Politics

భాజపాతో దోస్తీకి చంద్రబాబు తహతహ

Chandrababu Still Aiming For Friendship With Modi

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముందు ఉన్న దారులు చాలా తక్కువ. రాష్ట్రంలో ఆయనపై ప్రజల్లో నమ్మకం ఉందో లేదో తెలియదు గానీ ఆయన అనుకూల మీడియా మాత్రం ఆయనకు అనుకూలంగా కధనాలు రాయకపోయినా వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కధనాలు రాస్తున్నారు. దీనిని చూసి అంతా తమకు అనుకూలంగా మారుతోంది అనే భ్రమలో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు. రాజకీయంలో చంద్రబాబు వ్యూహాలకు ఇప్పుడు కాలం చెల్లింది. ఈ మాట తెదేపా నేతలే తమ అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు తన మనుగడను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారం లేక కొంత కాలంగా ఇబ్బంది పడుతున్న చంద్రబాబు ఇప్పుడు తనను తాను రక్షించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. జగన్‌ని ఎదుర్కోవడానికిగానూ ఆయన ఇప్పుడు మళ్ళీ జాతీయ స్థాయిలో అడుగులు వేస్తున్నారు. తనతో గతంలో సన్నిహితంగా ఉండి, తన ప్రభుత్వంలో లాభం పొందిన కొందరు పారిశ్రామికవేత్తలను కలవడానికి ఆయన సిద్ధపడ్డారు. ఇప్పటికే సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ని చంద్రబాబు కలిశారనే వార్తలు రాజకీయ వర్గాల్లో వచ్చాయి. ఇక హైదరాబాద్ లో వారంతంలో ఉంటున్న చంద్రబాబు భాజపాకి సన్నిహితంగా ఉండే వ్యాపారవేత్తలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఆయన మోడీ సన్నిహితుడు గౌతమ్ అదానిని కలిశారని సమాచారం. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానిని కూడా కలవడానికి చంద్రబాబు రహస్య ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడితో ఆగని బాబు అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు అయిన మై హోమ రామేశ్వరరవుతో పాటు తెలంగాణలోనూ పలువురు పారిశ్రామికవేత్తల ద్వారా లాబీయింగ్ నడుపుతున్నారట. ఏదేమైనా బాబు తనని తాను రక్షించుకోవడంతో పటు జగన్ నుంచి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆయన ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నారు. మోడీతో మళ్ళీ సాన్నిహిత్యాన్ని కోసం చంద్రబాబు అడుగులు వేగం పెంచారు.