DailyDose

భాజపా నేతలతో గంటా దోబూచులాట-రాజకీయ-11/08

Ganta And BJP Playing Hide And Seek-Telugu Political News-11/08-భాజపా నేతలతో గంటా దోబూచులాట-రాజకీయ-11/08

* మాజీ మంత్రి..టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తెలుగుదేశానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన గంటా తాజాగా బీజేపీ ముఖ్యనేత రాం మాధవ్ తో సమావేశమయ్యారు.
తాను బీజేపీలో చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
రెండు రోజులుగా రాజ్యసభ సభ్యుటు..టీడీపీ నుండి బీజేపీలో చేరిన సుజనా చౌదరి..సీఎం రమేష్ తో గంటా చర్చలు జరిపారు. వారి ద్వారా రాం మాధవ్ తో సమావేశమయ్యారు.బీజేపీలోకి వచ్చేందుకు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరితో ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మంతనాలు సాగించినట్లు సమాచారం. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేతో పాటుగా..విశాఖ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే సైతం బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెబుతున్నారు. గంటా ఇక..వైసీపీలో కాకుండా బీజేపీలోనే చేరటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.దీంతో..ఆ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు గంటాతో నడవటానికి సిద్దంగా ఉన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సుజనా చౌదరితో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రాం మాదవ్ తో భేటీ సమయంలో నూ గంటా తో ఈ అంశాల మీద చర్చ జరిగినట్లు సమాచారం. ముందుగా ఈ నెల 10న గంటా టీడీపీకి రాజీనామా చేసి..బీజేపీలో చేరాలని భావించినట్లు చెబుతున్నారు. అయితే, తన సన్నిహితులతో మాట్లాడి పార్టీలో చేరిక ముహూర్తం పైన నిర్ణయం తీసుకుంటానని గంటా చెప్పినట్లు సమాచారం. దీని ద్వారా..ఆయన టీడీపీని వీడుతున్నట్లుగానే భావించాల్సి ఉంటుందని విశాఖ నేతలు చెబుతున్నారు.
*భాజపాలో చేరిన నటి జయలక్ష్మి
నటి జయలక్ష్మి రాజకీయ ప్రవేశం చేసింది. ఈమె బుధవారం కేంద్రమంత్రి పోన్ రాధాకృష్ణన్ సమక్షంలో భాజపాలో చేరింది. ముత్తుక్కు, ముత్తాగా పాండినాటి కుటుంబత్తార్ వేట్టేక్కారాన్ వంటి కొన్ని చిత్రాల్లో నటించిన జయలక్ష్మి ప్రియాన వలె వంటి కొన్ని టీవీ సీరియల్లలోనూ నటించింది. అలాంటిది హటాత్తుగా రాజకీయపై దృష్టి సారించింది భాజపా తీర్ధం పుచ్చుకుంది. జయలక్ష్మి మాట్లాడుతూ తమిళనాడులో ద్రావిడ పార్టీలున్న అవినీతి రాజ్యమేలుతుందని అన్నారు.
*ఎన్నికల్లో ఇరవై కోట్లు ఖర్చు- అచ్చేన్నాయుడు ‘
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు 2014 ఎన్నికల్లో గెలిచేందుకు రూ. 11.5 కోట్లు ఖర్చు చేశానని గతంలో చెప్పారు. మొన్నటి ఎన్నికల సమయంలో తెదేపా ఎంపీగా ఉంటూ జేసీ దివాకర్ రెడ్డి యాభై కోట్లు ఖర్చు అవుతోందని సెలవిచ్చారు. ఇప్పుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఎన్నికల్లో డబ్బు బాగా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోయారు.
* మోదీకి రజనీకాంత్ షాక్..
ప్రముఖ తమిళ కవి,తత్వవేత్త తిరువళ్లువర్‌కు కాషాయ రంగు పులిమినట్టుగా.. తనకూ కాషాయ రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని రజనీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.నేను మీకు చిక్కే వ్యక్తిని కాదు.. సూపర్‌స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఏళ్లుగా ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. సొంత పార్టీ పెడుతారని కొందరు.. లేదు,బీజేపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని మరికొందరు వాదిస్తూ వస్తున్నారు. ఇటీల కేంద్రమంత్రి రాధాకృష్ణన్‌తో రజనీకాంత్ భేటీ అవడంతో బీజేపీలో చేరుతారన్న వాదనలు మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ దానిపై స్పందించారు.ప్రముఖ తమిళ కవి,తత్వవేత్త తిరువళ్లువర్‌కు కాషాయ రంగు పులిమినట్టుగా.. తనకూ కాషాయ రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని రజనీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తనను బీజేపీలోకి లాగేందుకు ప్రయత్నాలు జరిగాయని.. అయితే తిరువళ్లువర్‌ లాగే తానూ కాషాయానికి చిక్కే వ్యక్తిని కాదని వ్యాఖ్యానించారు. తాను బీజేపీకి అనుకూలం కాదని.. తన భావజాలం వేరే అని స్పష్టం చేశారు. రజనీకాంత్ తాజా వ్యాఖ్యలు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారాయి.చాలా కాలంగా దక్షిణాదిలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. తమిళనాడులో రజనీకాంత్ ద్వారా రాజకీయాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారం ఉంది. పలుమార్లు ఆయనతో చర్చలు కూడా జరిపింది.దీంతో రజనీ బీజేపీలో చేరుతారేమోనన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అయితే రజనీకాంత్ చేసిన తాజా ఘాటు వ్యాఖ్యలతో ఆ ప్రచారం పటాపంచలైనట్టే.ఒకరకంగా ఇది బీజేపీకి, మోదీకి షాక్ అని అంటున్నారు. ఇదిలా ఉంటే, తమిళ తత్వవేత్త తిరువళ్లువర్‌కు బీజేపీ నేతలు హిందుత్వాన్ని ఆపాదించడంపై కొద్ది రోజులుగా అక్కడ దుమారం రేగుతోంది. తిరువళ్లువర్ నుదురు,భుజాలకు విభూతి,మెడలో రుద్రాక్షలు ఉన్నట్టుగా బీజేపీ ఇటీవల ట్విట్టర్‌లో ఒక ఫోటో పోస్ట్ చేసింది. అంతేకాదు, దేవుడు,దైవంపై నమ్మకం గల తిరువళ్లువర్ నుంచి డీఎంకె,కమ్యూనిస్టు పార్టీలు చాలా నేర్చుకోవాలి అంటూ ట్వీట్ చేశారు. తిరువళ్లువర్‌కు మతాన్ని,దైవాన్ని ఆపాదించి మాట్లాడటం అక్కడ తీవ్ర చర్చనీయాంశమైంది. బీజేపీ తీరును ద్రవిడ పార్టీలు తీవ్రంగా ఖండించాయి.
*స్‌పీజీ భద్రత రద్దు నిర్ణయం ప్రతీకార చర్యే: కాంగ్రెస్
గాంధీ కుటుంబానికి ఎస్‌పీజీ (స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్) భద్రతను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు వస్తున్న వార్తలపై ఆ పార్టీ సీనియన్ నేత అహ్మద్ పటేల్ మండిపడ్డారు. ప్రతీకార రాజకీయాలకు కేంద్రం పాల్పడుతోందని ఆయన విమర్శించారు. గాంధీల ప్రాణాలతో కేంద్రం రాజీ పడుతోందన్నారు. ఎస్‌పీజీ భద్రత తొలగించడం వల్ల గాంధీ కుటుంబ సభ్యులను తేలికగా టార్గెట్ చేసే అవకాశాలుంటాయని, వారు ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
*50-50 ఫార్ములా గురించి తెలియదు: ఫడ్నవిస్
ప్రభుత్వం ఏర్పాటుపై శివసేన తమను సంప్రదించలేదని, తన కాల్స్‌కు కూడా ఉద్ధవ్ థాక్రే స్పందించలేదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి రాజీనామా పత్రాన్ని అందజేసిన అనంతరం మీడియాతో ఫడ్నవిస్ మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఇంకా తెరుచుకునే ఉన్నాయని చెప్పారు.
*సివసేవ ఎమ్మెల్యేలతో ఆదిత్య తాక్రే భేటి
మహారాష్ట్ర నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో రాష్ట్ర రాజకేయాలు మరింత వేడెక్కాయి. ముఖ్యమంత్రి పీటంపై అటు భాజపా ఇటు శివసేన మంకుపట్టు వీడకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు పై ఇంకా అనిశితి కొనసాగుతూనే ఉంది. ఈనేపద్యంలో ఆదిత్య తాక్రే ఇవాళ ఉదయం ఓ హోటల్ లో శివసేన ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తరువాత కూడా ఆయన తమ ఎమ్మెల్యేలతో చర్చలు జరపడం గమనార్హం. తమ ఎమ్మెల్యేలకు భాజపా డబ్బులు ఎరావేస్తోందని ఆరోపించిన శివసేన నిన్న హుటాహుటీన ఎమ్మెల్యేలను రంగ్ శారద హోటల్ కు తరలించిందే.
*సీఎం పదవి ఇస్తేనే సంప్రదింపులు: శివసేన
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై భాజపా, శివసేన మధ్య ఏర్పడ్డ చిక్కుముడి ఇంకా వీడడం లేదు. ఇరు పార్టీల మధ్య నెలకొన్న మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. శివసేన ప్రముఖ నేత సంజయ్‌ రౌత్‌ శుక్రవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనుకోవడం ప్రజల్ని అగౌరపరచడమేనని అభిప్రాయపడ్డారు. సీఎం పదవి శివసేనకు ఇచ్చేందుకు సమ్మతమయితేనే తమ పార్టీని సంప్రదించాలని భాజపాకు తేల్చి చెప్పారు. అపద్ధర్మ ప్రభుత్వం పేరుతో భాజపా అధికార దుర్వినియోగం చెయ్యొద్దన్నారు.
*విమర్శలకు తావిచ్చేలా వ్యవహరించడం తగదు-తమ్మినేనికి యనమల హితవు
సభాపతి ఆటలో రిఫరీ లాంటి వారని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. సభానాయకుడిని ఏ విధంగా గౌరవిస్తారో, ప్రతిపక్ష నాయకుడిని అంతే సమానంగా గౌరవించాలని ఆయన అన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడడం తగదని యనమల విమర్శించారు. స్పీకర్‌ స్థానానికి ఉన్న గౌరవాన్ని తగ్గించే విధంగా పక్షపాత ధోరణితో తమ్మినేని మాట్లాడుతున్నారని యనమల దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధికి అధికార పక్షం ఎంత ముఖ్యమో, ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలకు తావిచ్చేలా సభాపతి వ్యవహరించడం తగదని హితవు పలికారు.
*ప్రజా నిధుల పద్దులకు నిబద్దులగా పని చేద్దాం: పి.ఎ.సి. కమిటి చైర్మన్ : పయ్యావుల కేశవ్*
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తున్న నిధులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరాలని ప్రజా పద్దుల కమిటి చైర్మెన్ పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. తొలి ప్రజా పద్దుల కమిటి సమావేశం గురువారం ఇన్ చార్జి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రజా పద్దుల కమిటి సభ్యులు ఎమ్మెల్సీ బాల సుబ్రహ్మణ్యం, బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మేరుగ నాగార్జున లు హాజరయ్యారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం 1921 వ సంవత్సరంలో తొలిసారి ప్రజా పద్దుల కమిటిని ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పట్లో అధికార పక్షం వారే ఉండే వారని కాలానుగుణంగా దానిని 1967 వ సంవత్సరంలో ప్రతిపక్ష నేతలకు సంప్రదాయ పద్ధతిలో కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.
*బీజేపీలోకి గంటా!
టీడీపీ ఎమ్మెల్యే, గంటా శ్రీనివాసరావు మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ను కలిసి కీలక మంతనాలు జరిపారు. గంటాతో పాటు ఎంతమంది బీజేపీలో చేరతారన్న విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ వారు బీజేపీతో చేతులు కలిపితే అనర్హత వేటు పడడం, ఇతర న్యాయపరమైన అంశాల గురించి వారు చర్చలు జరిపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న గంటా సుజనా, సీఎం రమేశ్తో కూడా చర్చలు జరిపారు.
*‘విప్’ బాధ్యతల్లోకి గొంగిడి సునీత
‘ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి శాసనసభ విప్గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు జగదీశ్రెడ్డి, హరీశ్రావు శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, మహమూద్ అలీ, శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, సైదిరెడ్డి, భాస్కర్రావు, రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్, భువనగిరి మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, ఆలేరు నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. తనకు విప్గా రెండో దఫా అవకాశం ఇచ్చిన కేసీఆర్కు సునీత కృతజ్ఞతలు తెలిపారు. చట్టసభల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
*పాదయాత్ర అప్పుడే భూములపై కన్నేశారు’
ప్రభుత్వానికి అధికారులను బదిలీ చేసే అధికారం ఉన్నా.. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ జరిగిన తీరు సరికాదని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ తన పాదయాత్ర సమయంలోనే భూములు గుర్తించి వాటిని విక్రయించుకునేందుకు ఇప్పుడు పథకం పన్నారని చినరాజప్ప ఆరోపించారు. ప్రభుత్వం కావాలనే కృత్రిమ ఇసుక కొరత సృష్టించి వైకాపా నాయకుల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తోందని మండిపడ్డారు. 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే నలుగురికి మాత్రమే పరిహారం ప్రకటించారన్నారు. న్యాయవాదులతో కలిసి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఇసుక రీచ్లను పరిశీలించి ఇసుక లభ్యతపై కలెక్టర్కు తమ పార్టీ తరఫున నివేదిక అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం కావాలనే అమరావతి అభివృద్ధిని వదిలేసిందని చినరాజప్ప ఆరోపించారు.
*వెంటనే రాష్ట్రపతి పాలన ఉండదు
మహారాష్ట్రలో మరో రెండు రోజుల్లో అసెంబ్లీ గడువు ముగియనున్న దృష్ట్యా, వెంటనే రాష్ట్రపతి పాలన విధించే అవకాశమేమీ ఉండబోదని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పదవిలో కొనసాగుతారని వెల్లడించాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ పదవీ కాలం పొడిగించాల్సిన అవసరం లేకుండానే కొత్త సర్కారు ఏర్పాటు పూర్తయ్యే వరకూ ప్రస్తుత ప్రభుత్వాన్ని కొన్ని రోజుల పాటు కొనసాగించే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ.. అడ్వొకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా తీసుకున్నారని తెలిపారు.
*వెంటనే రాష్ట్రపతి పాలన ఉండదు-వెల్లడించిన మహారాష్ట్ర రాజ్భవన్ వర్గాలు
మహారాష్ట్రలో మరో రెండు రోజుల్లో అసెంబ్లీ గడువు ముగియనున్న దృష్ట్యా, వెంటనే రాష్ట్రపతి పాలన విధించే అవకాశమేమీ ఉండబోదని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పదవిలో కొనసాగుతారని వెల్లడించాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ పదవీ కాలం పొడిగించాల్సిన అవసరం లేకుండానే కొత్త సర్కారు ఏర్పాటు పూర్తయ్యే వరకూ ప్రస్తుత ప్రభుత్వాన్ని కొన్ని రోజుల పాటు కొనసాగించే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ.. అడ్వొకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా తీసుకున్నారని తెలిపారు.
*అగ్రిగోల్డ్ నిందితులపై కేసులు పెట్టింది మేమే-తెదేపా అధినేత చంద్రబాబు
అగ్రిగోల్డ్ నిందితులపై కేసులు పెట్టింది మేమే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే ప్రక్రియ ప్రారంభించింది తమ ప్రభుత్వమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5లక్షల చొప్పున 100 కుటుంబాలకు రూ.5కోట్లు అందజేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అగ్రిగోల్డ్ నిందితులపై కేసులు పెట్టి ఆస్తులను కాపాడింది తామేనన్నారు. బాధితుల జాబితా సేకరించి తొలి విడత పంపిణీకి తమ ప్రభుత్వం రూ.336 కోట్లు సిద్ధం చేసిందన్నారు. ఆ మొత్తాన్ని వైకాపా ప్రభుత్వం ఇప్పుడు రూ.264కోట్లకు తగ్గించిందని చంద్రబాబు మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం బడ్జెట్లో రూ.1150కోట్లు పెట్టి నిధులు ఎందుకు విడుదల చేయలేదని.. అగ్రిగోల్డ్ ఆస్తులను తెదేపా దోచేసిందన్న ఆరోపణలు ఇప్పుడేమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అగ్రిగోల్డ్పై అసత్య ప్రచారం చేసి బాధితులను వైకాపా నేతలు మనోవేదనకు గురిచేశారని.. వారికి క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
*ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారా? చంద్రబాబు ధ్వజం
సమాజంలో ప్రశ్నించే గొంతులు ఉండకూడదనే ఉద్దేశంతో వైకాపా నేతలు పోలీసుల అండతో తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దీనిపై తాము రాజీలేని పోరాటం చేస్తామన్నారు. తెదేపా లేకుంటే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను దోచేసుకునేవారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లిలో జిల్లాలోని వైకాపా బాధితులతో చంద్రబాబు గురువారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘వైకాపా కార్యకర్తలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. కొబ్బరి, దానిమ్మ, చీనీ చెట్లను ధ్వంసం చేస్తున్నారు. ఇళ్లు కూల్చివేస్తున్నారు.
*కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం చేయండి: ఉత్తమ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు నిరసనగా ఈనెల 8న చేపట్టనున్న కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు డీసీసీల అధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త పాల్గొనాలని గురువారం ఆయన ఓ ప్రకటనలో కోరారు.
*జాతీయస్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘జేఈఈ (మెయిన్)’ పరీక్షను ప్రాంతీయ భాషల్లో నిర్వహించే విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఆంగ్లంతో పాటు గుజరాతీ భాషలో మాత్రమే పరీక్షను పెట్టడమేంటని ప్రశ్నించారు. అన్ని స్థానిక భాషల్లోనూ ఈ పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ 11న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తామన్నారు. తమ మాదిరే ఇతర రాష్ట్రాలూ ఆందోళన వ్యక్తం చేయాలన్నారు
*‘విప్’ బాధ్యతల్లోకి గొంగిడి సునీత
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి శాసనసభ విప్గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు జగదీశ్రెడ్డి, హరీశ్రావు శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, మహమూద్ అలీ, శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, సైదిరెడ్డి, భాస్కర్రావు, రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్, భువనగిరి మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, ఆలేరు నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. తనకు విప్గా రెండో దఫా అవకాశం ఇచ్చిన కేసీఆర్కు సునీత కృతజ్ఞతలు తెలిపారు. చట్టసభల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
*తెదేపాకు యామినీశర్మ రాజీనామా
తెదేపాకు సాదినేని యామినీశర్మ రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు గురువారం ఆమె రాజీనామా లేఖ రాశారు. పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ చంద్రబాబు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిదని లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర బలమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.