WorldWonders

భారతీయుల నల్లధనం స్విస్ ప్రభుత్వపరం

Indian's Hibernating Black Money To Be Claimed By Switzerland Government

భారత్లో వందల కోట్లు సంపాదించి (అక్రమ సంపాదనా పరులు కూడా) స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న వారెందరో. అక్రమార్కుల పని పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. స్విస్ బ్యాంకులో భారతీయులకు సంబంధం ఉన్న కొన్ని ఖాతాల్లోని డబ్బులను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. గత కొన్నేళ్లుగా ఆ ఖాతాలన్నీ నిద్రాణావస్థలో ఉన్నాయి. దీంతో స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణ్రయం తీసుకుంది. ఆయా ఖాతాల్లోని నగదును అంతా అక్కడి ప్రభుత్వపరం చేయనుంది. 2015 నుంచి నిద్రాణావస్థలో ఉన్న పలు ఖాతాలకు సంబంధించిన వివరాలను స్విస్ ప్రభుత్వ సేకరిస్తోంది. ఇందులో దాదాపు 10కి పైగా ఖాతాలు భారతీయులకు సంబంధించినవి కావడం గమనార్హం. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఖాతాలు తెరిచి వాటిని ఇప్పటికీ కొనసాగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం గుర్తించింది. గత ఆరేళ్లుగా ఇవి తమ ఖాతాలేనని ఏ భారతీయ పౌరుడూ వాటిని క్లెయిం చేసుకోలేదని స్విస్ అధికారులు తెలిపారు. వచ్చే నెలలో వీటి గడువు ముగిసిపోతోంది. మిగిలిన ఖాతాలకు 2020 వరకూ అవకాశం ఉంది. దా దాపు 2,600 ఖాతాలు 2015 నుంచి నిద్రాణావస్థలో ఉన్నాయని వీటిలో మొత్తం రూ.45 మిలియన్ స్విస్ఫ్రాంక్స్(రూ.300కోట్లు) ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఖాతాలు 1955 నుంచి కొనసాగుతున్నాయట.