Politics

తెఏపాలో 33శాతం యువ నాయకత్వం

TDP To Allocate 33Percent Reservation To Youth Leadership In Party

తెదేపా సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. 30 ఏళ్లపాటు పార్టీ అవసరాలకు తగ్గట్టుగా బలమైన నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలని, దీనికి సంస్థాగత ఎన్నికలను వేదికగా చేసుకోవాలని సూచించారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన పార్టీ ఎన్నికల పరిశీలకుల శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. సంస్థాగత ఎన్నికలను 3 విడతల్లో పూర్తి చేస్తామని.. తొలి విడతలో గ్రామ, మండల కమిటీల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. సంక్రాంతిలోగా తొలి దశ ఎన్నికలు పూర్తి చేయాలన్నారు. పార్టీ పదవుల్లో 33 శాతం చొప్పున యువత, మహిళలకు, మొత్తం పదవుల్లో 50 శాతం బలహీనవర్గాలకు కేటాయిస్తారు.
* ఒక్కో మండలానికి నియమించిన ఆరుగురు పరిశీలకులను 3 బృందాలుగా విభజిస్తారు. వారు 15-18 రోజుల వ్యవధిలో గ్రామకమిటీల ఎన్నికలను నిర్వహిస్తారు. గ్రామ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల్లో ఒకరు ఓసీ. మరొకరు బలహీనవర్గాల వారు.
* స గ్రామ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన వారికే మండల కమిటీల కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు ఓటు ఉంటుంది. మండల కమిటీలో జనాభా ఎక్కువగా ఉన్న పది కులాల నుంచి ప్రతి ఒక్కరికీ ప్రాతినిధ్యం కల్పిస్తారు. దీని కోసం ఐదుగురిని కోఆప్షన్‌ సభ్యులుగా నియమిస్తారు. మండల కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారుల్లో కచ్చితంగా ఒకరు మహిళ ఉంటారు. మండల కమిటీ ఎన్నికలతోపాటే 14 అనుబంధ విభాగాల కార్యవర్గాలను ఎన్నుకుంటారు.
* విశాఖ, విజయవాడల్లో కార్పొరేషన్‌ స్థాయి కమిటీలు ఉంటాయి.
* రెండోవిడతలో జిల్లా కమిటీల ఎన్నికలుంటాయి. జిల్లా కమిటీలు… జిల్లా యూనిట్‌గా ఉండా లా? పార్లమెంటరీ నియోజకవర్గం యూనిట్‌గా ఉం డాలా? పార్టీలో చర్చించి నిర్ణయిస్తారు. జిల్లా కమిటీల ఎన్నికలయ్యాక రాష్ట్ర కమిటీని ఎన్నుకుంటారు.