Food

కరివేపాకు నిమ్మరసం కలిపి తాగితే

Curry Leaves Powder And Lemon Juice Will Beat Heat-కరివేపాకు నిమ్మరసం కలిపి తాగితే

చాలామంది కరివేపాకును తినకుండా పక్కకు నేట్టేస్తుంటారు. కాని కరివేపాకులో పలు రకాల ఔషదాలు పోషకాలు దాగున్నాయి. ఇందులో మన శరీరానికి కావాల్సిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటి ఆక్సిడెంట్లు విటమిన్-బీ, కెరోటిన్, పుష్కలంగా లభిస్తాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కరివేపాకులో కొవ్వు తగ్గించే గొప్ప గుణం ఉంది, కరివేపాకును పోడిలా చేసుకుని ప్రతిరోజూ ఒక టీస్పూను పొడిని తీసుకుంటూ ఉంటె కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డీ ఎల్ కూడా గణనీయంగా తగ్గుతుంది. గర్భిణులు ఒక స్పూను తేనే, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది. ప్రతిరోజూ పది ముదురు కరివేపాకు ఆకులను నమిలి మింగాలి. ఇలా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేయడం వలన మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. పుల్లని పెరుగులో కొద్దిగా నీరు చేర్చి అందులో కరివేపాకు అల్లం ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ఉప్పు కలిపి తాగితే శరీరంలోని అధికవేడి తగ్గుతుంది. కాలిన లేదా కమిలిన గాయాలకు కరివేపాకు గుజ్జు రాయడం వలన నొప్పి గాయం త్వరగా తగ్గుతాయి. కరివేపాకు చేటు బెరడును కషాయంగ కాచి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు తగ్గుతాయి.