DailyDose

₹2 కోసం కత్తులతో పొడుచుకున్న కాకినాడ వ్యక్తులు-నేరవార్తలు-11/10

Kakinada Youth Stab Each Other For 2Rupees-Telugu Crime News Today-11/10-₹2 కోసం కత్తులతో పొడుచుకున్న కాకినాడ వ్యక్తులు-నేరవార్తలు-11/10

* కాకినాడ రూరల్ మం. వలసపాకలలో దారుణం.. రెండు రూపాయిల కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ. సైకిల్ కి గాలి పెట్టిన తరువాత డబ్బులు ఇవ్వమని అడిగినందుకు దాడి చేసిన రేవు సువర్ణరాజు అనే యువకుడు. సైకిల్ షాప్ యజమాని సాంబ ను కొట్టడంతో సువర్ణరాజును కత్తితో పోడిచిన సాంబ స్నేహితుడు అప్పారావు.
* గుంటూరు జిల్లా మాచర్ల మండలం బీకేపాలెంకు చెందిన ఓ మైనర్ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియుడు మృతి చెందగా ప్రియురాలు చావుబ్రతుకులతో పోరాడుతుంది. ప్రేమ జంట బ్రహ్మయ్య(17), శీలం ముత్తమ్మ (16) వ్యవహారం పెద్దలకు నచ్చకపోవడంతో ఇరు కుటుంబాలు వాగ్వాదానికి దిగగా మనస్తాపంతో ముత్తమ్మ ఫినాయిల్ తాగగా విషయం తెలిసిన బ్రహ్మయ్య కూడా పురుగుల మందు తాగాడు. ప్రియుడి మృతిచెందగా ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
* భామిని మండలం బాలేరు – దిమ్మిడిజోల మద్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఒడిశా లోని రాయఘడ కు ముడిసరుకుతో వెళ్తున్న లారీ మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ,డ్రైవింగ్ చేస్తూ బాలేరు దాటేక ఎదురు గా వస్తున్న బైక్ ను డీ కొనడంతో బైక్ పై వస్తున్న నైనాపట్నాయిక్( 50) యోగేశ్వరరావు(51) లు అక్కడక్కడే దుర్మరణం పాలయ్యారు.
* యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని నాలుగు గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున దొంగలు స్వైరవిహారం చేశారు. సాయిగూడెం, కొళ్లూరు, చారాజీపేట, టంగుటూరు గ్రామాలలోని 12 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకున్నారు. పదునైన ఇనుప పనిముట్లతో ఇంటి తాళాలను పగులగొట్టారు. ఈ ఘటనలలో సుమారు రూ.2.50 లక్షల విలువైన ఆభరణాలతోపాటు మరికొంత నగదు ఎత్తికెళ్లినట్లు సమాచారం. సమాచారమందుకున్న ఆలేరు పోలీసులు ఆయా గ్రామాలకు వెళ్లి విచారణ జరుపుతున్నారు.
* భర్త వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్‌ జిల్లా తానూరు మండలంలోని నంద్‌గావ్‌లో చోటు చేసుకుంది. తానూరు ఎస్సై గుడిపెల్లి రాజన్న తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని కారేగావ్‌కు చెందిన అవదూత్‌-వందన దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు.. రెండో కూతురు పూజ(19)ను సమీప బంధువులైన నంద్‌గావ్‌ గ్రామానికి చెందిన మున్కేవార్‌ సాహేబ్‌రావు-ఫారిక్‌బాయి దంపతుల కుమారుడు కిరణ్‌కు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. పూజ రెండు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటినుంచి ఫారిక్‌భాయి ఇంటి పనులు చూసుకుంటుంది. తానే అన్ని పనులు చేస్తున్నానని నీ భార్య ఏం చేయడం లేదని భర్త కిరణ్‌ను అత్త ఫారిక్‌భాయి రెచ్చగొట్టేది. దీంతో భర్త కిరణ్‌ బాలింత అని కూడా చూడకుండా పూజను కొట్టేవాడు. ఇలా తీవ్ర నరకయాతన అనుభవించడం తన వల్ల కాదని, జీవితంపై విరక్తి చెందిన పూజ శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఒక్కసారిగా ఆ చిన్నారిని అనాథను చేసి వెళ్లిపోయింది. పూజ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన గ్రామస్థులు బోసి నవ్వులు నవ్వుతున్న రెండు నెలల బాబును చూసి తల్లడిల్లిపోయారు. ఈ బిడ్డ ముఖం చూసైనా పూజ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేదని విచారం వ్యక్తం చేశారు. ఎస్సై జి.రాజన్న, తహసీల్దార్‌ పవన్‌చంద్ర శవ పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు
* వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఆరో స్థానంలో ఉండగా.. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.
* చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం, హత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. చిన్నారిపై అమానుష ఘటన తీవ్రంగా కలచివేసిందని సీఎం అన్నారు. హంతకుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దారుణ ఘటనకు పాల్పడ్డ వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలాఉండగా.. కురబలకోట మండలం చేనేతనగర్‌లోని కల్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు శనివారం పోస్టుమార్టం రిపోర్టు వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందిందని ధృవీకరించారు.
* అయోధ్య తీర్పు నేపథ్యంలో గత పది రోజులుగా కేంద్ర నిఘా వర్గాలు ఆయా రాష్ట్రాలను హెచ్చరించాయి. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అలర్ట్‌గా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది . అయితే తాజాగా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ భారత్‌లో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తోందన్న సమాచారం ఉందని మరోసారి అలర్ట్ జారీ చేశాయి దేశంలోని పలు నిఘా సంస్థలు.మిలటరీ ఇంటెలిజెన్స్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇంటెలిజెన్స్ బ్యూరోలు దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ వరుస హెచ్చరికలు జారీ చేశాయి. అంతేకాదు ఈ దాడులు చాలా తీవ్ర స్థాయిలో ఉండనున్నాయని వెల్లడించింది.
* వివాహ వేడుకలో అపశ్రుతి గోల్నాక పెర్ల్ గార్డెన్ ఫంక్షన్.హాల్ లో గోడకూలి ఐదుగురు మృతి