్‌ను కొనుగోలుదారులు ఈ ఏడాది పూర్తిగా విస్మరించారు.
* డిజిటల్‌ సేవల్లోనూ సంచలనాలకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) సిద్ధమవుతోంది. ఇందుకోసం పూర్తి అనుబంధ కంపెనీ (డబ్ల్యుఓఎస్‌) ఏర్పాటు చేస్తోంది.
* ఈ ఏడాది జనవరి-సెప్టెంబరు నెలల మధ్య కాలంలో హైదరాబాద్‌ రియల్టీకి ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు శాతం తగ్గాయి.