DailyDose

లోకేశ్‌కు తెదేపాలో పదోన్నతి-రాజకీయం-11/07

Nara Lokesh Gets Promotion In TDP?-Telugu Political News-11/07-లోకేశ్‌కు తెదేపాలో పదోన్నతి-రాజకీయం-11/07

* తెదేపాలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా. ఆపార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేందుకు రంగం సిడం అవుతుందా? అంటే అవుననే చెబుతున్నాయి. తెదేపా వర్గాలు ఈ నియామకం కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మేలోనే పూర్తవుతుందని చెబుతున్నారు. ఎవరేమి చెప్పినా తెదేపా పగ్గాలు నారా లోకేష్ చేతికి వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వంలో కూడా నారా లోకేష్ చాలా కీలకంగా వ్యవహరించారు. అయితే టిక్కెట్ల ఖరారు వంటి విషయంలో మాత్రం చంద్రబాబు పెద్దగా జోక్యం చేసుకోలేదని చెప్పాలి. చివరకు నారా లోకేష్ టిక్కెట్టే చివరు నిమిషం వరకూ ఖరారు చేయలేదు.
*వైకాపా నేతల మెదడు ఇంతేనా?
తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదిస్తుంటే సమాధానాలు చెప్పలేకపోతున్నారని జనసేన విమర్శలు గుప్పించింది. సమాధానం లేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్విట్ పెడుతూ పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఒక్కడంటే ఒక్క వైకాపా నాయకుడు కూడా వాటికి సరైన సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.
*జగన్ ఇంటి కిటీకీలకు రూ. 73 లక్షలా: లోకేష్
తెదేపా ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి తనదిఅన శైలిలో వైకాపా ప్రభుత్వం పైనా ముఖ్యమంత్రి జగన్ పైనా విమర్శనాస్త్రాలు సందించారు. నెలకు ఒక రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నానని చెబుతున్న జగన్ తన ఇంటి కిటికీల కోసం రూ. 73 లక్ష్జల మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి పొందడం ఎంత మోసం అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సరిగా వినండి. నేను మళ్ళీ ఇదే విషయాన్నీ రిపీట్ చేస్తున్నాను. జగన్ నివాసంలో కిటికీల ఏర్పాటుకు 73 లక్షలు కేటాయించారు. ఆన్ బిలివబుల్ మైండ్ పోతోంది అంటూ లోకేష్ ట్విట్ చేశారు. అంతేకాకుండా తన ట్విట్ లో దీనికి సంబందించిన ఆదేశాల ప్రతిని కూడా పొందుపరిచారు.
* తెలంగాణ దేశానికి ఆదర్శం: మంత్రి కొప్పుల ఈశ్వర్
ప్రజా సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన కార్యకర్తలను గుర్తిస్తున్నాం. కార్యకర్తలకు తగిన భాద్యతలు అప్పగిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో‌ పరిస్థితులు మారిపోయాయి. గత ఖరీఫ్ సీజన్ లో కంటే ఈ ఖరీఫ్ సీజన్ లో ధాన్యం దిగుబడి పెరిగింది. నెల రోజుల ముందుగానే ముఖ్యమంత్రి కేసిఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను అప్రమత్తం చేసి రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసారు. ఏళ్లకు ఏళ్లు రాజకీయ అనుభవం ఉన్నవాళ్లు, మంత్రులుగా పని చేసి వాళ్లు అబద్దపు మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
* మహా’ సీఎం ఆయనే… తేల్చిచెప్పిన గడ్కరీ…
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు చేపట్టబోతున్నట్టు వస్తున్న వార్తలను కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు. మహారాష్ట్ర తిరిగి వచ్చే ప్రసక్తే లేదనీ… తాను ఢిల్లీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ కొనసాగుతారని స్పష్టం చేశారు. ‘‘మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది. దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆరెస్సెస్‌కిగానీ, మోహన్ భగవత్‌కి గానీ దీంతో సంబంధం లేదు. మాకు శివసేన మద్దతు ఉంటుంది. వాళ్లతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి…’’ అని ఆయన పేర్కొన్నారు. సీఎం పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకుందామని శివసేన ప్రతిపాదించడం… అందుకు బీజేపీ ససేమిరా అనడంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో్ మెజారిటీ మార్కు 145గా ఉంది. బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది.
* అయోధ్య’ తీర్పుపై అనవసర వ్యాఖ్యలు వద్దు: మోదీ
అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా సున్నితమైన అయోధ్య విషయంలో అనవసర వ్యాఖ్యలు చేయొద్దని కేంద్ర మంత్రులకు సూచించారు. దేశంలో సామరస్యాన్ని కొనసాగించేలా కృషి చేయాలని తెలిపారు.బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని. దేశంలో స్నేహపూర్వక, సామరస్య వాతావరణాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. సుప్రీం తీర్పును విజయం, అపజయం అనే కోణంలో చూడకూడదన్నారు.
*గడ్కరీతో అహ్మద్ పటేల్ భేటీ
గుజరాత్లో ప్రాజెక్టులపై చర్చ కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ బుధవారం కలిశారు. గుజరాత్లో రోడ్డు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించి గడ్కరీతో చర్చలు జరిపినట్లు సమాచారం. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడినప్పటికీ.. వారిద్దరి మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
*కార్యకర్తలను బిడ్డల్లా కాపాడుకుంటున్నాం
తెలంగాణ రాష్ట్ర సమితికి కార్యకర్తలే ప్రధాన బలమని, లక్షల మంది కృషితో రెండుసార్లు అధికారంలోకి వచ్చామని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు తెలిపారు. కార్యకర్తలతో పార్టీ అనుబంధం శాశ్వతమైందని, వారిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కన్నబిడ్డల్లా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారని చెప్పారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలకు బీమా పరిహారం అందించడంతోపాటు వారికి అండగా ఉంటున్నామని తెలిపారు. వివిధ కారణాలతో చనిపోయిన 77 తెరాస కార్యకర్తల కుటుంబసభ్యులకు రూ.2 లక్షల చొప్పున బీమా పరిహార చెక్కులను తెలంగాణ భవన్లో బుధవారం కేటీఆర్ అందజేశారు.
*ఆర్టీసీ సమ్మె తెరాస ప్రభుత్వ పతనానికి నాంది: లక్ష్మణ్
సమ్మె విచ్ఛిన్నానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆపి, చర్చించేందుకు ముందుకు రావాలని భాజపా, ఆర్టీసీ ఐకాస, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. విధుల్లో చేరాలంటూ సీఎం కేసీఆర్ మూడుసార్లు డెడ్లైన్ పెట్టినప్పటికి ఒక శాతం మంది కూడా విధుల్లో చేరలేదని.. ఇది కార్మికుల నైతిక విజయమని పేర్కొన్నారు. ఆర్టీసీ ఐకాస నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్రెడ్డి, రాజిరెడ్డి, వివిధ పక్షాల నేతలు కోదండరాం, మందకృష్ణ మాదిగ, జాజుల శ్రీనివాస్గౌడ్ తదితరులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర నేతలతో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం సమావేశమయ్యారు.
*విజయారెడ్డి హత్యకు సీఎందే బాధ్యత: భట్టి
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు దారితీసిన పరిస్థితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలే కారణమని, జరిగిన ఘటనకు ఆయనే బాధ్యత వహించాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు పాల్పడింది తెరాస కార్యకర్తనే అని, ఇందులో తెరాస నాయకుల ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నందున సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
*రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు: దేవేగౌడ
రాజకీయాల్లో శాశ్వత శత్రువులెవరూ ఉండరని జనతాదళ్ అధినేత దేవేగౌడ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవసరాల కోసం సీఎం యడియూరప్ప, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యతో మాట్లాడడానికి వెనకడుగు వేయనని ఆయన తేల్చి చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రికి దేవేగౌడ ఫోన్ చేసి, భాజపా సర్కారు మనుగడకు సహకరిస్తానని భరోసా ఇచ్చినట్లు ప్రసారమాధ్యమాల్లో హోరెత్తడంపై బుధవారం ఇలా స్పందించారు.
*దుష్ప్రచారాలను నమ్మవద్దు: ఎమ్మెల్యే చెన్నమనేని
తన పౌరసత్వానికి సంబంధించిన విషయాలపై దుష్ప్రచారాలను నమ్మవద్దని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. పౌరసత్వ అంశంపై వాదనలు కొనసాగుతున్న తరుణంలో కొంతమంది కొత్త ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు గత నెల 31న కేంద్ర హోంశాఖ వద్ద వాదనలు జరిగాయని చెప్పారు.
*దోపిడీ బాబు నీతులు చెప్పడమా?
ఐదేళ్ల పాలనతో దేశ పటంలో రాష్ట్ర రాజధాని అడ్రస్ కూడా లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సిగ్గూ ఎగ్గూ లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతుండడం హేయమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి లేక వలసపోయిన భవన నిర్మాణ కార్మికుల గురించి ఒక్కరోజైనా మాట్లాడని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ రాద్ధాంతం చేయడం శోచనీయమన్నారు. బొత్స సత్యనారాయణ మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా వైభోగం అనుభవించిన సుజనా చౌదరి రాష్ట్ర రాజధాని విషయంలో చంద్రబాబు తోకలా వంతపాడటం అనైతికమని పేర్కొన్నారు. తమ నేత వైఎస్ జగన్పై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 14న ఇసుక సమస్యపై చంద్రబాబు దీక్ష తలపెట్టడాన్ని బొత్స ఆక్షేపించారు.
*మాజీ ఎంపీ జేసీకి మరో ఎదురుదెబ్బ
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రవాణా శాఖ అధికారులు మంగళవారం జరిపిన తనిఖీల్లో ఐదు జేసీ ట్రావెల్స్ బస్సులు పట్టుబడ్డాయి. ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లు లేకపోవడంతో అధికారులు ఈ బస్సులను సీజ్ చేశారు. అనంతపురం డీటీసీ శివరాంప్రసాద్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. తాజా దాడులతో ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లలో అక్రమాలు కారణంగా మొత్తం 36 బస్సులు.. 18 కాంట్రాక్టు బస్సులను అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించిన జేసీ బ్రదర్స్ సరైన పర్మిట్లు లేకుండా బస్సులు నడపటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.