DailyDose

ఎమ్మెల్యే పీఏ గల్లంతు-తాజావార్తలు-11/04

AP MLA PA Goes Missing-Telugu Breaking News Today-11/04

* వైసీపీ లో చేరిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడుతాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిక సన్యాసి పాత్రుడుతో పాటు పార్టీలో చేరిన నర్సీపట్నం పార్టీ కార్యకర్తలు, ముఖ్యనేతలు
* సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై లోకేశ్ తీవ్రంగా గాయపడ్డారు. నాగారం, ఫణిగిరి మధ్య ఈ ప్రమాదం జరిగింది. గుమ్మడవెల్లలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో భాగంగా… అక్కడకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
* ఎస్సారెస్పీ కాలువలో పడి ఎమ్మెల్యే పీఏ గల్లం తయ్యారు . జగిత్యాల పట్టణానికి చెందిన గిరీష్ సింగ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగి . ప్రస్తుతం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పీఏగా విధులు నిర్వహిస్తున్నారు. జగిత్యాలకు చెందిన ముగ్గురు మిత్రులతో కలిసి ఆదివారంవిందు చేసుకున్నారు. తిరిగి వస్తుండగా లింగంపేట అంతర్గాం బైపాస్ రోడ్డులోని ఎస్సారెస్పీ కెనాల్ లో ప్రమాదవశాత్తు పడిపోయినట్లు సమాచారం. విషయం తెలియడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
*ఉపాధిహామీ చట్టాన్ని సమర్ధవంతంగా అమలుచేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవంబర్‌ 4, 5 తేదీలలో జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని వ్యసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, జిల్లాకమిటీ సభ్యులు యం.సుబాను, దువ్వూరి జాన్‌, పి.కొండమ్మలు పిలుపునిచ్చారు.
*రాయలసీమలో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 7న రాయలసీమ విద్యాసంస్థల బంద్‌ చేపడుతున్నట్లు రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ కన్వీనర్లు ప్రకాష్‌, శివ తెలిపారు.
*శ్రీశైలం జలాశయం స్వల్పంగా వరద ఇన్ ఫ్లో : 75,548 క్యూసెక్కులు అవట్ ప్లో : 71,147 క్యూసెక్కులుజలాశయం పూర్తి స్దాయి నీటినిల్వ సామర్థ్యం : 215. టీఎంసీలప్రస్తుత నీటి నిల్వ : 206.0996. టిఎంసిలు.జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం : 885. అడుగులుప్రస్తుతం నీటిమట్టం :883.30 అడుగులుశ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
*భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐగా మరో ఎనిమిది పని దినాలే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ తరుణంలో రాజకీయం, రక్షణ, మతానికి సంబంధించిన ఐదు కీలక కేసుల్లో జస్టిస్ గొగొయి తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి.
*మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. భాజపా-శివసేన మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరిన వేళ.. సీఎం ఫడణవీస్.. కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలవడానికి దిల్లీ వెళ్లనున్నారుమరోవైపు రాష్ట్రజకీయాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దిల్లీ వెళ్లనున్నారు.
*ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలుపొందింది.
*సత్తెనపల్లిలో భవన నిర్మాణ కార్మికుల వినూత్న నిరసన.ఇసుక ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ..తాలూక సెంటర్ లో వంటావార్పుఅనుమతి లేదని శిబిరాన్ని ఖాళీ చేయించిన పోలీసులుకార్మికులు స్టేషన్ కు తరలింపు
*గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే చదలవాడ జయరాంబాబు (72) మృతి చెందారు.
*మల్లన్నసాగర్ ముంపు ప్రభావిత గ్రామం సిద్దిపేట జిల్లా తొగుటకు చెందిన రైతులు, కూలీలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుకు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించి ఈ నెల 20న గ్రామసభ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
*ఏకలవ్య ఆదర్శ గురుకులాల(ఈఎంఆర్ఎస్) పరిపాలన, నిర్వహణకు ఉద్దేశించి గిరిజన విద్యార్థుల జాతీయ విద్యా సొసైటీ(నెస్ట్స్)ని కేంద్రం ఏర్పాటుచేసింది. జాతీయ స్థాయిలో కేంద్రీయ విద్యాలయాల పరిపాలన సంస్థ తరహాలో ఇది పనిచేయనుంది.
*పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ద్వారా 2019-20 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంచారు. ఈనెల 15 వరకు ప్రవేశాలు పొందవచ్చని దూరవిద్య సంచాలకుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.200 ఆలస్య రుసుంతో అవకాశం కల్పించినట్లు వివరించారు.
*టర్నర్ సత్రంలో విశాలాంధ్ర విశాఖ 20వ పుస్తక ప్రదర్శనను శుక్రవారం వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు ప్రారంభించారు.
*భాజపా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం ఈ నెల 10న మొగల్రాజపురంలోని సిద్ధార్థ పబ్లిక్ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి వేదిక, ఇతర ఏర్పాట్లను శుక్రవారం భాజపా రాష్ట్ర అధక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పరిశీలించారు.
*మార్టూరులోని ఆదిజాంబవ కాలనీలో శుక్రవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అందులో భాగంగా కాలనీలోని గృహాల్లో సోదాలు జరిపారు.
*రాయలసీమలో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 7న రాయలసీమ విద్యాసంస్థల బంద్ చేపడుతున్నట్లు రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ కన్వీనర్లు ప్రకాష్, శివ తెలిపారు. ఆదివారం రాయలసీమ యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు కోసం ఉద్యమాలు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమన్నారు. రాయలసీమ విద్యాసంస్థల బంద్కు విద్యా సంస్థల యాజమాన్యం, మేధావులు, ప్రజలు, న్యాయవాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘూలు మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు.