DailyDose

భారీగా తగ్గిన బంగారం ధరలు-వాణిజ్యం-11/06

భారీగా తగ్గిన బంగారం ధరలు-వాణిజ్యం-11/06-Gold Prices Reduced In India-Telugu Business News Roundup Today-11/06

* అంతర్జాతీయ బలహీన సంకేతాలు, డిమాండ్‌ లేమితో ఇటీవల బంగారం ధర దిగొస్తోంది. బుధవారం రూ. 301 తగ్గడంతో పసిడి ధర మళ్లీ రూ. 39వేల దిగువకు పడిపోయింది. నేడు దేశ రాజధానిలో 10 గ్రాముల పుత్తడి రూ. 38,870 పలికింది. అటు వెండి కూడా బంగారం దారిలోనే పయనిస్తోంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ఇవాళ ఒక్కరోజే రూ. 906 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 46,509గా ఉంది.
* ATMలో చీటికి మాటికి డబ్బులు విత్ డ్రా చేయడం..తద్వారా 5 లిమిట్స్ అయిపోవడం.. తర్వాత ఎక్స్ ట్రా ఛార్జీలు వేయడం బ్యాంకులకు పరిపాటే. దీనిని దృష్టిలో పెట్టుకుని తమ ఖాతాదారుల కోసం SBI ఓ యాప్ తీసుకువచ్చింది. ఎలాంటి ఎక్స్ ట్రా ఛార్జీలు చెల్లించకుండా ATMల నుంచి ఎన్నిసార్లైనా నగదు విత్ డ్రా చుసుకునే సౌకర్యాన్ని SBI తన ఖాతాదారులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే SBI యోనో యాప్ ద్వారా యోనో క్యాష్ పాయింట్లున్న ATMలలో మాత్రమే ఛార్జీలు లేకుండా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉండగా..దీని ద్వారా కార్డ్ లెస్ విత్ డ్రాలు పెరుగుతాయని SBI అంచనా వేస్తుంది. ఈ యాప్ ద్వారా రోజులు రూ.20 వేలు, ఒకేసారి రూ.10 వేలు డ్రా చేసుకోవచ్చని తెలిపింది SBI.
* మొబైల్స్ తయారీదారు షియోమీ.. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 3ని ఇవాళ భారత్‌లో విడుదల చేసింది. ఈ ప్యూరిఫైర్‌పై ఓలెడ్ టచ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీంతో ఎయిర్ క్వాలిటీ, ప్యూరిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌లకు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ప్యూరిఫైర్ సహాయంతో వినియోగదారులు తాము ఉంటున్న వాతావరణంలోని పీఎం 2.5 స్థాయిలను సులభంగా తెలుసుకోవచ్చు. వైఫైకి ఈ డివైస్ కనెక్ట్ అవుతుంది.
*వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,840, విజయవాడలో రూ.39,000, విశాఖపట్నంలో రూ.39,750, ప్రొద్దుటూరులో రూ.39,000, చెన్నైలో రూ.38,550గా ఉంది.
ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,980, విజయవాడలో రూ.36,100, విశాఖపట్నంలో రూ.36,570, ప్రొద్దుటూరులో రూ.36,160, చెన్నైలో రూ.36,920గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.46,400, విజయవాడలో రూ.47,800, విశాఖపట్నంలో రూ.47,500, ప్రొద్దుటూరులో రూ.47,500, చెన్నైలో రూ.50,300 వద్ద ముగిసింది.
*తప్పుడు పత్రాలతో ఎస్బీఐ, సెంట్ర ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణాలు తీసుకుని రూ.14.65 కోట్లు ఎగవేసిన 12 మందిపై సీబీఐ రెండు వేర్వేరు కేసులు నమోదు చేసింది. ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు రఘుపతి, రమణ రెడ్డి కలిసి సెంట్రల్ బ్యాంక్, ఖైరతాబాద్ శాఖ నుంచి రూ.8.75 కోట్ల రుణం పొందారు.
*మొండి బకాయిల కోసం చేసిన కేటాయింపులు గణనీయంగా తగ్గటంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.507 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో దివీస్ లేబొరేటరీస్ రూ.356.78 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.403.72 కోట్లు)తో పోల్చితే లాభం 12 శాతం తగ్గింది.
*కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ రానున్న కొద్ది నెలల్లో కొత్త జీడీపీ సీరీ్సను నిర్ణయించవచ్చని ఆ శాఖ కార్యదర్శి ప్రవీణ్ శ్రీవాస్తవ అన్నారు.
*మితిమీరిన పనిగంటలకు ప్రసిద్ధి చెందిన జపాన్లో మైక్రోసాఫ్ట్ కొన్ని నెలల క్రితం కొత్త ఆలోచన చేసింది. అక్కడి తమ శాఖలో పనిచేస్తున్న 2300 మంది ఉద్యోగులకు ఈ ఏడాది ఆగస్టులో వారానికి 4 రోజులు మాత్రమే పనిదినాలుగా నిర్ణయిస్తూ ప్రయోగం చేసింది.
*ఎన్సీసీ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.1,802.32 కోట్ల స్టాండ్ఎలోన్ ఆదాయంపై రూ.80.04 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.125.65 కోట్లుగా ఉంది.
*సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో టీసీఐ ఎక్స్ప్రెస్ రూ.26.10 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే నికర లాభం ఏకంగా 60 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.247.20 కోట్ల నుంచి రూ.269.47 కోట్లకు పెరిగింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) నుంచి వ్యాపారం గణనీయంగా పెరగటమే ఇందుకు కలిసివచ్చిందని కంపెనీ పేర్కొంది.
*మితిమీరిన పనిగంటలకు ప్రసిద్ధి చెందిన జపాన్లో మైక్రోసాఫ్ట్ కొన్ని నెలల క్రితం కొత్త ఆలోచన చేసింది. అక్కడి తమ శాఖలో పనిచేస్తున్న 2300 మంది ఉద్యోగులకు ఈ ఏడాది ఆగస్టులో వారానికి 4 రోజులు మాత్రమే పనిదినాలుగా నిర్ణయిస్తూ ప్రయోగం చేసింది.
*టెక్ మహీంద్రా..సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,124 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన చవక విమానయాన సంస్థ స్కూట్.. విశాఖపట్నం నుంచి సింగపూర్కు విమాన సేవలు ప్రారంభించింది. వారానికి ఐదు సార్లు ఈ సర్వీసును నిర్వహించనుంది. సోమ, బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 11 గంటలకు వైజాగ్ నుంచి బయలుదేరే ఈ విమానం, ఉదయం 5.40కి సింగపూర్ చేరుకుంటుంది. మళ్లీ అవే రోజుల్లో సింగపూర్లో సాయంత్రం 8.45కి బయలుదేరి, రాత్రి 10 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. వైజాగ్తో పాటు కోయంబత్తూరు నుంచి కూడా విమాన సేవల్ని స్కూట్ ప్రారంభించింది.