DailyDose

దెబ్బకు దెబ్బ కొడతా:పవన్-రాజకీయ-11/05

I will avenge says pawan kalyan-Telugu politics today-11/05

* 151మంది ఎమ్మెల్యేలున్న పార్టీ… ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేనపై ఆరోపణలు చేస్తున్నారంటే ఎవరు ఎవరికి భయపడుతున్నారని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజా బలం ఎవరికి ఉందో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.
మన మీటింగ్‌లకు వచ్చిన యువతలో 70శాతం ఓట్లేసినా… జనసేనకు 70 సీట్లు వచ్చేవన్నారు. వెన్నుపోటు పొడుస్తామంటే… పొడిపించుకుంటామా? అని ప్రశ్నించారు. దెబ్బ తినడానికి రాలేదని… ఒకవేళ దెబ్బ తిన్నా కూడా తిరిగికొడతామని పవన్‌ స్పష్టం చేశారు.
*డెడ్‌లైన్లను పట్టించుకోం: అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో కేంద్రానికి 30శాతం వాటా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవని ఆయన పేర్కొన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే బోర్డు అనుమతి తప్పనిసరన్నారు. కార్పొరేషన్‌ను మార్చాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు.
*రెండు మెట్లు దిగే వైసీపీలో చేరాను: బొత్స
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ చేసిన వ్యాఖ్యల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘‘నా ఇంటిలోని పెళ్లికి పవన్ వస్తే కాపులు అందరూ నాకే ఓటు వేస్తారా?’’ అంటూ ఎదురు ప్రశ్నించారు. అలా వేస్తే పవన్ ఎందుకు ఓడారో, తాను ఎందుకు ఓడిపోయానో చెప్పాలని అన్నారు. తాను రెండు మెట్లు దిగూ వైసీపీలో చేరానని ఆ రోజే చెప్పానని బొత్స గుర్తు చేశారు. గత ప్రభుత్వంతో మూడేళ్లు కలిసి ఉన్న పవన్ ఒక్కసారైనా గొంతెత్తి మాట్లాడారా? అని నిలదీశారు. 25 ఏళ్ల పాటు ఎదురుచూస్తా అని చెబుతూ 25 నెలలకు ఒకసారి బయటకి వస్తున్నాడని బొత్స ఎద్దేవా చేశారు.
* దేశంలో మహిళలకు రక్షణ లేదు: ఆజాద్
దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని గాంధీభవన్‌లో టీపీసీసీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా రక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వం ‘బేటీ బచావో… బేటీ పడావో’ నినాదానికే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఇక నిరుద్యోగం తారాస్తాయికి చేరిందని, దేశంలో ఇంతకు ముందెన్నడూ లేనంత పెరిగిందని ఆజాద్ అన్నారు. ఉద్యోగ కల్పన మాట అటుంచి ఉన్న ఉద్యోగాలనే తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుందని, ఈ విషయాన్ని ప్రజలు పసిగడతారని ఆజాద్ అన్నారు.
* అమరావతి రాజధానిగా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం చంద్రబాబు ఫెయిల్యూర్
ఐదేళ్లు చంద్రబాబు తప్పులు చేశాడు అందుకే జనం ఆయనను పక్కన పెట్టారు వచ్చే నాలుగైదు నెలల్లో సిమెంట్ బస్తా ధర 20 రూపాయలు పెరగనుంది ఎందుకు పెరుగుతుందనేది తర్వాత చెప్తా _ సుజనా చౌదరి, బిజెపి ఎంపీ
* బీజేపీ ఎంపీ సుజనాచౌదరి కామెంట్స్
అమరావతి రాజధానిగా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం చంద్రబాబు ఫెయిల్యూర్ ఐదేళ్లు చంద్రబాబు తప్పులు చేశాడు అందుకే జనం ఆయనను పక్కన పెట్టారువచ్చే నాలుగైదు నెలల్లో సిమెంట్ బస్తా ధర 20 రూపాయలు పెరగనుంది ఎందుకు పెరుగుతుందనేది తర్వాత చెప్తా సీఎస్ బదిలీ చేసిన విధానం ఘోరంగా ఉంది.సీనియర్ ఐఏఎస్ అధికారికే ఇలాంటి పరిస్థితి రావడం దారుణం.
రణాలు ఏమైనా చేసిన విధానం సరికాదు.రాచరిక జమన కాదు,ప్రజాస్వామ్య ప్రత్వం ఇలా చేయడం భావ్యం కాదు.రాజ్యాంగ సంక్షోభం దిశగా ప్రభుత్వం నడుస్తుంది.
*స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష
మంత్రులు ఆదిమూలపు సురేష్, ఆళ్లనాని, అధికారులు హాజరుస్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు –నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నాం: సీఎందాదాపు 45వేల స్కూళ్లను నాడు – నేడు కింద బాగుచేస్తున్నాం: సీఎంతర్వాత దశలో జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్‌ కాలేజీలు, ఐటీఐలు, గురుకులపాఠశాలలు, హాస్టళ్లను కూడా బాగు చేస్తున్నాం: సీఎందీనికోసం భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నాం: సీఎంప్రతి పాఠశాలలో టాయిలెట్స్, కాంపౌండ్‌వాల్, ఫర్నిచర్, ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డ్స్‌ పెయింటింగ్, ఫినిషింగ్‌.. ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం:నాడు– నేడు కింద స్కూళ్లలో 9 రకాల పనులు చేపడుతున్నాం:ప్రతి స్కూల్లో చేపట్టాల్సిన పనులపై చెక్‌ లిస్టు ఉండాలినవంబర్‌ 14న స్కూళ్లలో నాడు–నేడు ప్రారంభం అవుతుందినాడు–నేడులో విద్యా కమిటీలను భాగస్వాములను చేస్తున్నాంస్కూళ్లకు సంబంధించిన పరిపాలన అంశాల్లోనే కాదు, నిర్వహణలో కూడా పిల్లల తల్లిదండ్రులతో కూడిన విద్యాకమిటీలు కీలక పాత్ర పోషిస్తాయివచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకూ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నాం:
*లగించిన విధానం సరిగ్గా లేదు: ఐవైఆర్‌
ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎస్‌ను తొలగించే అధికారం సీఎంకి ఉన్నప్పటికీ.. తొలగించిన విధానం సరిగ్గా లేదన్నారు. బాధ్యత లేకుండా అధికారం చలాయిస్తున్న సీఎంవో సీఎంల మెడకు ఉచ్చులా చుట్టుకుంటోందని చెప్పారు. సీఎం కార్యదర్శిగా ఉన్న వ్యక్తికే జీఏడీ కార్యదర్శి బాధ్యతలు ఎలా అప్పగిస్తారు? అని ఐవైఆర్‌ ప్రశ్నించారు. హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడినందుకు బహుమానం అయితే, ఇది మరీ దారుణమన్నారు.
*3 లక్షల మంది బలి: అమిత్షా
గత రెండు దశాబ్దాల కాలంలో పలు ప్రకృతి వైపరీత్యాల మూలంగా ‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్సీఓ) సభ్యదేశాల్లో సుమారు మూడులక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 1996 నుంచి మొదలు పెట్టి రెండు దశాబ్దాల పాటు సంభవించిన ప్రకృతి వైపరీత్యాల్లో మరణించిన మూడులక్షల ప్రజల్లో సుమారు రెండు లక్షల మంది భూకంపాలకు బలైపోయినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం వెల్లడించారు.
*వాళ్లేమీ పార్టీల మాయలో పడలేదు: రావుల
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి నెల రోజులు కావొస్తున్నా ప్రభుత్వం సమస్య పరిష్కరించకపోగా మరింత జటిలం చేస్తోందని తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజానీకం ముక్తకంఠంతో ఖండిస్తోందన్నారు. కేంద్రం రూపొందించిన చట్టాల పట్ల సీఎం కేసీఆర్ ఒకే మాదిరిగా కాకుండా చట్టానికొక విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన మోటారు వాహన చట్టంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఉన్నదే తప్ప ప్రైవేటుపరం చేయాలని ఎక్కడా లేదన్నారు. ఆర్టీసీ యూనియన్లు రాజకీయ పార్టీల మాయలో పడలేదని.. సంస్థను కాపాడుకోవడానికి వారి హక్కుల కోసం సంఘటితంగా సమ్మెకు దిగారని రావుల పేర్కొన్నారు.
*ఎల్వీకి వైకాపా రిటర్న్ గిఫ్ట్: తెదేపా ఎద్దేవా
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహారంపై ప్రతిపక్ష తెదేపా విమర్శలు గుప్పించింది. అధినేత చంద్రబాబుతో పాటు పలువురు నేతలు బదిలీ జరిగిన తీరును తప్పుబట్టారు.
*కేసీఆర్పై కేంద్రం చర్యలు తీసుకోవాలి: వీహెచ్
ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగంపై అవగాహనలేని సీఎం.. ఆర్టీసీ సమ్మె చట్ట వ్యతిరేకమని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీ భవన్లో వీహెచ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఏ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ సమ్మెలు చేశారని నిలదీశారు. కార్మికులు 5వ తేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరాలని హుకుం జారీచేయడం అప్రజాస్వామికమన్నారు. ఆర్టీసీ ఆస్తులను కేసీఆర్ తన అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ను న్యాయస్థానానికి పిలిచి ప్రశ్నించాలని కోరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని వీహెచ్ ప్రశ్నించారు. పలు కేసులున్న కేసీఆర్పై కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
*ప్రస్తుతానికింతే.. వేచి చూస్తున్నాం: పవార్
మహారాష్ట్ర ప్రతిష్టంభన నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై వారిద్దరూ సుమారు అరగంటకు పైగా చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, అయితే, పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపారు. ‘‘ప్రస్తుతానికైతే ప్రతిపక్షంలో కూర్చోవడం తప్పనిసరి. అయితే భవిష్యత్లో ఏం జరుగుతుందన్నది తెలీదు’’ అని పవార్ అన్నారు. మరోసారి దిల్లీ వచ్చి సోనియాతో చర్చిస్తానని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు భాజపాకు వ్యతిరేకంగా ఉన్నారన్నది ఫలితాల ద్వారా వెల్లడైందని, కానీ నంబర్ విషయంలో భాజపా, వారి మద్దతుదారులకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం ఉందని పవార్ అన్నారు. అందుకే వేచి చూస్తున్నామని పేర్కొన్నారు. శివసేన నుంచి ఇప్పటి వరకు తనని ఎవరూ సంప్రదించలేదని పవార్ తెలిపారు
*ముఖ్యమంత్రి ఏం చెబితే అదే జరగాలా?-మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం
నిబంధనలను పక్కన పెట్టి తాను ఏం చెబితే అదే జరగాలన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తన ఆదేశాలను ప్రశ్నించారనే కారణంతో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని సీఎం ఆకస్మికంగా బదిలీ చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. సుబ్రమణ్యం లాంటి అధికారి లేరని గతంలో ముఖ్యమంత్రి ప్రశంసిస్తే.. ఆయన అమితానందంతో పనిచేశారని, ఆ ఆనందం అయిదు నెలల్లోనే ఆవిరైపోతుందని ఊహించలేదన్నారు.
*తెరాస పార్టీకి ప్రజలే ఓనర్లు
తెరాస పార్టీ కేసీఆర్ది.. కేటీఆర్ది కాదని, ప్రజలే పార్టీకి ఓనర్లని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేట మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రతిపక్ష పార్టీలు టైంపాస్ రాజకీయాలు చేస్తున్నాయి. ఆ పార్టీలు కేసీఆర్ని ఏమీ చేయలేవు. కేసీఆర్కు అండగా ఉంది ప్రజలు, రైతులేనని హుజూర్నగర్ ఉప ఎన్నిక మరోసారి రుజువు చేసింది. ప్రజల మధ్య ఉన్నంత సేపు తెరాసను ప్రతిపక్షాలు ఏమి చేయలేవు’’ అని గంగుల పేర్కొన్నారు.
*సుప్రీంకోర్టుకు చేరిన యడియూరప్ప ఆడియో
కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్ప మాట్లాడినట్లు వైరల్ అవుతున్న ‘ఆపరేషన్ కమల ఆడియో’ సుప్రీంకోర్టుకు చేరింది. రాష్ట్రంలో అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేల కేసులో ఇది కీలకం కావచ్చన్న అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ ఈ ఆడియో విషయాన్ని కోర్టులో ప్రస్తావించారు. అనర్హ ఎమ్మెల్యేల కేసు విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం తొలుత ఈ ఆడియోపై విచారణ జరపాలని పట్టుబట్టారు. ఆడియోను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక ధర్మాసనంతో విచారణ జరిపించాలని కపిల్ సిబల్ కోరారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.రమణ స్పందిస్తూ ‘ప్రధాన న్యాయమూర్తి అనుమతి ఇస్తే ప్రత్యేక ధర్మాసనంలో విచారణకు అవకాశం కల్పిస్తాం’ అన్నారు. ఇదే అంశంపై మంగళవారం ఐదు నిమిషాల పాటు వాదనలు వినిపించేందుకు కపిల్ సిబల్కు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.