NRI-NRT

దుబాయిలో బిర్యానీస్ & మోర్ ప్రారంభం

Biryanis & More Opens 50th Branch In Dubai-Suryadevara Ramanaidu-దుబాయిలో బిర్యానీస్ & మోర్ ప్రారంభం

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందిన ప్రముఖ నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్ బిర్యానీస్ & మోర్ తన 50వ శాఖను దుబాయిలో ప్రారంభించింది. ఈ రెస్టారెంట్‌ను ప్రముఖ చలనచిత్ర నటుడు బ్రహ్మానందం చేతుల మీదుగా ప్రారంభించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దుబాయ్, కెనడా దేశాల్లో బిర్యానీస్ & మోర్ శాఖలు ఏర్పాటు చేశామని ఈ సంస్థ సిఈవో సూర్యదేవర రామానాయుడు(సూర్య) TNIకి తెలిపారు. త్వరలోనే దుబాయిలో మరొక శాఖను, కువైట్, బహరీన్, ఖతార్ తదితర అరబ్ దేశాల్లో బిర్యానీస్ & మోర్ శాఖలను ప్రారంభిస్తున్నట్లు సూర్య తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే బిర్యానీస్ మోర్ శాఖలు 12 ఉన్నాయని మరికొన్ని శాఖలను జంట నగరాల్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రధాన పట్టణాల్లో తమ రెస్టారెంట్లను ఇప్పటికే ఏర్పాటు చేశామని మరికొన్ని చోట్ల ఏర్పాటు చేయబోతున్నామని సూర్యా తెలిపారు.