Health

అధిక బరువు అస్తమా అస్మదీయులు!

Obesity Is Linked To Asthama

ఊబకాయానికీ ఆస్తమాకీ సంబంధం ఉందా అంటే అవుననే అంటున్నారు అమెరికాకి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డయాబెటిస్‌కి చెందిన పరిశోధకులు. ఇందుకోసం వీళ్లు కొందరు ఊబకాయుల్ని పరిశీలించగా- వాళ్లలో చాలామందికి శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వాళ్ల ఊపిరితిత్తుల గోడల్లో కొవ్వు కణజాలం పేరుకోవడంతో గాలి మార్గాలు మూసుకుపోయి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతుంది. దాంతో ఆస్తమా, ఇన్‌ఫ్లమేషన్‌ వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు. అంతేకాదు, ఆయా వ్యక్తులు బరువు తగ్గినప్పుడు ఆటోమేటిగ్గా వాళ్ల ఊపిరితిత్తుల్లోనూ ఈ కొవ్వు కణజాలం తగ్గడంతో శ్వాస సమస్యలూ తగ్గినట్లు గుర్తించారు. ఈ కారణంవల్లే భారీకాయులు బలంగా శ్వాస తీసుకుంటుంటారని కూడా చెబుతున్నారు. కాబట్టి ఆస్తమాతో బాధపడే ఊబకాయులు బరువు తగ్గితే సమస్య తగ్గుతుందన్నమాట.