Devotional

సత్యదేవుని గిరిప్రదక్షిణ

Annavaram Karthika Pournami Special Pujas

రత్నగిరిని చుట్టేద్దాం రండి-రేపే సత్యదేవుని గిరి ప్రదక్షిణ –ఆద్యాత్మిక వార్తలు
కార్తిక పౌర్ణమి సందర్భంగా మంగళవారం సత్యదేవుని గిరిప్రదక్షిణ జరగనుంది. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారని అంచనాతో దీనికి అనుగుణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పటిష్టమైన భద్రత, వైద్య శిబిరాలు ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి, అమ్మవార్లను పల్లకిలో ముందుకు తీసుకెెళ్తుండగా వెనుక సత్యరథం వెంట భక్తజనం రత్న, సత్యగిరులు చుట్టూ నడుచుకుంటూ వెళ్తారు.
**ఇదీ షెడ్యూల్
*ప్రదక్షిణ
అన్నవరం గ్రామంలోని తొలిపావంచాల (రత్నగిరి మెట్లమార్గం ప్రారంభం) వద్ద ప్రారంభమై రత్న, సత్యగిరులు చుట్టూ ప్రదక్షిణ జరుగుతుంది. ప్రారంభమైన చోటే ప్రదక్షిణ ముగుస్తుంది. గ్రామంలోని ప్రధానమార్గం మీదుగా సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, సుబ్బరాయపురం, సాక్షిగణపతి ఆలయం మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకుంటుంది. అక్కడ నుంచి బెండపూడి గ్రామానికి ముందుగా ఉన్న పోలవరం కాలువ గట్టు మీదుగా పంపా సరోవరం చెంత నున్న పంపాఘాట్ నుంచి (రత్న, సత్యగిరిలను చుడుతూ) దిగువ ఘాట్రోడ్డు మీదుగా పాతటోల్గేటు నుంచి తిరిగి తొలిపావంచాల వద్దకు చేరుకుంటుంది. మార్గమధ్యంలో నాలుగు ప్రదేశాల్లో వేదికలు ఏర్పాటు చేశారు. ఆయా వేదికల వద్ద స్వామి, అమ్మవార్లను కొద్దిసేపు ఉంచుతారు.
**ఇతర ఏర్పాట్లు
దేవస్థానం ఆధ్వర్యంలో 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు మంచినీటి సీసాలు, యాపిల్, కమలా, అరటిపండ్లు, పాలు, మజ్జిగ, పానీయాలు, ఇతర ఆహార పదార్థాలు, ప్రసాదం పంపిణీ చేస్తారు. వైద్య సిబ్బంది, అంబులెన్స్లను సిద్ధం చేశారు. పలు ప్రదేశాల్లో మరుగుదొడ్లు, మూత్రవిసర్జన శాలలు అందుబాటులో ఉంచారు. ప్రదక్షిణ చేసే మార్గంలో కొంత తారురోడ్డు ఉండగా మిగిలిన ప్రదేశం మట్టిరోడ్డు కావడం, చిన్నచిన్న రాళ్లు కాళ్లకు గుచ్చుకునే అవకాశమున్న నేపథ్యంలో గడ్డిని వేస్తున్నారు. ముందు గడ్డిని తడుపుతుంటారు. వెనుక భక్తులు నడిచేలా ఏర్పాట్లు చేశారు.
*విశిష్టత
సత్యదేవుడు కొలువై ఉన్న రత్న, సత్యగిరులు ఆధ్యాత్మిక, హరిత సిరులతో అలరారుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గిరుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే సర్వపాపాలు హరిస్తాయని, కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని, భూప్రదక్షిణ చేసినంత ఫలితముంటుందని భక్తుల విశ్వాసం. కొండపై ఉండే దివ్య ఔషధ గుణాలు, ఇతర పలు జాతుల వృక్షాలు శారీరక ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయని పండితులు చెబుతున్నారు.
1.నేడు, రేపు శ్రీశైలంలో ఆర్జిత సేవల నిలుపుదల
కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన, బ్రే్ దర్శనం టికెట్ల విక్రయాలను నిలిపివేశారు.
2.యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ఆదివారం భక్త జనసంద్రం పోటెత్తింది. వారాంతపు సెలవుతోపాటు కార్తీకమాసం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం రాత్రి నుంచే రద్దీ మొదలైంది. హరిహరుల ఆలయాలు కిటకిటలాడాయి. బాలాలయంలో నిత్యకల్యాణం, మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాలు అధికంగా జరిగాయి. వ్రతాలతో ఆలయ ఖజానాకు రూ.5.28 లక్షలు చేకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దైవదర్శనానికి నాలుగు గంటల సమయం పట్టిందని ధర్మదర్శనం చేసుకున్న భక్తులు చెప్పారు. గుట్టపైకి వాహనాలను అనుమతించకపోవడంతో చాలామంది కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. దీంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడ్డారు.
3. కార్తీక మహాపర్వం పున్నమి
కార్తీకమాసంలో ఉన్నవన్నీ పర్వదినాలే. అయితే ఈ పర్వదినాలన్నింటిలోకీ పర్వదినం కార్తీక పున్నమి అని చెప్పవలసి ఉంటుంది. మాసంలో మిగిలిన అన్ని రోజులూ చేసే స్నానం దానం దీపం జపం ఉపవాసం వంటివన్నీ ఒక ఎత్తు. పున్నమినాడు చేసేవన్నీ ఒక ఎత్తు. అంతటి విశిష్టత ఉంది కార్తీక పున్నమికి. కార్తీక పౌర్ణమినాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు.ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు, సిక్కులకు కూడా విశిష్ట పర్వదినం. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.ఈ రోజున స్త్రీలు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి, ఫలహారంగా స్వీకరించాలని శాస్త్రోక్తి. ఇలా చేయడం వల్ల కడుపు చలవ (బిడ్డలకు రక్ష) అని పెద్దలంటారు. ఆరోగ్యపరంగా చూస్తే– ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం. శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం ఈ రోజుకు మరో ప్రత్యేకత. ఇంకా ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారీ రోజు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానా ఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, కృత్తికా వ్రతం లాంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణ, లక్షవత్తులు, లక్షరుద్రం లాంటి పూజలూ చేస్తారు ఈ రోజు.నేడు ప్రత్యేకంగా చేయవలసినవి: దైవ దర్శనం, దీపారాధన, దీపదానం , సాలగ్రామ దానం , దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణం పేర్కొంటోంది. అదేవిధంగా అరుణ గిరిపై వెలిగించే కార్తీక దీపం ఎంతో విశిష్టమైనది. కన్నుల పండుగైనదీ. వందల టన్నుల ఆవునెయ్యిలో వేల టన్నుల నూలు వస్త్రాన్ని ముంచి, అరుణగిరి కొండలపై వెలిగించే ఈ దీపం ముందు ఆనాటి పున్నమి వెన్నెల చిన్నబోతుంది. పదిరోజులపాటు వరుసగా పున్నమి వెన్నెలను వెదజల్లుతుంది.
4. శుభమస్తు
తేది : 11, నవంబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : చతుర్దశి
(నిన్న సాయంత్రం 4 గం॥ 31 ని॥ నుంచి
రోజు సాయంత్రం 5 గం॥ 58 ని॥ వరకు)
నక్షత్రం : అశ్విని
(నిన్న సాయంత్రం 5 గం॥ 17 ని॥ నుంచి
రోజు రాత్రి 7 గం॥ 15 ని॥ వరకు)
యోగము : సిద్ధి
కరణం : గరజ
వర్జ్యం : (ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 38 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 11 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 10 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 7 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 49 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 59 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 18 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యరాశి : తుల
చంద్రరాశి : మేషము
5. చరిత్రలో ఈ రోజు/నవంబర్ 11*అబ్దుల్ కరీంఖాన్
భారత జాతీయ విద్యా దినోత్సవం
1872 : హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన వారిలో ప్రముఖుడు అబ్దుల్ కరీంఖాన్ జననం (మ.1937).
1888 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జననం (మ.1958).
1918 : బిర్లా కుటుంబానికి చెందిన సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త కృష్ణ కుమార్ బిర్లా జననం (మ.2008),
1970: పద్మభూషణ్ మాడపాటి హనుమంతరావు మరణం (జ.1885).
image.gif
1985 : భారత వన్డే మరియు ట్వంటీ-20 క్రికెట్ ఆటగాడు రాబిన్ ఊతప్ప జననం.
2002 : గ్రంథాలయోద్యమ నేత మరియు విశాలాంధ్ర ప్రచారకుడు కోదాటి నారాయణరావు మరణం (జ.1914).
6. శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము
*_కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్_*
11.11.2019 వతేది, *సోమవారము ఆలయ సమాచారం* *_శ్రీ స్వామి వారి దర్శన వేళలు_*ఉదయము 5.30 గంటలకు అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికాల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ..స్వామి వారి దర్శనము ఉదయము 6.00 గంటల నుండి 7.30 గంటలకు వుండును అనంతరము ఉదయం 7.30 గం|| నుండి అర్జిత అభిషేక సేవ సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటల నుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు…*దేవస్థానమునకు అనుబంద దేవాలయము శ్రీఉమమాహేశ్వరస్వామి (శివాలయము) లో పరమేశ్వరడికి ప్రత్యేక విశేష రూద్రభిషేకము ఉదయము 7.30 గంటల నుండి జరుగును* అభిషేక సేవా అనంతరము శ్రీస్వామి వారి దర్శనము ఉ.10.00 గంటల నుండి మధ్యహ్న 12.30 గంటల వరకు వుండును రెండవ మహాగంట నివేదనమ.12.30 నుండి 1.00 లోపు, బాలబోగ్యం త్రికాల నైవేద్యాము సమర్పణమ 1.00 నుండి 1.30 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును.. మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.30 నుండి 7.00 లోపు, బాల బోగ్యం త్రికాల నైవేద్యాదులు సమర్పణ మహ మంగళ హారతి, పరివార దేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ..
తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 7.00 గంటల నుండి రా.8.30 వరకు వుండును.. రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
*ఆర్జిత సేవాల వివరములు*
*11.11.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్ : 35*
*11.11.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్ : 5*
7. ఓం నమో వెంకటేశాయ
,సోమవారం ఉదయం 6 గంటల సమయానికి తిరుమల లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 5 కంపార్ట్మెంట్ నిండిపోయాయి సర్వదర్శనానికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 82,593. స్వామివారి హుండీ ఆదాయం రూ. 2.14 కోట్లుగా ఉంది.
మరిన్ని వివరాలకు www.edukondalu.com ను వీక్షించండి
8. నేటి పంచాంగం 10.11.2019
తిథిలు : శుక్లపక్ష త్రయోదశి, శుక్ల పక్ష చతుర్ధశి
రాహుకాలం సాయం కాలం 4.13 నుంచి 5.37 వరకూ
దుర్ముహూర్తం సాయం కాలం 04.07-04.52
వర్జం మ. 2.57 – 4.41
మరిన్ని వివరాలకు www.edukondalu.com ను వీక్షించండి.
9. తిరుమల సమాచారం**ఓం నమో వేంకటేశాయ*
ఈరోజు సోమవారం *11-11-2019* ఉదయం *5* గంటల సమయానికి.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ…
శ్రీవారి దర్శనానికి *5* కంపార్ట్ మెంటులలో వేచి ఉన్న భక్తులు…….
శ్రీవారి సర్వ దర్శనానికి *4* గంటల సమయం పడుతోంది…..
ప్రత్యేక ప్రవేశ (₹-300) దర్శనానికి *3* గంటల సమయం పడుతోంది….
కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు *3* గంటల సమయం పడుతోంది…..
నిన్న నవంబర్ *10* న *82,593* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది…
10.. రాశిఫలం – 11/11/2019
తిథి:
శుద్ధ చతుర్దశి సా.5.00 , కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం:
అశ్విని రా.7.19
వర్జ్యం:
మ.2.57 నుండి 4.41 వరకు, తిరిగి రా.తె.5.35 నుండి
దుర్ముహూర్తం:
మ.12.24 నుండి 01.12 వరకు, తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
రాహు కాలం:
ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం వుంది. ఆర్థికంగా బలపడతారు. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందుతారు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా నుండవు. వృధా ప్రయాణాలెక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభముంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలెక్కువ చేస్తారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనవసర వ్యయప్రయాసలుంటాయి. ప్రయాణాలెక్కువ చేస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన అధిగమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. ఆత్మీయుల సహాయ సహకారాలకై సమయం వెచ్చించాల్సివస్తుంది.
మక:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. చేసే పనులలో ఇబ్బందులుంటాయ. క్రొత్త పనులను ప్రారంభించుట మంచిది కాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళనతో కాలం గడుపుతారు. స్ర్తిలు చేసే వ్యవహారాల్లో సమస్యలెదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశముంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండుట మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయ. ఆరోగ్యం గూర్చి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా నుండుట మంచిది.
11. శ్రీరస్తు శుభమస్తు
తేది : 11, నవంబర్ 2019*
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
image.gif
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : ఇందువాసరే (సోమవారం)
పక్షం : శుక్లపక్షం
తిథి : చతుర్దశి
(నిన్న సాయంత్రం 4 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 6 గం॥ 2 ని॥ వరకు చతుర్దశి తిధి తదుపరి పౌర్ణమి తిధి)
నక్షత్రం : అశ్విని
(నిన్న సాయంత్రం 5 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 17 ని॥ వరకు అశ్వని నక్షత్రం తదుపరి భరణి నక్షత్రం )
యోగము : (సిద్ధి ఈరోజు ఉదయం 10 గం ll 48 ని ll వరకు తదుపరి వ్యతీపాత రేపు ఉదయం 10 గం ll 36 ని ll వరకు)
కరణం : (వణిక్ ఈరోజు సాయంత్రం 6 గం ll 2 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మధ్యాహ్నం 12 గం ll 0 ని ll )
వర్జ్యం : (ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 41 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 11 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 13 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 12 గం॥ 55 ని॥ వరకు మరియు ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 11 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ వరకు)
గుళికాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 49 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 0 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 19 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యరాశి : తుల
చంద్రరాశి : మేషము
కార్తీక వ్రత ఉద్యాపనం
12. శుభోదయం*
*మహానీయుని మాట*
” నువ్వు సూటిగా , నిజాయితీగా వ్యవహరించినా ప్రజలు నిన్ను మోసగించవచ్చు అయినా నువ్వు సూటిగా, నిజాయితీగా ఉండు ”
*నేటి మంచి మాట*
” స్వభావాన్ని బట్టే అభిరుచులు ఉంటాయి..
కోయిల మామిడిపళ్ళను ఇష్టపడితే కాకి వేపపళ్ళను తింటుంది కదా. ”
13. నేటి సుభాషితం*
*సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు, మంచితనం మాత్రం అభిమానాన్ని, దీవెనలను తీసుకువస్తుంది.*
14. నేటి ఆణిముత్యం *
ఎదుటివారి గూర్చి ఎక్కసమ్ముగనైన
మాటలాడు టయది చేటుతెచ్చు
తూలనాడ వలదు దోషాత్మునైనను
విజ్ఞత గలచోట విభవ మొప్పు
*భావం:*
ఎదువారి గురించి వేరొకరి దగ్గర వేళాకోలంగా మాట్లాడకు.అది నీకు గొడవలకు కారణమౌతుంది. తప్పు చేసినప్పటికీ వారిని కించపరుస్తూ మాట్లాడవద్దు.నీ బుద్ధి నీకు వైభవాన్ని తెస్తుంది. తదననుగుణంగా ప్రవర్తించు.
15. నేటి సామెత
*పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది*
మంచి వానికి అందరు మంచి వారుగానె… చెడు వానికి అందరు చెడ్డగానే కనబడతారని ఈసామెత అర్థం.
16. నేటి జాతీయం
*కొంప మునిగింది*
పెద్ద ఘోరం జరిగి పోయిందని అర్థం. వరదల్లో కొంపలు మునిగి పోతాయి. అలా కొంపలు (ఇండ్లు) మునిగి పోతో సర్వం కోల్పోయినట్టే….. సర్వం అనగా….. డబ్బులు… ఆహార దాన్యాలు, వస్త్రాలు…. ఒక్కొక్క సారి కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకోవలసి వస్తుంది. అలాంటి వారి కేవలం కట్టు బట్టలతోనే మిగిలి వుంటారు. అలా సర్వం పోగొట్టుకుంటే ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
17. మన ఇతిహాసాలు
*రామాయణం, మహాభారతం- రెండింటిలోనూ కనిపించే ఒకే పాత్రలురామాయణ మహాభారతాలు హిందూ పురాణాలలో మహా కావ్యాలుగా పూజింపబడుతూ యుగయుగాలుగా గౌరవించబడుతున్నాయి. హిందువులు వీటిని కేవలం కధలుగా కాకుండా ఇతిహాసం లేదా చరిత్ర గా భావిస్తారు.ఈ కావ్యాలలో వర్ణించబడిన సంఘ్తటనలు నిజం గా జరిగాయని, మరియూ వాటిలోని పాత్రధారులు ఒకప్పుడు రక్త మాంసాలతో కూడిన శరీరం తో భూమి మీద తిరిగారనీ హిందువుల విశ్వాసం. రామాయణం త్రేతా యుగం(యుగాలలో రెండవది)లో జరిగితే, మహాభారతం ద్వాపర యుగం(మూడవ యుగం) లో జరిగింది. ఈ రెంటి నడుమ చాలా సంవత్సరాల వ్యత్యాసం(బహూశా కొన్ని మిలియన్ల సంవత్సరాలు) ఉంది.కానీ ఈ రెండింటిలోనూ కనిపించిన పాత్రలు కొన్ని ఉన్నాయి.
*విభీషణుడు
రాముడి పక్షాన ఉండి పోరాడిన విభీషణుడు రావణుడి సోదరుడు.రామ రావణ యుద్ధం ముగిసాకా విభీషణుడు లంకకి మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు.మహాభారతంలో పాండవులు రాజసూయ యాగం చేసినప్పుడు విభీషణుడు వారి ఆహ్వానాన్ని మన్నించి విలువైన కానుకలని పంపిచాడు.
*పరశురాముడు
రామాయణంలో పరశురాముడు శ్రీ రాముడిని ద్వంద్వ యుద్ధం కోసం సవాలు విసిరినట్టుగా చెప్తారు.సీతా స్వయం వరం లో శివ ధనస్సుని శ్రీరాముడు విరిచినప్పుడు పరశురాముడు కలత చెందాడు.రాముడు శ్రీ మహా విష్ణువు అవతారమని తెలియగానే పరశురాముడు క్షమాపణ కోరి శ్రీరాముడిని ఆశీర్వదించాడు.భీష్మ, కర్ణుల గురువుగా పరశురాముడు మహాభారతం లో పేర్కొనబడ్డాడు.తిరుమలలో ఎన్ని రకాల దర్శనాలున్నాయి? http://www.edukondalu.com/types-of-dharshanas-in-tirumala/
18. తిరిమల తిరుపతి దేవస్థానంస్వామివారిని దర్శించుకున్న ఎంపీ విజయసాయి రెడ్డి
తెలంగాణ ఆర్టీసీ ఐకాస కార్మికులు చేపడుతున్న సమ్మె సెగ విదేశాలకూ పాకింది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ అభివృద్ధి వేదిక (టీడీఎఫ్‌) 20వ వార్షిక వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధికి ప్రవాసులను సమాయత్తం చేయాలని టీడీఎఫ్‌కు సూచించారు. సమావేశం మధ్యలో కొందరు ఎన్నైరైలు పైకి లేచి ప్లకార్డులు ప్రదర్శించారు. ‘సేవ్‌ ఆర్టీసీ..సేవ్‌ ఆర్టీసీ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. ఎన్నారైల ఆందోళన మధ్యే వినోద్‌ ప్రసంగించారు. ఈ వేడుకలకు వరంగల్‌ గ్రామీణ జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, డాక్టర్‌ దేవయ్య తదితరులు హాజరయ్యారు.
19. 13 నుంచి వారణాసిలో అతిరుద్ర యాగం
ఈ నెల 13 నుంచి 24 వరకు వారణాసిలో మైసూర్ అవదూత దత్తపీఠం ఆధ్వర్యంలో అతి రుద్రయాగం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. గణపతి సచ్చిదానందస్వామి నేత్వత్వంలో 13 న గణపతిహోమం, గంగాపూజతో ప్రారంభమయ్యే యాగం 12 రోజులపాటు జరుగుతుందని పేర్కొన్నారు. 24న కాశీవిశ్వనాథ మందిరంలో జరిగే మహా పూర్ణాహుతిహోమం, అభిషేకంతో యాగం ముగుస్తుందని నిర్వహకులు తెలిపారు.