Health

నల్లద్రాక్ష, క్యాన్సర్, క్యాప్సికం-ఆరోగ్య సమాచారం

Health news roundup of the day in Telugu-Nov 11 2019

1.కేన్సర్ పరిశోధనలో ముందడుగు
కేన్సర్ ఈపేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది. ఈ వ్యాధి బారినపడి ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వ్హిన్నరుల నుంచి పెద్దల వరకు అందరి పాలిట శాపంగా మారిన కేన్సర్ ను పూర్తిగా నయం చేసే ప్రయత్నాల్లో అమెరికా పరిశోధకులు తోలి అడుగు వేశారు. కేన్సర్ ను అరికట్టే కౌపాక్స్ తరహా కొత్త వైరస్వ ను సృష్టించారు. దీనితో అన్ని రకాల కేంసర్లను సులువుగా నిరోధించవచ్చుఅని అంటున్నారు. కేన్సర్ వైద్య నిపుణుడు యుమన్ ఫంగ్ దీనిపై వివరాలు తెలిపారు.
2. గుమ్మడి గింజలతో ఆరోగ్యం
గుమ్మడి కాయను వంటకాల్లో చాలామంది ఉపయోగిస్తారు. కానీ గుమ్మడి గింజలను పారేస్తుంటారు. అయితే వాటిలో ఆరోగ్యానికి మేలు చేకూర్చే విశేషాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్లు, పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. గుమ్మడిలో ఉండే విటమిన్‌ ఎ, సి, ఇ, కె లు, యాంటీఆక్సిడెంట్స్‌, జింక్‌, మెగ్నీషియం మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకోకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిది. .గుమ్మడి గింజలు క్యాన్సర్‌ నివారిణిగా పనిచేస్తాయి. ఎటువంటి క్యాన్సర్‌ అయినా సరే గుమ్మడి గింజలు నివారిస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌లను నివారించగలిగే రోగనిరోధక శక్తిని ఇవి కలిగి ఉంటాయి. ప్రొస్టేట్‌ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్యపరంగా గుమ్మడికాయ సరిపోతుంది. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్‌ నిల్వలు, కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్నవారిలో అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్‌ నిల్వలనూ గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది. డయాబెటీస్‌ రాకుండా నివారించేందుకు, వచ్చిన వారికీ గుమ్మడి ఎంతో మంచిది . గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. గుమ్మడి గింజల్లో వివిధ రకాల నొప్పులను నివారించగలిగే యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడి గింజలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వివిధ రకాల నొప్పులు, బాధలు నుండి, ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌ లేకుండా విముక్తి పొందవచ్చు.గుమ్మడి గింజల నుంచి తీసిన నూనెను ఉపయోగించడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారిలో కిడ్నీ ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.
3. పోషకాహారంతో ఆరోగ్యం సొంతం
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు. కొందరు కొద్ది నలతగా ఉన్నప్పటికీ పట్టించుకోరు. పరిస్థితి అదుపు తప్పిన తర్వాత వైద్యుల దగ్గరికి వెళ్తుంటారు. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కాకపోతే కాస్త శ్రద్ధ తీసుకోవాలి. శరీరానికి అవసరమైనంత పౌష్టికాహారం తీసుకుంటే.. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు డాక్టర్లు. పండ్లు, కూరగాయలు, పాలు, మాంసకృత్తుల వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచి స్తున్నారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేక చాలామంది వ్యాధులబారిన పడుతున్నారు. ఆహారంలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం, సమయాలు పాటించకపోవడం, కల్తీ పదార్థాలను తీసుకోవడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నారు. మంచి ఆహారం, సరిపోయి నంత నిద్ర, వ్యాయామం ఇవన్నీ పాటిస్తూ, మనసు ప్రశాంతంగా పెట్టుకుంటే మంచి ఆరోగ్యం సొంతమవుతుందని సూచిస్తున్నారు నిపుణులు. అసలు ఎలాంటి ఆహారం ఎలా తీసుకోవాలనే విషయాలను వివరిస్తున్నారు వైద్యులు.ఆహారం ఒకేసారి కాకుండా ప్రతి మూడు గంటలకు ఒక సారి కొంచెం.. కొంచెంగా తీసుకోవడం ఉత్తమం.
* ఆహారంగా తీసుకునే పదార్థాలను ఎక్కువ సేపు ఉడకపెట్టకూడదు. రోజూ ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లలో ఉండే సూక్ష్మ పోషక పదార్థాలు, ఫైబర్ శరీరానికి మేలు చేస్తాయి. పసుపు, నారింజ రంగులో ఉండే పళ్లు కొన్ని రకాల దీర్ఘకాల జబ్బులనూ నిరోధిస్తాయి. తాజాగా ఉండే పచ్చి కూరగాయలు, పళ్లను సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు.
* ఆహారంలో ‘ఎ’ విటమిన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ‘ఎ’ విటమిన్ అంధత్వాన్ని నివారించడంతో పాటు పిల్లల్లో వాంతులు, విరేచనాలు, తట్టు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు తదితరమైన వాటిని నివారిస్తాయి.
* కెరోటిన్ ఉన్న మునగాకులు, తోటకూర, మెంతికూర, పాలకూర, క్యారట్, మంచి గుమ్మడి, మామిడి, బొప్పాయిలను తీసుకున్నట్లయితే అవి శరీరంలో ‘ఎ’ విటమిన్‌గా మారతాయి.
* ‘డి’ విటమిన్ కూడా అవసరం మేరకు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
వీటిని తక్కువగా తీసుకుంటే మంచిది:
* వంటనూనెలు, నెయ్యి, వెన్న, వనస్పతి వంటివి చాలా తక్కువగా వినియోగించాలి. ఎక్కువగా తీసుకుంటే కొవ్వు పెరిగి స్థూలకాయం తద్వారా గుండెజబ్బులు, కేన్సర్ లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. మాంసాహారులు మేక మాంసం, కోడి మాంసం బదులు చేపలు తీసుకోవడం మేలు. మాంసాహారంలోనూ లివర్, కిడ్నీ, బ్రెయిన్ వంటి పదార్థాలను మానుకోవడం మంచిది.
* ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.
* రెండు మూడు రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవద్దు.
* విపరీతమైన ఉపవాసాలు లాంటివి చేయడం మంచిది కాదు.
* చక్కెర, కొవ్వు పదార్థాలున్న ఆహారాన్ని, మద్యాన్ని తగ్గించాలి.
* ఎక్కువ కొవ్వు ఉన్న పాలను తీసుకోవద్దు.
* ఊరగాయలు, ఉప్పు, బిస్కెట్లు, చిప్స్, వెన్న, పిజ్జా, శీతలపానీయాలు, ప్రాసెస్ చేసిన పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి.
* పొగ తాగడం, పొగాకు నమలడం, గుట్కా, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.
* ముప్పై ఏళ్లు పైబడిన వారు రక్తంలో గ్లూకోజ్, లైపిడ్ల స్థాయి పరీక్షలతోపాటు బీపీ పరీక్షల్లాంటివి చేయించుకోవాలి.
* 30 ఏళ్లు దాటిన మహిళలు కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి.
* పిల్లలు, గర్భిణులకు రోగ నిరోధక మందులు, టీకాలు వంటివి ఇప్పించాలి.* వినియోగానికి ముందు కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడగాలి.
* వండిన పదార్థాన్ని సరైన విధంగా నిల్వ ఉంచి సూక్ష్మక్రిములు, ఎలుకలు, కీటకాల బారి నుంచి కాపాడాలి.
సురక్షిత పానీయాలు తీసుకోవాలి..
* పరిశుభ్రమైన నీటినే తాగాలి. మంచినీరు తాగితే 50 శాతం రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు.
* నీరు కలుషితమైనదనే అనుమానం ఉంటే కాచి వడ పోసి తాగాలి.
* నీటితోపాటు పాలు కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం. రోజుకు 250 మి.లీ. కాచి, చల్లార్చిన లేదా పాశ్చరైజ్డ్ పాలను వాడితే మంచిది.
* కాఫీ కంటే టీ తీసుకుంటే మంచిది. అది కూడా ఒకటి రెండుసార్ల కంటే ఎక్కువ వద్దు.సరైన నిద్ర అవసరం
రోజుకు ఏడు గంటలపాటు నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. నిద్ర వేళలతో పాటు, భోజన వేళలు కూడా మార్పు చెందుతున్నాయి. ఇవి శరీరాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. దీనిని నివారించడానికి సమయం ప్రకారం నిద్ర పోవాలి. రాత్రి పూట నిద్ర వల్ల శరీరం పనితీరు మెరుగ్గా ఉంటుంది. రోగ నిరోధక విధానం అభివృద్ధి చెందుతుంది. గాఢనిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి, ప్రశాంతత దొరుకుతుంది. రోజూ పెద్ద వాళ్లు కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్ర పోవడం మంచిది. మరుసటి రోజుకు చురుకుగా పనిచేయడానికి నిద్ర చాలా ఉపయో గపడుతుంది. శరీరానికి వ్యాయామం తప్పకుండా అవసరం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి
ఆరోగ్యం విషయంలో అవగాహన ఇంకా పెరగాలి. చాలా మంది జబ్బు వచ్చిన తర్వాతే చుద్దామనే ధోరణితో ఉంటున్నారు. ఇలా కాకుండా 25 ఏళ్లు దాటగానే ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి రోజూ తప్పని సరిగ్గా 30 నుంచి 45 నిమిషాలు నడవాల్సిందే… అస్తమానం కుర్చీకే అతుక్కు పోకుండా… ప్రతి అరగంటకు ఒకసారి అలా నడవాలి. భోజనాలు, టిఫిన్లను సమయానికి పూర్తి చేయాలి. రాత్రిపూట ఎక్కువసేపు మెలకువగా ఉండకూడదు. అరటి, బత్తాయి, కమలాలు, ద్రాక్ష వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఎర్రటి మాంసం, మీగడ, వెన్న, నూనె వంటి వాటికి దూరంగా ఉండాలి. బయటి ఆహార పదార్థాల జోలికి అసలే వెళ్లొద్దు. టెన్షన్ సమయంలో ఆత్మీయులతో మాట్లాడాలి. మంచి సినిమా చూడాలి. సంగీతం వినాలి.ఇలా మంచి జీవనశైలిని అలవాటు చేసుకుంటే చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది.
4.రక్తంలో షుగర్ తగ్గించే????
దయబెతీస్ ఉన్నవారు రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించే గలిగే ప్రయోజనం పొందవచ్చు టైప్ టూ మధుమేహం ఉన్నవారికి మరియు ఇప్పుడిప్పుడే మధుమేహ లక్షణాలు ఉన్నవారికి వెంటనే కంట్రోల్ లో వచ్చే కొన్ని ఇన్ స్టాంట్ మందులు ఉన్నాయి. మీకు మధుమేహం ఉంటె మీ రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడం చాలా ముఖ్యం గ్లైసేమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే ఆహారాలను తిందాం లేదా స్వీట్స్ సాఫ్ట్ డ్రింక్స్ కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. అదనపు గ్లూకోజ్ ను బహ్ర్తీ చేయడానికి ఇన్సులిన్ అవసరం అవుతుంది. మీ రక్తంలో చక్కర స్థాయిలను క్రమడ్డంగా ఉంచడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం మరియు ఎనర్జీ పొందడానికి సహాయపడుతుంది.
5.నల్ల ద్రాక్ష తో జ్ఞాపకశక్తి
సాధారణంగా నల్లద్రాక్ష తెలియని వారుండరు. ఎందుకంటే తక్కువ ధరకు లభించే ఈ నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి అందానికి చేసేమేలు అంతా ఇంతా కాదు. ద్రాక్షలో విటమిన్ ఎ , సి b6 ఫోలిక్ ఆమ్లం పుస్ఖలంగా ఉన్నాయి. పొటాషియం, మెగ్నీషియం సేలినీయం లాంటి ఎన్నో రకాల ఖనిజ లవణాలు ద్రక్షల్లో సమృద్దిగా అభిస్తాయి. అంతేకాదు ప్లేవనయిడ్స్ లాంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఫ్రిరాదికల్స్ బారి నుండి రక్షిస్తాయి. నల్లద్రాక్ష రక్తంలోని చక్కర స్థాయిని అదుపులో ఉంచుతుంది. రక్త సరఫరాను ,మెరుగుపరుస్తుంది.
6.కొలెస్ట్రాల్ కరిగించే కాప్సికం ‘
మారిన జీవన విధానంలో ఎక్కువ మందిని పట్టిపీడిస్తున్న సమస్య కొలెస్ట్రాల్. శరీరంలో కొవ్వు శతం అధికంగా కావడమే కొలెస్ట్రాల్. ఇకనిత్యం మనం తినే పలు రకాల ఆహారాల వల్ల మన శరీరంలో కొవ్వు పెరుకుపోతుందని అందరికీ తెలిసిందే. అయితే ఎనభై శాతం కొలెస్ట్రాల్ వల్ల గుండె సంబందిత వ్యాధులతో బాధపడటం లేదా చనిపోవడం జరుగుతున్నది. అయితే దీన్ని ఎప్పటికప్పుడు కరిగించుకుంటూ పరిమితి దాటకుండా చూసుకోవడమే. ఆరోగ్యం అయితే తెర్మోజేనేసిక్ ద్వారా క్యాప్సికం జీవక్రీయ ప్రక్రీయను పెంచుతాయి. కొవ్వును కరిగించడంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది. మామూలు మిరప కాయల్లో కేప్సేసిస్ ఉంటుంది. ఈ రసాయనం వల్లే అవి కరంగా ఉంది, క్యాలరీలను కరిగించడంలో సహకరిస్తాయి. ఆహారంలో కారం లేని ఈ క్యాప్సికం ను చేర్చుకుంటే జీవక్రీయ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.