DailyDose

ఎంపీ ఓవైసీపై కేసు-నేరవార్తలు-11/12

Case ldoged on MP Owaisi-Telugu Crime News Today-11/12

*హైదరాబాద్ ఎంపీ, ఎం ఐ ఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పై మధ్యప్రదేశ్ లోని జహంగీర్ దాస్ పోలీస్ స్టేషన్ లోకేసు నమోదైంది. అయోధ్య పై సుప్రీం కోర్టు ఎచ్చిన్ తీర్పు పై అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
* జమ్మూదోడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 12 మంది మృతి, 4గురి పరిస్థితి విషమంమరింత సమాచారం అందాల్సి ఉంది
* ఛీటింగ్ కేసులో ముంబై పోలీసులు జ్యువెలరీ షోరూం యజమానులను అరెస్ట్ చేశారు. ఇద్దరు సోదరులు జయేశ్ రసిక్ లాల్ షా, నీలేశ్ రసిక్ లాల్ షా సబర్బన్ ఘాట్‌కోపర్ లో జ్యువెలరీ షోరూం నిర్వహిస్తున్నారు. తమ షోరూంలో నగదు డిపాజిట్లు చేస్తే మంచి రాబడి వస్తుందని కస్టమర్లను నమ్మించారు. జ్యువెలరీ షాపు యజమానులు వివిధ స్కీంలు పెట్టి అందరినీ ఆకర్షించారు. వారి మాటలు నమ్మి చాలా మంది నగదు డిపాజిట్లు చేశారు
*గొల్లపూడిలోని నారాయణ కళాశాల హాస్టల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థి రామాంజనేయరెడ్డి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న అతను.. కాలేజీ హాస్టల్‌లోని రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యతో హాస్టల్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళాశాల యాజమాన్యం వేధింపులవల్లే రామాంజనేయరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
* నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఇద్దరు పోలీసులు తన్నుకున్నారు. గల్లా పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని భాంద్రా పట్టణంలో చోటు చేసుకుంది.
* పెద్దేముల్‌ మండలం రొంపల్లిలో దారుణం జరిగింది. ఓ కుమారుడు తన తల్లిని కత్తితో పొడిచి చంపాడు.
* కోర్టు రూంలో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు లాయర్లు మృతి చెందారు. ఈ ఘటన థాయ్‌లోని చందబురి ప్రొవిన్షియల్ కోర్టులో జరిగింది.
* సెప్టిక్ ట్యాంకులో ఇరుక్కున్న తన సోదరుడిని రక్షించడానికి సెప్టింగ్ ట్యాంక్‌లోకి దిగిన  ఏళ్ల యువకుడు మరణించాడు. వాస్తవానికి ఇతడు కూడా పారిశుధ్య కార్మికుల్లో ఒకడు. ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. చైన్నైలో ప్రఖ్యాతి గాంచిన ఎక్స్‌ప్రెస్ అవెన్యూ మాల్‌లో మంగళవారం ఉదయం జరిగిందీ సంఘటన.
* రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. దేశ్నోక్‌ వద్ద కారు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
*తమిళనాట బ్యానర్లు, ఫ్లెక్సీల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. అధికార పార్టీ జెండా స్తంభం కారణంగా ఓ యువతి కాళ్లపై నుంచి లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన సదరు యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
*ఇటీవల కలింగపట్నం బీచ్‌ లో గల్లంతైన ఇచ్చాపురం టౌనుకి చెందిన వై.నారాయణ పండా (17) విద్యార్థి మఅతదేహం మంగళవారం ఉదయం పోలాకి మండలం కొత్తరేవు సముద్ర తీరానికి చేరినట్లు ఎస్‌ఐ చిన్నం నాయుడు తెలిపారు.
*ఓ మాజీ జవాన్ జైల్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. దొంగతనం కేసులో అరెస్టైన ఆయన.. తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
*కొహెడలోని వరికోల్‌లో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది…
*లిఫ్ట్ రాకముందే అందులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.
*రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేశ్‌నోక్‌ వద్ద కారు, ట్రక్కు ఢీ కొని ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురికిపైగా తీవ్ర గాయాలయ్యాయి.
*నెల్లూరు జిల్లా సంగం మండలం వంగల్లులో విషాద ఘటన జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా కాలువలో స్నానానికి వెళ్లి బాలిక మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
*బంగ్లాదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారు. బంగ్లాదేశ్‌లోని బ్రహ్మన్ బరియాలోని మండోభాగ్ రైల్వేజంక్షన్ లో మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు రెండు రైళ్లు ఢీకొన్నాయి.
*చలి మంట అంటుకుని వృద్ధురాలు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం యవాపూర్లో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన కావలి రాములమ్మ ఈ నెల 9న రాత్రి ఇంటి ముందు చలి మంట కాచుకుంటుండగా చీరకు నిప్పంటుకుని గాయపడింది. చుట్టుపక్కలవారు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
*కార్తీక మాసంలో కుటుంబ సమేతంగా పరమ శివుడిని దర్శించుకోవాలని భావించారు. శివాలయానికి చేరుకొనేందుకు పిల్లాపాపలతో కలిసి వచ్చారు. ఇంతలో ఓ లారీ మృత్యువు రూపంలో వారిపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనతో నలుగురు దుర్మరణం పాలవగా, అయిదుగురు క్షతగాత్రులైన ఘటన గుంటూరు జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
*అత్యున్నత ఫ్రెంచి పౌర పురస్కారం ‘లెజియన్ డి హొన్యుర్’ను ఆ దేశ అధ్యక్షుడి చేతుల మీదుగా అందుకున్న ఒక ప్రొఫెసర్ హంతకుడిగా మారాడు. 63 సంవత్సరాల రష్యన్ చరిత్ర ఆచార్యుడు ఒలెగ్ సొకొలోవ్, 24 సంవత్సరాల తన ప్రేయసి చేతులు ఉన్న ఒక సంచితో పోలీసులకు దొరికిపోయాడు.
*బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్పై పెంచుకున్న ఇష్టం ఓ మహిళ మెడకు యమపాశంగా మారింది. తన భార్య ఓ స్టార్ను అంతగా ఆరాధించడం, ఆయన సినిమాలే చూడటం ఇష్టంలేని భర్త అసూయతో భార్యను హత్య చేశాడు.
*గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిమ్మాపురం సమీపంలో రోడ్డుపై నిలుచుకున్న వారిపైకి ఓ లారీ దూసుకెళ్లింది.
*దొంగలు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. పప్పులో కాలేసి కొన్ని సార్లు అడ్డంగా దొరికిపోతుంటారు.
*కుటుంబ కలహాలతో కన్నతల్లిని కత్తితో పొడిచాడో కన్న కొడుకు.. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం పోలీస్ ఠాణా పరిధిలో సోమవారం రాత్రి జరిగింది.
*సంచలనం సృష్టించిన ఐఎంఎస్ మందుల కుంభకోణంలో ఐదుగురు నిందితుల పోలీసు కస్టడీ సోమవారం ముగిసింది. దాంతో వారిని న్యాయస్థానంలో హాజరుపరిచి, ఆ తరువాత జైలుకు తరలించారు.
*పాలనాధికారి ప్రజావాణి నిర్వహిస్తుండగానే సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలోని చెట్టుపై రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటనిది.
*ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని మోట్ల మల్లికార్జునపురం ఏపీ మోడల్ పాఠశాలలో పొరుగు సేవల కింద పని చేస్తున్న ఇద్దరు వంట మనుషులు సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
*విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి పట్టణంలో సోమవారం కలువపూల కోసం చెరువులో దిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
*సిద్దిపేట జిల్లా కొహెడ మండలం వరికోలులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వాగులో మునిగి మృతి చెందారు. వరికోలు గ్రామానికి చెందిన కంటె నిఖిల్‌(19), కూన ప్రశాంత్‌(20), పి.వరప్రసాద్‌(18) మంగళవారం ఉదయం కార్తీక పౌర్ణమి కావడంతో స్నానం చేసుకునేందుకు గ్రామశివారులో ఉన్న మోయతుమ్మిదవాగులోకి మృత్యువాతపడ్డారు.
* పెద్దేముల్‌ మండలం రొంపల్లిలో దారుణం జరిగింది. ఓ కుమారుడు తన తల్లిని కత్తితో పొడిచి చంపాడు. కుటుంబ కలహాలతో కుమారుడు మస్తాన్‌(35), తల్లి మహబూబ్‌ బీ(58)తో నిన్న రాత్రి గొడవపడ్డాడు.
* కోహెడ మండలం వరికోల్‌ గ్రామంలో విషాదం నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానికంగా ఉన్న వాగులో స్నానం చేసేందుకు ముగ్గురు బాలురు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఆ ముగ్గురు నీటిలో మునిగి చనిపోయారు. మృతి చెందిన ముగ్గురు బాలురను నిఖిల్‌, ప్రశాంత్‌, వరప్రసాద్‌గా గుర్తించారు. వీరి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
* రాజస్థాన్‌లోని సాంబార్‌ సరస్సు వద్ద విషాదం నెలకొంది. సుమారు వెయ్యికి పైగా పక్షులు మృతి చెందాయి.