Fashion

గులాబీ తేనె పుదీనా ఫేస్‌ప్యాక్

Telugu Beauty & Fashion Tips Tricks-Rose Honey Mint Facial Pack

పుదీనా ఆరోగ్యాన్నే కాదు, అందాన్నీ అందిస్తుంది. దీనికి కొన్నిరకాల పదార్థాలు కలిపితే… చర్మాన్ని మెరిపించే పూతలు వేసుకోవచ్ఛు మఖంపై ఉండే మచ్చలూ పోతాయి.

* మొటిమలు, దోమకాటు వల్ల ఏర్పడే మచ్చలను నివారించడానికి పుదీనా ఉపయోగపడుతుంది. ఈ ఆకులను ముద్దలా చేసి, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి… సమస్య ఉన్న చోట రాస్తే ఫలితం కనిపిస్తుంది.

* పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి ముఖానికి పూతలా వేసుకుంటే వృద్ధాప్య ఛాయలు తగ్గుముఖం పడతాయి. ఇది రక్త ప్రసరణ మెరుగుపడేలా చేస్తుంది. కంటి కింద నల్లటి వలయాల సమస్య అదుపులోకి వస్తుంది.

* పుదీనా ఆకుల్లో కొన్ని చెంచాల గ్రీన్‌టీ వేసి మిశ్రమంలా చేయాలి. దీన్ని చేతులు, మెడకు పూతలా వేస్తే… కాలుష్యం కారణంగా పేరుకున్న మురికి వదులుతుంది. చర్మం మృదువుగా, తాజాగా మారుతుంది.

* ముల్తానీ మట్టిలో సరిపడా పుదీనా రసం కలపాలి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారు వారంలో రెండుసార్లు దీన్ని ముఖానికి రాసుకుంటే చర్మం ఎక్కువ నూనెలను స్రవించదు.

* పెరుగు, పుదీనా ఆకుల మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుంటే.. చర్మం తేమను సంతరించుకుంటుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గానూ పనిచేస్తుంది.

* గులాబీనీరు, తేనె, పుదీనా ఆకులతో తయారు చేసిన మిశ్రమాన్ని మొటిమలపై రాసి… మర్దన చేసుకుంటే అవి తగ్గుముఖం పడతాయి.