DailyDose

శివసేన సంచలన ఆరోపణలు-రాజకీయ-11/11

Shivsena Alleges BJP Wants Presidential Rule In Maharashtra-Telugu Political News Rounup Today-11/11

* మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ కుట్రపన్నుతోందంటూ శివసేన సంచలన ఆరోపణలు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై సోమవారం సాయంత్రం 7:30 గంటల్లోగా అభిప్రాయం తెలపాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ గడువు విధించడం వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రావత్ ఆరోపించారు. గవర్నర్‌ ఆహ్వానంపై స్పందించేందుకు శివసేనకు సమయం చాలకపోతే… అదే అదనుగా రాష్ట్రపతి పాలన విధించవచ్చని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భావిస్తోందని రావత్ వ్యాఖ్యానించారు. ఇవాళ జరిగిన ఓ మీడియా సమావేశంలో సంజయ్ రావత్ మాట్లాడుతూ.. ‘‘ గవర్నర్ మాకు మరింత సమయం ఇస్తే ప్రభుత్వ ఏర్పాటు సులభంగా ఉండేది. బీజేపీకి 72 గంటల సమయం ఇచ్చారు. కానీ మాకు మాత్రం అతి స్వల్ప సమయం ఇచ్చారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ రచించిన వ్యూహమిది…’’ అని పేర్కొన్నారు.
* మిషన్ బిల్డ్ కాదు మరో క్విడ్ ప్రోకోకి తెర..
మిషన్ బిల్డ్ పేరుతో ఏపీ అమ్మకానికి పెట్టారు.జగన్ తప్ప ప్రభుత్వ భూములు, ఆస్తులు అమ్మే సీఎం రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు.ఏపీ మిషన్ బిల్డ్ అనే పేరుకి బదులు అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అని పెడితే ప్రజలకు అర్ధం అవుతుంది.. సంపద సృష్టించడం చాలా కష్టం అనేది ముఖ్యమంత్రి గ్రహించాలి.సంపద సృష్టించడం చేతగాని జగన్మోహన్ రెడ్డి దీనిపై చంద్రబాబు దగ్గర క్లాసులు తీసుకోవాలి..విజయవాడ లో ప్రభుత్వ ఆస్తులు అమ్మితే సహించేది లేదు.సీఎం వెంటనే ఆస్తులు అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది.అమరావతి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు 2లక్షల కోట్ల సంపద సృష్టిస్తే జగన్ దానిని స్మశానం గా మార్చారు
*బలహీన పడుతున్న కాంగ్రెస్ బలపడుతున్న భాజపా
మున్సిపల్ ఎన్నికల్లో భాజపాతోనే మజ్లీస్ ప్రధాన పోటీ అని ఆ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఆదివారం మజ్లీస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన హైదరబాద్ దారుస్సలాంలో జరిగిన జిల్లా, పట్టణ, స్థాయి పార్టీ ముఖ్య బాద్యుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశ నలుమూలల మజ్లీస్ మంచి ఆదరణ ఉందని రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల్లో సైతం సత్తా చాటాలన్నారు.
*సంఖ్యా బలంలేని భాజపా..
భుత్వం ఏర్పాటుకు నిరాకరించిన నేపథ్యంలో ‘మహా’ బంతి శివసేన కోర్టులోకి వచ్చింది. ఇప్పుడు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు కోసం ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అదే సాకారమైతే శివసేన సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. అయితే సేనకు బద్దశత్రువులైన ఎన్సీపీ, కాంగ్రస్లు మద్దతిస్తాయా? లేదా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేమని భాజపా తేల్చిచెప్పిన నేపథ్యంలో ‘మహా’ బంతి ఇప్పుడు శివసేన కోర్టులో ఉంది.గవర్నర్ భగత్ కోశ్యారీ ప్రభుత్వం ఏర్పాటుచేయాలని శివసేనను ఆహ్వానించారు. ఇవాళ సాయంత్రం 7.30లోపు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గడువు విధించారు. ఈ మేరకు రాజ్భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.వ్యూహాలకు పదునుసమయం తక్కువ ఉన్న నేపథ్యంలో శివసేన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత ఉద్ధవ్ ఠాక్రే భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటులో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుశివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో శరద్పవార్, సోనియాలతో మంతనాలు చేసేందుకు శివసేన నేత సంజయ్ రౌత్ రంగంలోకి దిగారు. ఇదే పనిపై హుటాహుటిన దిల్లీ వెళ్లారు. కాంగ్రెస్, ఎన్సీపీ నేతలతో భేటీ అయి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరనున్నారు.
*తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే
రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గుట్ట వద్ద కోటి రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గుట్ట వద్ద నిర్వహించిన సమావేశంలో రెడ్యానాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేటీఆర్కు ఉన్న వ్యక్తిత్వం మరే నాయకుడికి లేదన్నారు. విదేశాల్లో చదివి విజన్ వున్న నాయకుడని కొనియాడారు.
*ముఖ్యమంత్రి పదవి శివసేనదే : సంజయ్‌ రౌత్‌
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి శివసేనదే అని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంజయ్‌ రౌత్‌ తేల్చిచెప్పారు. ఇవాళ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటు చేయకుండా బీజేపీ వెనక్కి తగ్గడమంటే మహారాష్ట్ర ప్రజలను అవమానపరచడమే అని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధపడింది. ఎన్నికల ముందు 50-50 ఫార్ములాకు అంగీకరించిన బీజేపీ.. ఫలితాలు వచ్చిన తర్వాత వెనక్కి తగ్గారు. 50-50 ఫార్ములాను అనుసరిస్తే నష్టమేంటి? అని బీజేపీ నాయకులను సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని సంజయ్‌ చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు చేయాలని గవర్నర్ తమకు తక్కువ సమయం ఇచ్చారు. ఇదంతా బీజేపీ ప్రణాళిక.. రాష్ర్టపతి పాలన విధించేందుకు బీజేపీ పావులు కదుపుతుందని సంజయ్ రౌత్ చెప్పారు. ఇక ఇవాళ సాయంత్రం 7:30 గంటల్లోపు ప్రభుత్వ ఏర్పాటు విషయాన్ని చెప్పాలని శివసేనకు ఆ రాష్ట్ర గవర్నర్‌ డెడ్‌లైన్‌ విధించిన సంగతి తెలిసిందే.
*ఆసక్తి రేపుతున్న మహారాష్ట్ర రాజకేయం
సంఖ్యా బలంలేని భాజపా.. ప్రభుత్వం ఏర్పాటుకు నిరాకరించిన నేపథ్యంలో ‘మహా’ బంతి శివసేన కోర్టులోకి వచ్చింది. ఇప్పుడు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు కోసం ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అదే సాకారమైతే శివసేన సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. అయితే సేనకు బద్దశత్రువులైన ఎన్సీపీ, కాంగ్రస్లు మద్దతిస్తాయా? లేదా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేమని భాజపా తేల్చిచెప్పిన నేపథ్యంలో ‘మహా’ బంతి ఇప్పుడు శివసేన కోర్టులో ఉంది.గవర్నర్ భగత్ కోశ్యారీ ప్రభుత్వం ఏర్పాటుచేయాలని శివసేనను ఆహ్వానించారు. ఇవాళ సాయంత్రం 7.30లోపు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గడువు విధించారు. ఈ మేరకు రాజ్భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
*శరద్ పవార్‌తో ఉద్థవ్ థాకరే భేటీ
శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ఇవాళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్ వేదికగా ఇరు పార్టీల అధినేతల మధ్య మంతనాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ శివసేన పార్టీని ఆహ్వానించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఇవాళ సాయంత్రంలోగా అభిప్రాయం తెలపాల్సి ఉండడంతో.. మధ్యాహ్నం 2:30 గంటలకు శివసేన ప్రతినిధుల బృందం గవర్నర్‌తో సమావేశం కానుంది. తమకున్న మద్దతుపై గవర్నర్‌కు లేఖ అందజేయనుంది. ప్రభుత్వ ఏర్పాటుపై స్పందించాల్సిందిగా శివసేనకు ఇవాళ సాయంత్రం 7:30 గంటల వరకు గవర్నర్ గడువు విధించిన సంగతి తెలిసిందే. దీంతో శివసేనకు మద్దతు ఇవ్వడంపై అటు కాంగ్రెస్, ఇటు ఎన్సీపీ పార్టీలు ఇవాళ కోర్ కమిటీ సమావేశాలు నిర్వహించాయి.
*మిషన్ బిల్డ్ కాదు మరో క్విడ్ ప్రోకో: పంచుమర్తి అనురాధ
మిషన్ బిల్డ్ పేరుతో ఏపీని అమ్మకానికి పెట్టారని టీడీపీ అధికారప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మిషన్ బిల్డ్ కాదు మరో క్విడ్ ప్రోకోకు ప్రభుత్వం పాల్పడుతుందని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా వేల ఎకరాలు జగన్ కొట్టేసినట్టు సీబీఐ నిర్ధారించిందని, దానికి సంబంధించి ఇప్పటికీ జగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందేనని అన్నారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో అదేదోరణి అవలంభించడానికి ప్రయత్నిస్తున్నారని అనురాధ విమర్శించారు. టీడీపీ దీనిని తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.
సంపద సృష్టించడం చేతకాకపోతే చంద్రబాబు దగ్గర క్లాసులు తీసుకోవాలని అనురాధ సూచించారు. రాజధానికి సంబంధించి రూ. 2 లక్షల కోట్ల సంపదను చంద్రబాబు కట్టబెడితే.. దాన్ని ఇవాళ స్మశానంగా మార్చారని విమర్శించారు. సంపద సృష్టించడం చాలా కష్టం అనేది సీఎం జగన్‌ గ్రహించాలన్నారు. విజయవాడలో ప్రభుత్వ ఆస్తులు అమ్మితే సహించేది లేదని, ఆస్తులు అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అనురాధ డిమాండ్ చేశారు.
*భాజపాది అహంకారం’-శివసేన నేత సంజయ్‌ రౌత్‌ విమర్శలు
మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. భాజపాతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన శివసేన.. తాజా పరిణామాలతో ఎన్డీయే నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది. అయితే భాజపా అహంకార ధోరణి వల్లే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితులు చోటుచేసుకున్నాయని శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. భాజపా తన మాట మీద నిలబడనప్పుడు ఇక రెండు పార్టీల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండబోవని స్పష్టం చేశారు.
*కేంద్ర మంత్రిగా నిష్క్రమిస్తా: శివసేన ఎంపీ
ఉత్కంఠ రేకెత్తిస్తున్న మహారాష్ట్ర రాజకీయాల్లో సోమవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన నేత, కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ మంత్రి అరవింద్‌ సావంత్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘శివసేనవైపే నిజం ఉంది. ఇలాంటి తప్పుడు వాతావరణంలో దిల్లీ ప్రభుత్వంలో ఇంకా ఎందుకు ఉండాలి. అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. దిల్లీలో దీనిపై ఈరోజు ఉదయం మీడియా సమావేశం నిర్వహిస్తా’’ అని ట్విటర్‌లో అరవింద్‌ సావంత్‌ ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో గవర్నర్‌ శివసేనను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే అరవింద్‌ సావంత్‌ తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన ముందుకు సాగుతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే శివసేనకు కాంగ్రెస్‌, ఎన్సీసీల మద్దతు తప్పనిసరి. శివసేనకు మద్దతు ఇవ్వాలంటే ఆ పార్టీ ఎన్‌డీయే నుంచి బయటకు రావాల్సిందేనని ఎన్‌సీపీ షరతు విధించింది.
*మహా రాజకీయం: ఉద్ధవ్ ఠాక్రేను సీఎం చేయాలి
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా భాజపాను ఆ రాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియారి ఆహ్వానించిన నేపథ్యంలో అక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. తమ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయాల్సిందేనని శివసేన పట్టుబడుతున్న నేపథ్యంలో తాజాగా మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను సీఎంను చేయాలంటూ ఆదివారం ఉదయం ఆయన ఇంటి సమీపంలో ఓ హోర్డింగ్ వెలిసింది.
*భాషా సంఘం ఏం చేస్తోంది: పవన్
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైన నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. తెలుగు మాధ్యమం ఆపేస్తుంటే అధికార భాషాసంఘం ఏం చేస్తోందని ట్విటర్లో ఆయన ప్రశ్నించారు. మాతృభాషను ఎలా పరిరక్షించుకోవాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసి వైకాపా నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. తెలుగు భాష గొప్పదనం అర్థమైతే పాఠశాలల్లో నిషేధం విధించరని ఆయన దుయ్యబట్టారు.
*కాంగ్రెస్తో శత్రుత్వం లేదు: శివసేన
మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భాజపాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్వారీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన తమ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించింది.ముంబయిలోని ఓ హోటల్లో వాళ్లను ఉంచారు. శనివారం రాత్రి ఆదిత్య ఠాక్రే కూడా వారితోనే బస చేశారు. భాజపా ప్రభుత్వం ఏర్పాటు విషయమై శివసేన నేత సంజయ్ రౌత్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. గవర్నర్ నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
*భాజపాను వ్యతిరేకిస్తే సేనకు మద్దతిస్తాం
ఎన్సీపీ నేత కీలక వ్యాఖ్యలు
భాజపాను వ్యతిరేకిస్తే సేనకు మద్దతిస్తాం ఏదేమైనా ప్రతిపక్షంలోనే కూర్చుంటామని తెగేసి చెప్పిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ భాజపాను ఆహ్వానించిన నేపథ్యంలో ఎన్సీపీ పార్టీ నేత నవాబ్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. బల నిరూపణలో శివసేన భాజపాకు అనుకూలంగా ఉండకపోతే ఆ పార్టీకి మద్దతిస్తామని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
*‘జగన్వి విలువలతో కూడిన రాజకీయాలు’
మంత్రి వెల్లంపల్లి
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించడం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో నిర్వహించిన నరెడ్కో ప్రాపర్టీ షో-2019ను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో వెల్లంపల్లి మాట్లాడారు. స్పీకర్కు లోకేశ్ బహిరంగ లేఖ రాయడంపై ఆయన స్పందిస్తూ గతంలో తెదేపా ప్రభుత్వం వైకాపా ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసినా అప్పటి స్పీకర్ చర్యలు తీసుకోలేదన్నారు.
*అయోధ్య తీర్పు భారతీయుల విజయం:పవన్
అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకరి విజయం.. మరొకరి పరాజయంగా చూడకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సుప్రీం తీర్పుపై ట్విటర్లో ఆయన స్పందించారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది భారతీయుల విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ప్రజలంతా గౌరవించిన తీరే ఇందుకు నిదర్శమన్నారు. ఇది ఒక సామరస్య పూర్వక పరిష్కారమని..శతాబ్ధాల నుంచి అపరిష్కృతంగా ఉన్న వివాదానికి ఒక ముగింపు లభించిందని చెప్పారు. మనిషి పుట్టిన తర్వాతే మతాలు పుట్టాయని, దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలను ఈ సందర్భంగా మననం చేసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. ముందు మనుషులను గౌరవిద్దామని ఆయన సూచించారు.
*అణచివేత చర్యలను సహించం: భట్టి
ప్రజల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అణచి వేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలకు కనీస హక్కులు లేకుండా చేస్తోందని ఆయన విమర్శించారు. గాంధీభవన్లో పార్టీ ముఖ్యనేతలతో భట్టి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నేతలు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, వీహెచ్, సంపత్కుమార్, వంశీచంద్రెడ్డి, బలరాంనాయక్, కుసుకుమార్ తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ చిన్న ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టినా కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.