DailyDose

హోండా ప్లాంట్ల మూసివేత-వాణిజ్యం-11/12

Haryana Honda Plant Closing-Telugu Business News Roundup Today-11/12-హోండా ప్లాంట్ల మూసివేత-వాణిజ్యం-11/12

* హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) హర్యానా, మానేసర్‌లోని తన ప్లాంట్‌లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు విఫలం కావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకంది. సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సంస్థ నోటీసు విడుదల చేసింది.
* వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,100, విజయవాడలో రూ.38,850, విశాఖపట్నంలో రూ.39,290, చెన్నైలో రూ.37,990గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,320, విజయవాడలో రూ.36,000, విశాఖపట్నంలో రూ.36,140, చెన్నైలో రూ.36,360గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,100, విజయవాడలో రూ.45,600, విశాఖపట్నంలో రూ.45,600, చెన్నైలో రూ.47,700 వద్ద ముగిసింది.
* చెన్నై శివారులో ఇంజనీరింగ్, దంత, నర్సింగ్ కళాశాలలు, ఆసుపత్రిని నిర్వహిస్తున్న ప్రముఖ విద్యా సంస్థలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రూ.350 కోట్లు లెక్కల్లో చూపకుండా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించారు.
* కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న సంస్కరణ చర్యలు దేశ ఆర్థిక వృద్ధికి ఊతంగా నిలుస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ధీమా వ్యక్తం చేశారు.
* సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఎన్ఎండీసీ ప్రోత్సాహక ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికిగాను కంపెనీ నికర లాభం 10.5 శాతం వృద్ధి చెంది రూ.703.27 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదేకాలంలో నికర లాభం రూ.636.37 కోట్లుగా ఉంది.
* విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వరకు నిర్మించిన హెచ్పీసీఎల్ విస్తరణ పైప్లైన్ ప్రాజెక్టును కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జాతికి అంకితం చేశారు.
* తవ్వేకొద్దీ జెట్ ఎయిర్వే్సలో ప్రధాన ప్రమోటర్ నరేశ్ గోయెల్ అక్రమాలు బయటపడుతున్నాయి. విజయ్ మాల్యా వంటి కేటుగాళ్లు, డొల్ల కంపెనీల ద్వారా కోట్లు కొట్టేస్తే.. గోయెల్ సేల్స్ ఏజెంట్ల (జీఎస్ఏ) ద్వారా జెట్ ఎయిర్వే్సకు చెందిన వేల కోట్ల రూపాయలు తన రహస్య ఖాతాల్లోకి మళ్లించుకున్నారు.
* మొబైల్ ఫోన్ల కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫోన్ల కొనుగోళ్లను కొంత మంది వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో మొబైల్స్పై వెచ్చించే మొత్తం 2.4 శాతం క్షీణించి 3,337.9 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని పరిశోధనా సంస్థ గార్ట్నర్ నివేదిక చెబుతోంది.