Agriculture

పొగాకు రైతు ఉద్యమ చరిత్ర పుస్తకం ఆవిష్కరించిన ఏపీ గవర్నర్

AP Governor Releases Tobacco Farmer History In AP Book By Yalamanchili Sivaji

మాజీ పార్లమెంట్ సభ్యులు డా.యలమంచిలి శివాజీ రచించిన “క్రాప్ హాలీడే-ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతు ఉద్యమ చరిత్ర” పుస్తకాన్ని సోమవారం నాడు విజయవాడలోని ద వెన్యూ కన్వెన్షన్ సెంటరులో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ ఆవిష్కరించారు. రైతునేస్తం ప్రచురించిన ఈ పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో నాటి రైతాంగ పోరాటాలను కళ్లకు కట్టినట్లు వివరించిందని గవర్నర్ శివాజీని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అధికార భాషా సంఘం ఛైర్మన్ డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, రైతునేస్తం ఎడిటర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.