DailyDose

వంశీ వైకాపాలోకే…-రాజకీయం-10/31

Vallabhaneni Vamsi Will Join YSRCP-Telugu Political News Today-10/31

*అంధ్రప్రదేశ రాజకీయాలకు ఒకేసారి హిట్ ఎక్కించారు. తెదేపా సీనియర్ నేత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఒకేరోజు భాజపాలోని ఓ కీలక నేతను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కలిసిన వంశీ ఆతరువాత రాజీనామా సందేశాన్ని తెదేపా అధినేత చంద్రబాబుకు చేరవేశారు. రాజీనామా వ్యవహారం పై చంద్రబాబు, వంశీ మధ్య మెసేజ్ లు లేఖలు కూడా నడిచాయి. అయితే ఆయన భాజపాలో చేరతారా? వైకాపా కండువా కప్పుకుంటారా? లేక ఏ పార్టీకి సంబంధం లేకుండా కొనసాగుతారా? అనే చర్చ పొలిటికల్ సర్కిల్ లో హాట్ హాట్ గా మారింది.
* ఆర్టీసీ సమ్మె – 24 గంటల సామూహిక నిరాహార దీక్ష
ఆర్టీసీ కార్మికుల సమ్మె ను పరిష్కరించాలని శాంతి యుత మార్గం లో నిరవదిక నిరాహార దీక్ష చేస్తున్న సిపిఐ సహాయ కార్యదర్శి కూనంనేని సా0బశివ రావు సామూహిక నిరాహార దీక్ష కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో 24 గంటల పాటు సామూహిక నిరాహార ధీక్షచేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా హుస్నాబాద్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అనభేరి ప్రభాకర్ గారి విగ్రహం దగ్గర సామూహిక నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్ష కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా టిపిసిసి కార్యదర్శి బొమ్మ శ్రీరాం చక్రవర్తి గారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు పెట్టక తప్పదు, కానీ ప్రభుత్వం ఇంత మొండిగా ఎందుకు ప్రవర్తిస్తుంది ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అంగీకరించి, వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర నాయకులు గడిపే మల్లేష్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె 27వ రోజుకు చేరుకుంది కానీ ప్రభుత్వం వాళ్ళ న్యాయమైన డిమాండ్ కాలరాస్తుంది ఇప్పటికి సుమారు 17 18 మంది కార్మికులు బలయ్యారు అయినా చర్చలు జరపకుండా నిద్రలో ఉన్న కెసిఆర్ ని ప్రజలే మేల్కొలుపుతారు కార్మికులకు అన్యాయం జరుగుతే చూస్తూ ఊరుకో సాంబశివరావు గారు ఆరోగ్యం చాలా క్షీణించి తనకి ఏమన్న జరిగితే రాష్ట్రంలో చాలా సమస్యలు జరుగుతాయి
*రసకందదాయకంగా మహారాష్ట్ర రాజకీయం
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ-శివసేన కూటమి మధ్య ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. సీఎం కుర్చి మాదంటేమాదేనని రెండు పార్టీలు మాటాల యుద్ధానికి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, ఏక్‌నాథ్‌ షిండేను శివసేన శాసనసభాపక్ష నేత ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలుత షిండే పేరును ఆదిత్యా ఠాక్రే ప్రతిపాదించగా.. దానికి ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు. అలాగే తమ ఎమ్మెల్యేతో ఈరోజు సాయంత్రం 3:30 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ను కలువనున్నారు. ఈ బృందంలో పార్టీ ఎమ్మెల్యేలు ఆదిత్యా ఠాక్రే, ఏక్‌నాథ్‌ షిండే, దివాకర్‌ రౌత్‌, సుభాష్‌ దేశాయ్‌లు ఉన్నట్లు శివసేన తెలిపింది. కాగా ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం తొలిసారి సమావేశమైన శివసేన.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించింది. ముఖ్యంగా సీఎం బీజేపీకి మద్దతు ప్రకటించాలా? లేదా అన్నా అంశంపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే భవిష్యత్తు కార్యచరణ కూడా శివసేన రూపొందించినట్లు సమాచారం.
*సీపీఐ సీనియర్ నేత గురుదాస్ దాస్ గుప్తా కన్నుమూత
సీపీఐ సీనియర్ నాయకుడు గురుదాస్ దాస్ గుప్తా(83) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఇవాళ(గురువారం) ఉదయం కోల్ కతాలోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు.గురుదాస్ దాస్ గుప్తా రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన వామపక్ష నాయకుడు. అతను 1985,1988,1994 లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్ లోని పన్క్ సురా నియోజకవర్గం నుండి 2004 లో 14 వ లోక్ సభకు ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని ఘటల్ నియోజకవర్గం నుంచి 2009 లో ఆయన మళ్లీ లోక్ సభాపక్ష నేతగా ఎన్నికయ్యారు.
* మ‌హారాష్ట్ర సీఎంగా హీరో అనీల్ క‌పూర్..!
మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో బీజేపీ-శివ‌సేన కూట‌మికి అత్య‌ధిక సీట్లు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. కాని అంత‌లోనే శివ‌సేన త‌మ‌కి రెండున్న‌ర ఏళ్ళు ముఖ్య‌మంత్రి ప‌దవి కావాల‌ని ప‌ట్టుబ‌ట్టింది. ఈ క్ర‌మంలో మ‌హారాష్ట్ర సీఎం పీఠం ఎవ‌రికి ద‌క్కుతుందా అనే ఆస‌క్తి జ‌నాల‌లో పీక్ స్టేజ్‌కి చేరుకుంది. సోష‌ల్ మీడియాలోను దీనిపై హాట్ హాట్‌గా చ‌ర్చ న‌డుస్తుంది.తమిళ దర్శకుడు ఎస్ శంకర్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ నాయక్‌(ఒకే ఒక్కడు రీమేక్‌)లో అనిల్‌ కపూర్‌తో పాటు రాణి ముఖర్జీ, అమ్రిష్‌ పురిలు ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇందులో అనీల్ క‌పూర్ ఒక్క రోజు సీఎంగా ఉండి త‌న బాధ్య‌త‌ని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించాడు. ఈ నేప‌థ్యంలో సూప‌ర్ స్టార్ అనీల్ క‌పూర్ మ‌హారాష్ట్ర సీఎంగా ఉండాలంటూ ట్విట్ట‌ర్‌లో కామెంట్స్ చేశారు. అంతేకాదు దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, ఆదిత్య ఠాక్రేల‌లో ఎవ‌రు సీఎం పీఠం మీద కూర్చోవాల‌ని ఆశ‌ప‌డుతున్నారో, అది తేలేవ‌ర‌కు అనీల్ క‌పూర్‌ని సీఎంగా ఉండ‌మ‌నండి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ హంగామా న‌డుమ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించిన అనీల్ క‌పూర్.. నేను నాయక్ సినిమాలో నాయ‌కుడిని మాత్రమే అని కామెంట్ పెట్టారు. దీనికి నెటిజ‌న్స్‌… సినిమాలో ముందు వ‌ద్ద‌ని చెప్పి త‌ర్వాత బాధ్య‌త‌ల‌ని తీసుకున్నారుగా అంటూ ఫ‌న్నీ కామెంట్స్ పెడుతున్నారు
* వైసీపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛని హరిస్తోంది: కాల్వ
వైసీపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛని హరిస్తుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. కేబినెట్ భేటీలో ఇచ్చిన జీవోతో జగన్ మనస్తత్వం బయట పడిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తే కేసులు పెట్టమనడం సిగ్గు చేటు అన్నారు. జగన్ విడుదల చేసింది చీకటి ఉత్తర్వు అని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ బలిపీఠంపై పెట్టారని విమర్శించారు. గతంలో 938 జీవోని తెచ్చిన వైఎస్ వెంటనే ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు. తండ్రికి మించిన తనయుడుగా జగన్ తన జీవోకు పదును పెట్టారన్నారు.
* ఆ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి: సోమిరెడ్డి
2007లో వైఎస్ పత్రికా స్వేచ్చను హరించే విధంగా జీవో నెంబరు 938 తెచ్చారని, ప్రతిపక్షాల పోరాటంతో అప్పుడు ఆ జీవోని నిలుపుదల చేశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మళ్లీ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా జీవో నెంబరు 2430 తెచ్చిందని విమర్శించారు. ఈ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ పాలన ఉందని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ పాలన చూస్తుంటే ఎమర్జన్సీ పాలన గుర్తుకొస్తుందన్నారు. వైసీపీ శ్రేణులు.. టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడం కేసులు పెట్టడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
* బంతి వంశీ కోర్టులోనే ఉంది: కేశినేని
రాజకీయంగా రాటుదేలాలంటే ఒత్తిళ్లు సహజమని, విరోచితంగా పోరాడి.. గెలిచి.. ఇప్పుడు వెన్ను చూపడం మంచిది కాదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశించి కేశినేని నాని వ్యాఖ్యానించారు. తాజాగా వంశీ వ్యవహారంపై నాని మాట్లాడుతూ ‘‘వంశీకి చెప్పాల్సింది చెప్పాం. బంతి ఇప్పుడు అతడి కోర్టులో ఉంది. నిర్ణయం ప్రకటించాల్సింది ఆయనే. వంశీ ఇంకా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు’’అని నాని వ్యాఖ్యానించారు.
*కేసీఆర్ వ్యాఖ్యలతో మరింత కసి: మంత్రి పేర్ని
మూడు నెలల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చూపిస్తామని ఏపీ రవాణా మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. విజయవాడ విద్యాధరపురంలోని రాష్ట్ర ఆర్టీసీ వైద్యశాలలో డార్మెటరీని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ ‘ఏపీలో ఆర్టీసీ విలీనంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యతో మా ప్రభుత్వంలో కసి, పట్టుదల పెరిగాయి. రానున్న మూడు నెలల్లో విలీనం చేసి తీరతాం’ అన్నారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని కూడా పాల్గొన్నారు.
*అభివృద్ధికి మారుపేరుగా హుజూర్నగర్
కాంగ్రెస్ హయాంలో అన్ని విధాలుగా వెనకబడిన హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మారుపేరుగా మారుస్తానని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. సామాన్యుడినైన తాను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి భార్య పద్మావతిని ఓడించి శాసనసభలోకి అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. బుధవారం శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి తన కార్యాలయంలో సైదిరెడ్డితో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించారు.
*5 నుంచి కాంగ్రెస్ నిరసనలు
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ నిరసన స్వరాన్ని పెంచనుంది. ఇందులో భాగంగా నవంబరు 5 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనుంది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు ఆర్థిక సంక్షోభానికి దారితీస్తున్నాయని కాంగ్రెస్ ఓ ప్రకటనలో ఆరోపించింది.
*ఆర్టీసీపై సమీక్షించాలని కేంద్రాన్ని కోరతాం: లక్ష్మణ్
ఆర్టీసీ సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ, ఆస్తుల్ని కాజేసేందుకు ప్రయత్నిస్తోందని..హైకోర్టు మొట్టికాయలు వేసినా కనీసం స్పందించకుండా మొండిగా వ్యవహరిస్తోందని భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఆర్టీసీలో కేంద్రానికి కూడా వాటా ఉందని, ఈ సమస్యపై సమీక్ష చేయాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ విలువైన ఆర్టీసీ ఆస్తుల్ని తమకు నచ్చినవారికి అప్పనంగా లీజుకు ఇచ్చారని, భాజపా అధికారంలోకొచ్చాక వాటిని తిరగతోడతామన్నారు.