Movies

నిన్న అన్న. నేడు తమ్ముడు.

mp galla jayadevs younger son galla siddhartha following his brother to get into movies

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చిన్న కుమారుడు, అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు చిన్న మేనల్లుడు గల్లా సిద్ధార్థ కూడా హీరోగా మెప్పించేందుకు సిద్ధమౌతున్నారు. సూపర్‌స్టార్‌ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న తొలి చిత్రం షూటింగ్‌ రామానాయుడు స్టూడియోలో ఆదివారం లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ తన అరంగేట్రం గురించి మీడియాతో ముచ్చటించారు. తమ సొంత నిర్మాణ సంస్థలో కాకుండా అగ్ర సంస్థలో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పలువురు దర్శకులు తీసుకొచ్చిన కథలు వింటున్నానని, త్వరలోనే ఓ క్యూట్ ప్రేమకథతో హీరోగా కనిపిస్తానని పేర్కొన్నారు. ఇదే సందర్భంగా సిద్ధార్థ్‌ తన సోదరుడు గల్లా అశోక్ తొలి సినిమా కోసం చెన్నై, హైదరాబాద్‌లో శిక్షణ పొందారని వివరించారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై పెంచుకున్న ఇష్టమే తమను పరిశ్రమకు దగ్గర చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో గల్లా జయదేవ్ తన పెద్ద కుమారుడ్ని అభిమానులకు పరిచయం చేశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు అభిమానులంతా అశోక్‌ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.