NRI-NRT

ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్శిటీ కేసులో తీర్పు-ఆరుగురు తెలుగువారికి శిక్ష ఖరారు

ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్శిటీ కేసులో తీర్పు-ఆరుగురు తెలుగువారికి శిక్ష ఖరారు

ఈ ఏడాది జనవరిలో అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు మఫ్టీలో మిషిగన్ రాష్ట్రంలోని ఫార్మింగ్టన్‌లో నెలకొల్పిన నకిలీ విశ్వవిద్యాలయ బాగోతాన్ని, అందులో విద్యార్థులను జేరుస్తున్న దళారీలను, విద్యార్థులుగా జేరి అక్రమ వీసాలతో అమెరికావ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్న పలువురిని అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో మొత్తం 8మంది దళారుల్లో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు తెలుగువారికి అమెరికన్ కోర్టు శిక్షలు ఖరారు చేసినట్లు ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ (ICE) అధికారి ఒకరు ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. ICE అధికారులు 2015లో ఈ నకిలీ విశ్వవిద్యాలయాన్ని వీసా అక్రమాలు గుట్టురట్టు చేసేందుకు నెలకొల్పారు. అయితే ఈ విషయం తెలియని పలువురు భారతీయ విద్యార్థులు మధ్యవర్తుల ద్వారా ఇందులో జేరారు. ఈ ఏడాది ప్రారంభంలో అక్రమమని తెలిసినప్పటికీ కూడా ఈ విశ్వవిద్యాలయంలో వర్క్ వీసాల కోసం జేరిన విద్యార్థులను, మధ్యవర్తులను ICE అధికారులు అరెస్ట్ చేశారు. మిగిలిన మరో ఇద్దరి‌కు 2020 జనవరిలో శిక్షలు ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని ICE అధికారి ఖాల్లీద్ వాల్స్ తెలిపారు. ఈ మొత్తం నకిలీ విశ్వవిద్యాలయ వ్యవహారంలో 145కు మంది విద్యార్థులను అమెరికా ప్రభుత్వం వారి స్వదేశాలకు తిప్పి పంపింది.