* ఆర్థిక మందగమనంతో ఆటోమొబైల్ రంగం కుదేలైన క్రమంలో పండుగ సేల్స్ ఊరట కల్పించాయి. అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా ప్రయాణీకుల వాహన విక్రయాలు 0.28 శాతం పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ సొసైటీ (ఎస్‌ఐఏఎం) గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది అక్టోబర్‌లో 2.84,223 వాహనాలు విక్రయించగా, ఈ అక్టోబర్‌లో 2,85,027 వాహనాలు అమ్ముడయ్యాయి.
*రాష్ట్ర విభజన తరువాత మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు గురించి ఇంకా పలు జాతీయ అంశాలు గురించి మాట్లాడే నాయకులూ తెలుహ్గు రాష్ట్రాల్లో కరువైన సందర్భంలో ఏపీ నుంచి కాంగ్రెస్ నాయకుడు ఎం ఎం పళ్ళం రాజు తెరమీదకు రావడం సుభాపరినామం.
*ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) తన అకౌంట్ హోల్డర్స్‌కు మరింత స్వేచ్ఛను ఇచ్చింది. సొంతంగా అకౌంట్ హోల్డర్సే యునివర్సల్ అకౌంట్ నెంబర్(యూఏఎన్)ను ఆన్‌లైన్‌లో జనరేట్ చేసుకునే కొత్త ఫెసిలిటీని లాంచ్ చేసింది.
*స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకం నేపథ్యంలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎ్సఎన్ఎల్) ఉద్యోగుల సంఖ్య దాదాపు సగం వరకు తగ్గే అవకాశం ఉంది.
*దక్షిణాది రాష్ట్రాల్లో కొత్తగా నాలుగు వైద్య పరికరాల (మెడికల్ డివైజెస్) తయారీ పార్కుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
*తమ దేశంలో మరో భారీ చమురు నిక్షేపాన్ని కనుగొన్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఇరాక్ సరిహద్దుల్లోని కుజెస్థాన్ రాష్ట్రంలో కనుగొన్న ఈ నిక్షేపం పరిమాణం 5,300 కోట్ల పీపాల వరకు ఉంటుందని అధ్యక్షుడు హసన్ రొహాని ప్రకటించారు.
*బంగాళాఖాతంలోని కేజీ-డీ6 బ్లాక్లో కొత్తగా తీయనున్న గ్యాస్ ధరపై రిలయన్స్ వెనక్కి తగ్గింది. మూల ధరను చాలా ఎక్కువగా నిర్ణయించారంటూ కీలక వినియోగదారులు నిరసన తెలపడంతో తాజాగా ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
*బంగాళాఖాతంలోని కేజీ-డీ6 బ్లాక్లో కొత్తగా తీయనున్న గ్యాస్ ధరపై రిలయన్స్ వెనక్కి తగ్గింది. మూల ధరను చాలా ఎక్కువగా నిర్ణయించారంటూ కీలక వినియోగదారులు నిరసన తెలపడంతో తాజాగా ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
*వరుసగా మూడో నెలలోనూ భారత మార్కెట్లో విదేశీ పోర్టుఫోలియో మదుపరుల (ఎ్ఫపీఐ) పెట్టుబడులు కొనసాగుతున్నాయి.
ఊపందుకున్న వాహన విక్రయాలు-వాణిజ్యం-11/11

Related tags :