NRI-NRT

“టాటా”కు ముచ్చటగా మూడో అధ్యక్షుడు రాజీనామా

TATA President Vikram Jangam Resigns To His President Post-

అమెరికాలో నాలుగేళ్ల క్రితమే ఆవిర్భవించిన తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా)లో బోర్డు సభ్యుల మధ్య మొదటినుండి సఖ్యత సరిగా లేదు. ఈ సంస్థ అధ్యక్షులు ముగ్గురు ఇప్పటివరకు రాజీనామా చేశారు. గతంలో మహేందర్ ముసుకు, ఝాన్సీరెడ్డిలు తమ అధ్యక్ష పదవులకు రాజీనామా చేయగా ప్రస్తుత అధ్యక్షుడు జంగం విక్రమ్ కూడా రాజీనామా చేశారు. సలహా సంఘంతో ఏర్పడిన విభేదాల మూలంగానే విక్రమ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు టాటా సభ్యులు అందరికీ సుదీర్ఘమైన ఈ-మెయిల్ సందేశం పంపించారు. తాను టాటాకు 25వేల డాలర్లు డల్లాస్ కన్వెన్షన్ కోసం విరాళంగా అందించానని, తదుపరి టాటా సమావేశాలు డల్లాస్‌లో నిర్వహిస్తే ఆ మొత్తాన్ని ఖర్చు చేసుకోవచ్చునని, వేరే చోట కన్వెన్షన్ నిర్వహిస్తే తన సొమ్మును తిరిగి ఇవ్వాలని విక్రమ్ ఈ సందేశంలో కోరారు.