Food

జీలకర్ర రసం తయారీ

Cumin Rasam Indian Spicy Style-Telugu easy short fast recipes-జీలకర్ర రసం తయారీ

కావలసినవి
జీలకర్ర: ఒకటిన్నర టీస్పూన్లు, కందిపప్పు: టేబుల్‌స్పూను, చింతపండు: నిమ్మకాయంత, ఆవాలు: టీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, కొత్తిమీర: కొద్దిగా, టొమాటో: ఒకటి, నూనె లేదా నెయ్యి: టీస్పూను, కారం: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేసే విధానం
* సుమారుగా రెండున్నర కప్పుల నీళ్లలో చింతపండు వేసి నాననివ్వాలి.
* విడిగా మరో గిన్నెలో జీలకర్ర, కందిపప్పు, ఎండుమిర్చి వేసి అరగంటసేపు నాననివ్వాలి. తరవాత వీటిని కరివేపాకుతో కలిపి మెత్తగా రుబ్బాలి.
* మందపాటి గిన్నెలో చింతపండు పిండిన నీళ్లు, జీలకర్ర-కందిపప్పు ముద్ద, ఉప్పు వేసి కలపాలి. తరవాత చిన్న ముక్కలుగా కోసిన టొమాటో వేసి సిమ్‌లో ఉడికించాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి.
* చిన్న కళాయిలో నూనె లేదా నెయ్యి వేసి ఆవాలు, కరివేపాకు, చిటికెడు జీలకర్ర వేసి చిటపటమన్నాక రసంలో కలిపి కాస్త కొత్తిమీర వేసి దించితే సరి.