NRI-NRT

సెయింట్ లూయిస్‌లో నాట్స్ క్రికెట్ టోర్నీ

NATS Conducted Cricket Tournament In St.Louis-సెయింట్ లూయిస్‌లో నాట్స్ క్రికెట్ టోర్నీ

నాట్స్ సెయింట్ లూయిస్ లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది.15 టీంలు ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నాయి. వల్కన్స్ టీం, బ్లూ పాంతర్స్ టీంలు ఫైనల్ లో తలపడ్డాయి. వల్కన్స్ టీం విజేతగా నిలిచింది. వల్కన్స్ టీంకు చెందిన విశాల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రైజ్ దక్కింది. బ్లూ పాంతర్స్ కు చెందిన వెంకటేశ్ కు బెస్ట్ బ్యాట్ మెన్, వల్కన్స్ టీంకు చెందిన మహేశ్ కు బెస్ట్ బౌలర్ బహుమతులు దక్కాయి. సెయింట్ లూయిస్ చాప్టర్ నాట్స్ సమన్వయకర్త నాగ శ్రీనివాస శిష్ట్ల, నాట్స్ నేషనల్ కో ఆర్డినేటర్ రమేశ్ బెల్లం ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా జరిగింది. శ్రీధర్ పాటిబండ్ల, ప్రీతమ్ ఈ టోర్నమెంట్ కు తమవంతు పూర్తి సహాయ సహాకారాలు అందించారు. వ్యాపారవేత్త విజయ్ బుడ్డి, టీఏఎస్ ప్రెసిడెంట్ సురేంద్ర బాచిన, అప్పాల నాయుడు, శిష్ట్ల నాగశ్రీనివాస్, రమేశ్ బెల్లం విజేతలకు, అత్యుత్తమ ఆటగాళ్లకు బహుమతులు అందించారు. ఈ టోర్నమెంటుకు నాట్స్ జాతీయ నాయకత్వం నుంచి మద్దతు అందించిన నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.