Fashion

వేపాకు ఫేషియల్

వేపాకు ఫేషియల్

వేపాకుతో ముఖ సౌందర్యం!
మొటిమలకి వేపాకు మంచి మందు అంటున్నారు సౌందర్యనిపుణులు. ఇందులోని ఔషధ గుణాలు అటు జిడ్డు చర్మం నుంచి నూనె కారకుండా చేయడమే కాదు, అందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు మొటిమలు రాకుండా చేస్తాయి. అలాగే ఇందులో సమృద్ధిగా ఉన్న విటమిన్‌-ఇ, ఫ్యాటీఆమ్లాలు పొడి చర్మాన్ని మృదువుగానూ తేమగానూ ఉంచుతాయి. కాబట్టి వేపాకు అన్ని రకాల చర్మానికీ మంచిదే. అందుకు చేయాల్సిందల్లా…
* వేపాకుని బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి చల్లారనివ్వాలి. తరవాత ఆ నీటిలో గంధం పొడిని కలిపి ముద్దలా చేసి ముఖానికీ మెడకీ పట్టించి పావుగంటసేపు ఉంచి కడిగేయాలి. అన్ని రకాల చర్మానికీ పనిచేసే ఈ మాస్క్‌ వల్ల ముఖంమీద మొటిమలు క్రమంగా తగ్గి, అది క్రమంగా మెరుపుని సంతరించుకుంటుంది.
* కాసిని ఓట్స్‌ తీసుకుని వాటిని ఉడికించి మెత్తగా మెదపాలి. వేపాకుల్ని కూడా మరిగించి వడబోయాలి. చల్లారాక ఈ నీటిని ఓట్స్‌లో కలిపి ముద్దలా చేసి ముఖానికీ మెడకీ పట్టించి 20 నిమిషాలు ఉంచి కడిగేస్తే ముఖంమీద మెటిమలూ మచ్చలూ క్రమేణా మాయమవుతాయి.
* పొడిచర్మంతో బాధపడేవాళ్లు వేపాకుల్ని మరిగించి చల్లారాక రుబ్బిన ముద్దలో టీస్పూను పసుపు, టీస్పూను కొబ్బరి నూనె వేసి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పూసి పావుగంట తరవాత కడిగేస్తే ముఖం మృదువుగా మారుతుంది.