Food

జొన్నలు తింటే చికెన్ తిన్నట్లే

Telugu food diet and nutritional information news-జొన్నలు తింటే చికెన్ తిన్నట్లే-Telugu food diet and nutritional information news - Jonnalu telugu information

అన్నం ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నం బదులు రొట్టెలు తీసుకోవచ్చు. పూర్వం ఎక్కువగా తినే ఆహారంలో జొన్నలదే ప్రత్యేక స్థానం ఉండేది. జొన్న ఆహారం తీసుకోవడం వల్ల లాభాలేంటంటే..జొన్నల్లో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను క్రమబద్దీకరిస్తుంది. గ్యాస్, అసిడిటీ సమస్యల్ని తొలగిస్తుంది. మలబద్దకం సమస్య ఉన్నా పరిష్కారం అవుతుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో బీపీ, గుండెపోటు రాకుండా ఉంటుంది.ఒక కప్పు జొన్నల్లో 22 గ్రామలు ప్రొటీన్ ఉంటుంది. ఇది మాంసాహారంలో లభించే ప్రొటీన్ కన్నా ఎక్కువే. మాంసాహారం తినలేని వారు జొన్నలను తింటే ప్రొటీన్లు లభిస్తాయి. ఇవి కండరాల నిర్మాణానికి ఉపయోగపడుతాయి. వ్యాయామం చేసేవారు జొన్న ఆహారం రోజూ తింటే శారీరక దృఢత్వం కలుగుతుంది.రెండు జొన్న రొట్టెలు తిన్నా చాలు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనికి తోడు ఎక్కువ సేపు ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి జొన్నరొట్టెలు మంచి ఫలితాల్ని ఇస్తాయి.మధుమేహం ఉన్నవారికి జొన్నలు బాగా మేలు చేస్తాయి. జొన్నరొట్టెలు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. దీనివల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. మధుమేహం ఉన్నవారు రాత్రి పూట జొన్న రొట్టెలు తింటే ఎక్కువ లాభం. మరుసటి రోజు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.జొన్నల్లో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. క్యాల్షియం, కాపర్, జింక్, పాస్ఫరస్, పొటాషియం, బి విటమిన్లు జొన్నలతో లభిస్తాయి. జొన్నలతో చేసిన ఏ ఆహార పదార్థాలైనా శరీరానికి మేలు చేస్తాయి.